Krishna Vamsi : సీతారామ శాస్త్రి గారును పబ్ కి తీసుకెళ్లిన తరువాత ఆ పాట రాసారు

Krishna Vamsi: క్రియేటివ్ డైరెక్టర్ కృష్ణ వంశీ.. ఈయన గురించి కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. రాంగోపాల్ వర్మ దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేసి ఆ తర్వాత దర్శకుడుగా మారి తెలుగు ఫిలిం ఇండస్ట్రీకి ఎన్నో బ్లాక్ బస్టర్ సినిమాలను అందించారు. అలానే క్రియేటివ్ డైరెక్టర్ అని పేరును కూడా సంపాదించారు. అయితే కృష్ణవంశీ కు సిరివెన్నెల సీతా రామ శాస్త్రి కు మధ్య ఉన్న బాండింగ్ గురించి కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. సిరివెన్నెల సీతా రామ శాస్త్రి పై కృష్ణవంశీకు విపరీతమైన గౌరవం ఉంటుంది.

సీతారామశాస్త్రి పాటలకు ప్రత్యేకమైన స్థానం

కృష్ణవంశీ దర్శకత్వం వహించిన ఎన్నో సినిమాలకు అద్భుతమైన సంగీతాన్ని సిరివెన్నెల సీతారామశాస్త్రి అందించారు. అయితే కృష్ణవంశీ సినిమాల్లో సిరివెన్నెల సీతారామశాస్త్రి పాటలకు ఒక ప్రత్యేకమైన స్థానం ఉంటుంది. కృష్ణవంశీ సినిమాలను ఆ పాటలే కొంతమేరకు నడిపిస్తాయి అని కూడా చెప్పొచ్చు. సింధూరం వంటి సినిమాలు హై ఎలిమెంట్స్ రావడానికి కారణం కూడా సీతారామశాస్త్రి అందించిన లిరిక్స్ అని చెప్పొచ్చు.

Sirivennala Seetharama Sastry

- Advertisement -

పాట కోసమే సినిమా

అలానే ఎప్పుడో సిరివెన్నెల సీతారామశాస్త్రి రాసుకున్న జగమంత కుటుంబం నాది అనే ఒక పాట కోసం కూడా సినిమాను చేసే ఘనత కృష్ణ వంశీ అని చెప్పొచ్చు. ఎవరికి ఇవ్వని పాటను కృష్ణవంశీకి మాత్రమే ఇచ్చారు అంటే సిరివెన్నెల సీతారామశాస్త్రికి కృష్ణవంశీ గారి పైన ఎంత నమ్మకముందు ఈ ఘటనతో మనకు అర్థమవుతుంది. ఇకపోతే ఖడ్గం అనే సినిమాలో ఒక పబ్ సాంగ్ లో కూడా అద్భుతమైన సాహిత్యాన్ని అందించారు సిరివెన్నెల సీతారామశాస్త్రి. అయితే దీని వెనకున్న రహస్యాన్ని వెల్లడిపరిచారు కృష్ణవంశీ.

పాట కోసం పబ్ కి

రీసెంట్ గా సిరివెన్నెల సీతారామశాస్త్రికి సంబంధించిన ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న కృష్ణవంశీ ఖడ్గం సినిమాలోని ముసుగు వెయ్యొద్దు పాట గురించి ఆసక్తికరమైన విషయాలను పంచుకున్నారు. అయితే ఈ పాట కోసం సిరివెన్నెల సీతారామశాస్త్రి గారిని పబ్ కి తీసుకెళ్లారంట కృష్ణవంశీ. అక్కడికి వెళ్లిన తర్వాత అక్కడ సిచ్యువేషన్ అంత టైం టు టైం చూపించారట. అయితే మూడు రోజుల తర్వాత సిరివెన్నెల సీతారామశాస్త్రి కృష్ణవంశీ ఫోన్ చేసి “ముసుగు వెయ్యొద్దు మనసు మీద అంటూ” పల్లవిని వినిపించారట. అక్కడితో డన్ గురువుగారు అనగానే ఆ పాటను పూర్తి చేశారంటూ చెప్పుకొచ్చారు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు