Soundarya Song : ఏంటి అదంతా నిజం కాదా.. డైరెక్టర్ కు తెలియకుండా ఇంత జరిగిందా?

Soundarya Song : ఇప్పటిల్లో వస్తున్న సినిమాలు ఎక్కువగా గ్రాఫిక్స్ తో వస్తున్నాయి.. ఉన్నది లేనట్లు, లేనిది ఉన్నట్లు మాయ చేసి చూపిస్తున్నారు.. అంతగా చూపించిన కొన్ని హిట్ అవ్వట్లేదు.. అదే అప్పటి రోజుల్లో వచ్చిన ప్రతి సినిమా సూపర్ హిట్ టాక్ ను అందుకుంది.. ఆ సినిమాల్లోని సాంగ్స్ ఇప్పటికి వినిపిస్తున్నాయి.. పల్లవి, సాహిత్యం తో పాటు కొన్ని లాజిక్స్ జనాలను బాగా ఆకట్టుకున్నాయి.. అందులో ప్రస్తుతం ఓ సాంగ్ గురించి వార్తలు ట్రెండ్ అవుతున్నాయి.. ఆ సాంగ్ లో ఒక్క చీరను రకరకాల రంగుల్లో ఉన్నట్లు చూపించారు.. అయితే అది నిజానికి సినిమాల్లో లేదట.. డైరెక్టర్ కు కూడా తెలియకుండానే రంగులు మారాయట.. తాజాగా ఈ విషయం డైరెక్టర్ సంచలన వ్యాఖ్యలు చేశాడు..

ఆ సినిమా పేరేంటో తెలిసిపోయింది కదూ.. ప్రస్తుతం సౌందర్య సాంగ్ గురించి ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.. సౌందర్య, సాయి కుమార్ నటించిన అంతఃపురం సినిమాలోని అసలేం గుర్తుకు రాదు అనే సాంగ్ కు చాలా మంది ఫ్యాన్స్ ఉంటారు.. ఆ సాంగ్ ను చిత్రమ్మ పాడారు.. అందుకే ఆ పాట ఇప్పటికి బుల్లితెర పై వినిపిస్తుంది.. ఆ సినిమాను డైరెక్టర్ కృష్ణ వంశీ తెరకెక్కించారు.. అయితే పాట మధ్యలో సౌందర్య చీర కలర్ ఆటోమేటిక్ గా మారిపోతుంది. ఇప్పుడు ఈ పాట చూసిన వాళ్లందరికీ అప్పట్లో ఈ కలర్ ఛేంజింగ్ ఎలా చేశారు అని సందేహం వస్తుంది..

ఈ విషయం పై ఓ నెటిజన్ కృష్ణ వంశీని అడిగాడు.. సౌందర్య చీర కలర్స్ మార్చడం అప్పట్లో కొత్త ఐడియా. అసలు ఆ ఐడియా ఎలా వచ్చింది అని అడిగారు. దీనికి కృష్ణవంశీ సమాధానమిస్తూ.. సినిమాలో అలా ఉండదు అండి. రిలీజ్ తర్వాత జెమినీ టీవీ ఛానల్ లో ఎడిటర్ చేంజ్ చేసాడు.. నాకు ఎటువంటి సంబంధం లేదు అని డైరెక్టర్ చెప్పడంతో అందరు అశ్చర్యానికి గురయ్యారు.. ఇన్నాళ్లు డైరెక్టర్ చేసిన మ్యాజిక్ అని అందరు అనుకున్నారు. కానీ ఇది జెమిని టీవీ చేసిన పని అని తెలిసి షాక్ అవుతున్నారు.. నిజానికి ఈ ఒరిజినల్ సాంగ్ లో కేవలం ఎరుపు రంగు చీర మాత్రమే ఉంటుంది.. నిజంగా భలే చేసారుగా.. ఆ సాంగ్ పై ఓసారి లుక్ వేసుకోండి..

Krishna Vamsi Gives Clarity on Soundarya Sarees Color Change in asalem gurthukuradhu song
Krishna Vamsi Gives Clarity on Soundarya Sarees Color Change in asalem gurthukuradhu song

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు