Krishna Birth anniversary:టాలీవుడ్ ఇండస్ట్రీ రూపురేఖలు మార్చేసిన కృష్ణ.. అరుదైన రికార్డ్స్..!

Krishna Birth Anniversary.. టాలీవుడ్ సూపర్ స్టార్ కృష్ణ దాదాపు 5 దశాబ్దాల సినీ కెరియర్లో సుమారు 350 కి పైగా సినిమాలలో నటించడమే కాకుండా.. 16 సినిమాలకు దర్శకత్వం కూడా వహించారు.. అంతేకాదు టాలీవుడ్ కి కొత్తదనాన్ని పరిచయం చేసి తెలుగు సినిమాని కొత్తదనం వైపు అడుగులు వేసేలా చేసిన ఘనత ఈయనకే సాధ్యం.. టాలీవుడ్ రియల్ సూపర్ స్టార్ హీరోగా గుర్తింపు తెచ్చుకున్న కృష్ణ 2022 నవంబర్ 14న శ్వాస తీసుకోవడంలో ఇబ్బందిగా ఉండడంతో హైదరాబాద్ హాస్పిటల్లో అడ్మిట్ అయ్యారు.. ఆ తర్వాత మరుసటి రోజు అనగా నవంబర్ 15న హాస్పిటల్ లో చికిత్స పొందుతూ ఆరోజు ఉదయం 4:00 సమయంలో ఆయన తుదిశ్వాస విడిచినట్లు వైద్యులు నిర్ధారించారు. కృష్ణ మరణంతో అటు ఘట్టమనేని కుటుంబం ఇటు తెలుగు సినిమా పరిశ్రమ ఒక్కసారిగా శోకసంద్రంలో మునిగిపోయింది.. ఇక ఈరోజు ఆయన జయంతి. ఈ సందర్భంగా ఆయన తన కెరియర్లో సాధించిన ఘనతలు మరొకసారి వైరల్ గా మారుతున్నాయి. ఇకపోతే నిర్మాతగా పద్మాలయ స్టూడియోస్ ని స్థాపించి పలు చిత్రాలను నిర్మించి.. టాలీవుడ్ కి కొత్తదనాన్ని పరిచయం చేసి రికార్డులు సృష్టించారు.. మరి సూపర్ స్టార్ కృష్ణ ఇండస్ట్రీకి పరిచయం చేసిన ఆ కొత్తదనం ఏమిటో ఇప్పుడు చూద్దాం..

తేనె మనసులు – ఫస్ట్ సోషల్ కలర్:

Krishna Birth Anniversary: Krishna who changed the face of Tollywood industry.. Rare records..!
Krishna Birth Anniversary: Krishna who changed the face of Tollywood industry.. Rare records..!

అప్పటివరకు బ్లాక్ అండ్ వైట్ లో సినిమాలు వచ్చేవి.. కానీ మొదటిసారి ఈయన సోషల్ కలర్ సినిమాగా తేనె మనసులు సినిమాను తెర కెక్కించారు. ఇందులో బొమ్మలన్నీ కూడా రంగురంగులతో కనిపించేసరికి ఈ సినిమాలను చూసి తెలుగు ప్రేక్షకుల ఆనందానికి అవధులు లేవనే చెప్పాలి..

- Advertisement -

గూఢచారి 116 – ఫస్ట్ జేమ్స్ బాండ్:

హాలీవుడ్ తరహాలో మాత్రమే జేమ్స్ బాండ్ చిత్రాలు తెరకెక్కేవి. కానీ ఆ చిత్రాలను తెలుగులో కూడా తెరకెక్కించాలని భావించిన కృష్ణ గూఢచారి 116 సినిమా జేమ్స్ బాండ్ చిత్రాలను ఇండస్ట్రీకి పరిచయం చేశారు.

మోసగాళ్లకు మోసగాడు – ఫస్ట్ కౌబాయ్:

ఇక కౌబాయ్ చిత్రాన్ని కూడా తెలుగు తెరకుపరిచయం చేసిన ఘనత కృష్ణ కే సాధ్యం . మోసగాళ్లకు మోసగాడు సినిమాతో మొదటిసారి కౌబాయ్ అనే పాత్రను ఇండస్ట్రీకి పరిచయం చేశారు..

ఇక ఇవే కాకుండా ఫస్ట్ ఈస్ట్ మ్యాన్ – ఈనాడు

ఫస్ట్ 70MM – సింహాసనం

ఫస్ట్ డి టి ఎస్ – తెలుగువీర లేవరా

ఫస్ట్ సినిమా స్కోప్ – అల్లూరి సీతారామరాజు

ఇలా ఎన్నో డేరింగ్ అండ్ డాషింగ్ నిర్ణయాలు తీసుకుంటూ తెలుగు తెరపై ఎన్నో ప్రయోగాలు చేసి ట్రెండ్ సెట్టర్ గా నిలిచారు కృష్ణ.

ఇక సూపర్ స్టార్ కృష్ణ తరువాత ఆయన వారసుడు మహేష్ బాబు వరుస సినిమాలు చేస్తూ ప్రేక్షకులను అలరిస్తున్నారు .ఇప్పుడు రాజమౌళి దర్శకత్వంలో పాన్ వరల్డ్ చిత్రాన్ని తెరకెక్కించబోతున్న విషయం తెలిసిందే . ఈ సినిమా కోసం ఏకంగా నాలుగు సంవత్సరాల సమయాన్ని కేటాయించినట్లు తెలుస్తోంది. మరి ఈ సినిమాతో మహేష్ బాబు ఎలాంటి రికార్డ్స్ క్రియేట్ చేస్తారు చూడాలి.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు