Kristina Joksimovic : మోడల్ పై భర్త అరాచకం… గొంతుకోసి, ముక్కలు ముక్కలుగా నరికి చంపిన సైకో

Kristina Joksimovic : మాజీ మోడల్ పై భర్త చేసిన అఘాయిత్యం తాజాగా బయట పడింది. అతను సైకోలా మారి భార్యను గొంతు కోసి చంపడమే కాకుండా ఏకంగా ముక్కలు ముక్కలుగా కట్ చేసి మాంసంగా మార్చినట్టు తాజాగా వెల్లడైంది. మరి ఇంతకీ ఈ సైకో ఆమెను ఎందుకు చంపాడు? అనే విషయంలోకి వెళ్తే…

ఆత్మరక్షణ కోసం ఇంత దారుణంగా..

నిజానికి ఈ ఘటన ఇప్పుడు జరిగింది కాదు. కానీ ఈ కేసులో షాక్ ఇచ్చే పలు విషయాలను తాజాగా బయట పెట్టింది కోర్టు. అయితే ఈ సంఘటన మన దగ్గర జరగలేదు. అసలు ఏం జరిగిందంటే.. మాజీ మిస్ స్విట్జర్లాండ్ ఫైనలిస్ట్ అయిన క్రిస్టినా జోక్సిమోవిక్ ను ఆమె భర్త థామస్ చంపాడనే ఆరోపణలు ఉన్నాయి. బాసెల్ సమీపంలోని బిన్నింగెన్‌లోని వారి ఇంటిలో ఆమెను భర్త దారుణంగా హత్య చేశాడు. ఫిబ్రవరి 13న 38 ఏళ్ల మోడల్ మృతదేహం ఆమె ఇంట్లో ఉన్న లాండ్రీ ప్రాంతంలో లభ్యమైంది. స్థానిక సమాచారం ప్రకారం “థామస్”గా గుర్తించబడిన ఆమె 41 ఏళ్ల భర్త కొంతకాలం తర్వాత అరెస్టు అయ్యాడు. అయితే అతను నేరాన్ని అంగీకరించాడు. కానీ భార్య కత్తితో దాడి చేయడంతో ఇది ఆత్మరక్షణ చర్య అని పేర్కొన్నాడు. తాజాగా ఈ కేసు విచారణకు రాగా లాసాన్‌లోని ఫెడరల్ కోర్టు బుధవారం తనను విడుదల చేయాలంటూ అతను చేసిన అభ్యర్థనను తిరస్కరించింది

విచారణలో వెన్నులో వణుకు పుట్టించే విషయాలు బయట పడ్డాయి. జోక్సిమోవిక్ మరణానికి ముందు ఆమె గొంతు కోసి చంపినట్లు అధికారులు నిర్ధారించారు. ఆమె భర్త, 41 ఏళ్ల వ్యక్తిని థామస్ అని పిలుస్తారు. ముందుగా అతన్నే అనుమానించిన పోలీసులు అరెస్టు చేశారు. ఆ తరువాత తప్పును ఒప్పుకున్న ఆ సైకో తాను ఆత్మ రక్షణ కోసం ఆ పని చేశాను కాబట్టి తనను విడుదల కోర్టుకు రిక్వెస్ట్ చేశాడు. థామస్ విడుదల కోసం చేసిన అప్పీల్‌ను స్విట్జర్లాండ్‌లోని లౌసాన్‌లోని ఫెడరల్ కోర్టు అతను హత్య చేసినట్లు అంగీకరించిన తర్వాత తిరస్కరించింది. అంతేకాదు ఈ తీర్పు నేరానికి సంబంధించిన కొత్త వివరాలను బయటపెట్టింది. థామస్‌లో “మానసిక అనారోగ్యం సూచనలు” ఉన్నాయంటూ కోర్టు చెప్పింది.

- Advertisement -

Miss Switzerland finalist 'strangled, PUREED in blender by husband

వెలుగులోకి వెన్నులో వణుకు పుట్టించే విషయాలు

పోస్ట్ మార్టం రిపోర్ట్ ప్రకారం జాక్సా, కత్తి, గార్డెన్ షియర్‌లను ఉపయోగించి జోక్సిమోవిక్ శరీరాన్ని ముక్కలు చేశారు. అంతకంటే ముందు ఆమెను ఈ సైకో గొంతు కోసి చంపినట్టు తేలింది. తోట కత్తెర వంటి వాటిని ఉపయోగించి లాండ్రీ గదిలో ఆమె శరీరాన్ని ముక్కలు చేశాడు. ఆమె అవశేషాలను తరువాత హ్యాండ్ బ్లెండర్‌తో ప్రాసెస్ చేసి, వాటిని రసాయన ద్రావణంలో కరిగించకముందే “ప్యూరీడ్” స్థితికి మార్చినట్లు స్థానిక మీడియా సంస్థ వెల్లడించింది. కానీ ఆత్మరక్షణ కోసమే తన భార్యను హత్య చేశానని, ఆమె తనపై కత్తితో దాడి చేసిందని థామస్ ఆరోపించాడు. హత్య తర్వాత, అతను భయాందోళనకు గురై ఆమె శరీరాన్ని ముక్కలు చేయాలని డిసైడ్ అయినట్టు చెప్పాడు. అయితే వైద్య, ఫోరెన్సిక్ సాక్ష్యాలు భిన్నంగా ఉన్నాయి. పోలీసు అధికారులు థామస్ క్రూరమైన ప్రవర్తనకు స్పష్టమైన సాక్ష్యాలను కనుగొన్నారు.

జోక్సిమోవిక్ వ్యక్తిగత జీవితం

జోక్సిమోవిక్ మిస్ నార్త్‌వెస్ట్ స్విట్జర్లాండ్‌గా కిరీటాన్ని దక్కించుకుంది. 2007లో మిస్ స్విట్జర్లాండ్‌కు ఫైనలిస్ట్‌గా నిలిచింది. 2013లో మిస్ యూనివర్స్ పోటీకి మోడల్ డొమినిక్ రిండర్‌క్‌నెచ్ట్‌కు మార్గదర్శకత్వం చేస్తూ, క్యాట్‌వాక్ కోచ్‌గా తన స్వంత వ్యాపారాన్ని స్థాపించింది. ఈ జంటకు ఇద్దరు కుమార్తెలు ఉన్నారు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు