Krishna: ఆ ఒక్కటే రూ.1000 కోట్ల విలువ.. మహేష్ ను కాదని నరేష్ కోసం..!

Krishna.. తెలుగు సినిమా ఇండస్ట్రీ ఎన్నో అద్భుతాలను చూడడానికి ప్రధాన కారణం సూపర్ స్టార్ కృష్ణ అనే చెప్పాలి.. ఎన్నో కొత్త విధానాలను తెలుగు తెరకు పరిచయం చేసి.. తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకున్నారు.. ఇకపోతే ఆయన తన సుదీర్ఘ ప్రస్థానంలో ఎన్నో ఒడిదుడుకులను కూడా చూశారు.. నటుడిగా.. నిర్మాతగా ఎన్నో ఎత్తుపల్లాలను అధిగమించారు.. అలాగే కోట్ల రూపాయలను సంపాదించారు కూడా.. మరి కృష్ణ తన తదనంతరం తన ఆస్తిని ఎవరికి ఇచ్చారు..? కన్న కొడుకులు రమేష్, మహేష్ లకా..? లేదా రెండవ భార్య విజయనిర్మల కొడుకు నరేష్ కా..? ఈ కోణంలోనే ఒక ఆశ్చర్యకరమైన విషయం వెలుగులోకి వచ్చింది..

ప్రతి రూపాయి సినిమాకే..

ఎలాంటి సినీ నేపథ్యం లేకుండా సినీ పరిశ్రమలోకి అడుగు పెట్టిన సూపర్ స్టార్ కృష్ణ నటుడి గానే కాకుండా నిర్మాతగా మారి చిత్రాలు కూడా నిర్మించారు.. అలాగే దర్శకత్వం వహించారు కూడా.. ఈ క్రమంలోనే ఎన్నో జయాపజయాలు ఎదురుచూసిన ఈయన.. రూ.లక్షల కొద్దీ లాభాలు.. అదే సమయంలో నష్టాలు,ఆర్థిక ఇబ్బందులను కూడా ఎదుర్కొన్నారు.. అయితే ఎన్ని ఇబ్బందులు ఎదుర్కొన్నా కూడా అప్పట్లోనే లక్షల రూపాయలను కూడబెట్టారు.. ప్రస్తుతం వాటి విలువ రూ.వేల కోట్ల పై మాటే. ఇకపోతే ప్రయోగాత్మక చిత్రాలను నిర్మించేందుకు నిర్మాతలు భయపడేవారు.. అప్పుడు కృష్ణ నిర్మాణ బాధ్యతలు తీసుకున్నవారు.. సంపాదించిన ప్రతి రూపాయిను కూడా సినిమాల్లోనే పెట్టుబడి పెట్టేవారు. అలా పద్మాలయ స్టూడియోని నిర్మించి చిత్ర పరిశ్రమ అభివృద్ధికి కృషిచేసి ఒక స్టార్ హీరోగా ఆయన భారీగానే సంపాదించారు.

రూ.1000 కోట్ల ఆస్తి నరేష్ కే..

Krishna: That alone is worth Rs.1000 crores.. for Naresh and not for Mahesh..!
Krishna: That alone is worth Rs.1000 crores.. for Naresh and not for Mahesh..!

నాలుగున్నర దశాబ్దాలుగా కళామతల్లి కి సేవ చేసిన కృష్ణ 1961లో సిల్వర్ స్క్రీన్ కి పరిచయమై.. 2016లో విడుదలైన శ్రీ శ్రీ సినిమాలో చివరిగా నటించారు. ఇక కృష్ణ ఆస్తుల విషయానికి వస్తే.. ఏకంగా రూ .1000 కోట్లకు పైగా విలువైన ఆస్తి నరేష్ కి దక్కినట్లు తెలుస్తోంది. నానక్ రామ్ గూడాలో ఉన్న 12 ఎకరాలు స్థలం నరేష్ పేరిట ఉందనే సందేహాలు కలుగుతున్నాయి నానక్ రామ్ గూడా అడవిలో ఉన్నప్పుడు కృష్ణ, విజయనిర్మల కలసి 12 ఎకరాలు కొనుగోలు చేశారు. అప్పట్లో ఎకరం విలువ రూ .1.3 లక్షలు.. ప్రస్తుతం మార్కెట్ ధర ఎకరం రూ .100కోట్లు. ఇక ఇంకా తక్కువ అంచనా వేసినా.. ఆ 12 ఎకరాల స్థలం ధర రూ .1000 కోట్లకు తగ్గదు అని సమాచారం.. ఆయా ప్రాంతంలో ఇప్పుడు అనేక వ్యాపార సముదాయాలు , సాఫ్ట్వేర్ కంపెనీలు కూడా వచ్చినట్లు తెలుస్తోంది. ఇకపోతే నానక్ రామ్ గూడా లో స్థలం కొన్న వెంటనే కృష్ణ , విజయనిర్మల ఇక్కడికి వచ్చి హౌస్ నిర్మించుకొని.. ఆ ఫామ్ హౌస్ లోనే జీవించినంత కాలం ఉన్నారు.

- Advertisement -

మిగతా ఆస్థి వారికే..

ఇక నరేష్ మొదటి నుండి కృష్ణ, విజయనిర్మలతోనే ఉండేవాడు. నాలుగు ఎకరాలు ఉంచి.. మిగతాది రియల్ ఎస్టేట్ డెవలప్మెంట్ కి ఇచ్చేశారు.. ఇక కృష్ణ మిగతా ఆస్తులు ఆయన కుమారులు, మహేష్, రమేష్ బాబులు పంచుకున్నారని సమాచారం.. మొత్తానికి అయితే నానక్ రామ్ గూడా లో ఉన్న 12 ఎకరాల స్థలం మాత్రం నరేష్ కి వచ్చినట్లుగా తెలుస్తోంది..

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు