Krishna Chaitanya: హీరో నితిన్ ను పక్కనపెట్టి మళ్ళీ అదే హీరోతో సినిమా చేయడానికి కారణం ఏంటో

Krishna Chaitanya: తెలుగు ఫిలిం ఇండస్ట్రీకి సాహిత్య రచయితగా ఎంట్రీ ఇచ్చాడు కృష్ణ చైతన్య. ఎన్నో అద్భుతమైన చిత్రాలకు మంచి పాటలను రాశాడు ఆ పాటలు కూడా మంచి హిట్ అయ్యాయి. అయితే నానా రోహిత్ హీరోగా చేసిన రౌడీ ఫెలో సినిమాతో దర్శకుడుగా కూడా తనను తాను ప్రూవ్ చేసుకున్నాడు. రౌడీ ఫెలో సినిమా ఎంత అద్భుతంగా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆ సినిమాకి కృష్ణ చైతన్య అందించిన డైలాగ్స్. ఆ సినిమాను తీసిన విధానం. ఆ సినిమాలో నారా రోహిత్ క్యారెక్టర్జేషన్ డిజైన్ చేసిన విధానం ఇవన్నీ కూడా ప్రేక్షకులకి ఆసక్తికరంగా అనిపించాయి. అయితే ఆ సినిమా తర్వాత కృష్ణ చైతన్య చేసిన సినిమా ఛల్ మోహన్ రంగ. ఈ సినిమాకు కథను త్రివిక్రమ్ శ్రీనివాస్ అందించారు. అయితే ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద ఊహించని విజయాన్ని సాధించలేకపోయింది. ఆ తర్వాత దర్శకత్వానికి కొంత గ్యాప్ ఇచ్చాడు కృష్ణ చైతన్య.

ఇక రీసెంట్గా గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి అనే సినిమాతో మరోసారి దర్సకుడిగా ప్రేక్షకులు ముందుకు వచ్చాడు కృష్ణ చైతన్య. బాక్స్ ఆఫీస్ వద్ద ఈ సినిమా ఊహించిన స్థాయిలో ఆడకపోయినా కూడా కొంతమందికి లాభాలను తీసుకొచ్చి పెట్టింది. సినిమాలు విశ్వక్సేన్ నటించిన విధానం చాలామందిని ఆకట్టుకుంది ఇంతకుముందు ఎప్పుడు కెరియర్ లో నటించని విధంగా ఈ సినిమాలో నటించాడు విశ్వక్. అయితే ఒకసారి ఒక యాక్టర్ తో పని చేసిన దర్శకుడు మళ్ళీ అదే యాక్టర్ తో పని చేయాలి అని కొన్ని సందర్భాల్లో అనుకుంటూ ఉంటారు. ఇకపోతే నితిన్ హీరోగా ఇదివరకే చల్ మోహన్ రంగా సినిమాను చేసిన కృష్ణ చైతన్య తనతోని పవర్ పేట అనే సినిమా చేయడానికి సిద్ధమయ్యాడు.

Gangs Of Godavari

- Advertisement -

ఇకపోతే ప్రస్తుతం పవర్ పేట సినిమాని నితిన్ కాకుండా మళ్లీ విశ్వక్సేన్ తో తెరకెక్కించబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అయితే దీనికి కారణం గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి సినిమా చేస్తున్నప్పుడు విశ్వక్ వర్క్ కి దర్శకుడుగా కృష్ణ చైతన్య ఫిదా అయి ఉండొచ్చు. లేదంటే అనుకున్న విజయం గ్యాంగ్ ఆఫ్ గోదావరి సినిమా ఇవ్వలేదు కాబట్టి, ఈ సినిమాతో ఒక బ్లాక్ బస్టర్ ను విశ్వక్సేన్ కి ఇవ్వాలని ఉద్దేశంతో నితిన్ తో కాకుండా విశ్వక్ తో చేస్తున్నాడు అనుకోవచ్చు. ఇకపోతే ఈ సినిమాను సితార ఎంటర్టైన్మెంట్స్ కాకుండా పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మించనున్నట్లు వార్తలు వస్తున్నాయి. దీని గురించి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు