Kushi : సెకండ్ హీరోయిన్ గా కృతి

విజయ్ దేవరకొండ, స్టార్ హీరోయిన్ సమంత జంటగా నటిస్తున్న సినిమా ‘ఖుషి’. కశ్మీర్ బ్యాక్ డ్రాప్ లో బ్యూటిఫుల్ లవ్ స్టోరీ గా రూపొందుతున్న ఖుషి సినిమాకు శివ నిర్వాణ దర్శకత్వం వహిస్తున్నాడు. పాన్ ఇండియ స్థాయిలో సినిమాను రిలీజ్ చేయబోతున్నారు. మైత్రి మూవీ మేకర్స్ సంస్థ నిర్మిస్తోంది. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన పోస్టర్ ను మూవీ యూనిట్ విడుదల చేసింది. ఈ పోస్టర్ లో రౌడీ హీరో విజయ్ దేవరకొండ, సమంత పెళ్లి గెటప్ లో ఉన్నారు.

ఇదిలా ఉండగా తాజా సమాచారం ప్రకారం ఈ చిత్రంలో మరో హీరోయిన్ ఓ స్పెషల్ రోల్ చేయబోతుంది. హీరోయిన్ కృతి శెట్టి ఈ చిత్రం సెకండ్ హాఫ్ లో వచ్చే ఓ కీలక పాత్రలో నటిస్తోందట. పైగా కృతి శెట్టి క్యారెక్టర్ చాలా వినూత్నంగా ఉండబోతుందట. నెగిటివ్ షేడ్స్ తో సాగే ఈ క్యారెక్టర్ చివరకు ఎమోషనల్ గా ఎలా టర్న్ తీసుకుంది.. అలాగే లవ్ విషయంలో పూర్తి పాజిటివ్ క్యారెక్టర్ గా ఎలా మారింది. అనే కోణంలో కృతి శెట్టి పాత్ర సాగుతుందట.

అయితే ఈ వార్తపై ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన అయితే రాలేదు. కాగా ఈ సినిమా కథ ఒక మెచ్యూర్డ్ లవ్ స్టోరీ అని తెలుస్తోంది. శివ నిర్వాణ సినిమా అంటేనే హుందాగా ఉండే ప్రేమ కథలకు కేరాఫ్ అడ్రస్. ఆయన గత చిత్రాలు మజిలీ, నిన్ను కోరి వంటి సినిమాల్లో హృదయానికి హత్తుకునే ప్రేమ కథలు ఉంటాయి. ఆ తరహాలోనే విజయ్ చిత్రం కోసం కూడా మంచి ప్రేమ కథను రాసుకున్నారట శివ నిర్వాణ.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు