Kriti Shetty: దారిలో పడ్డ బేబమ్మ… వయ్యారంగా నడుము తిప్పుతున్న వీడియో వైరల్

Kriti Shetty

Krithi shetty belly dance went viral

“ఉప్పెన” సినిమాతో ఓవర్ నైట్ స్టార్ గా మారిపోయిన కృతి శెట్టి ఆ తర్వాత ఎగసిపడిన అలలా ఒక్కసారిగా సైలెంట్ అయిపోయింది. “ఉప్పెన” మూవీ సక్సెస్ తో వరుస ఆఫర్లు వచ్చినప్పటికీ ఈ బ్యూటీ పెద్దగా ఉపయోగించుకోలేకపోయింది. ప్రాధాన్యత లేని పాత్రలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చి వరుసగా డిజాస్టర్ సినిమాలను తన ఖాతాలో వేసుకుంది. రీసెంట్ గా రిలీజ్ అయిన “కస్టడీ” సినిమా కూడా బెడిసి కొట్టడంతో శృతికి టాలీవుడ్ లో అవకాశాలు కరువయ్యాయి. దీంతో ఇప్పుడు తమిళ, మలయాళ సినిమాల మీద ఫోకస్ చేసి, అక్కడ తన అదృష్టాన్ని పరీక్షించుకుంటుంది. ప్రస్తుతం తెలుగులో ఆమె చేతిలో కేవలం ఒకే ఒక్క సినిమా ఉంది. ఈ నేపథ్యంలోనే తాజాగా సోషల్ మీడియాలో కృతి శెట్టి షేర్ చేసిన వీడియో ఒకటి తెగ వైరల్ అవుతుంది.

ఆ వీడియోలో కృతి శెట్టి బెల్లీ డాన్స్ నేర్చుకుంటూ కనిపిస్తోంది. 2022 లో రిలీజ్ అయిన విజయ్ “బీస్ట్” సినిమాలోని పాపులర్ సాంగ్ “హలమతి హాబీ బో” పాటకు వయ్యారంగా నడుము తిప్పుతూ అందరిని ఆకట్టుకుంటుంది. అయితే ఆ డాన్స్ వీడియోలో తన నాజూకైనా నడుమును చూపిస్తూ, వయ్యారాలు పోతూ కృతి డాన్స్ చేయడం విశేషం. ఇక ఈ వీడియో చూసినవారు ఈ అమ్మడికి ఇప్పటికీ కళ్ళు తెరుచుకున్నాయా అని కామెంట్స్ చేస్తున్నారు. ఎందుకంటే కెరీర్ మొదటి నుంచి ఇప్పటిదాకా కృతి ఒక్క సినిమాలో కూడా గ్లామర్ గా కనిపించలేదు. కనిపించిన ఒకటి అర సినిమాలు కూడా పెద్దగా ఆడలేదు. నిజానికి ఈ బ్యూటీ గ్లామర్ తో పని లేకుండా ఇండస్ట్రీలో రాణిస్తుందని అంతా భావించారు. కానీ కాలం కలిసి రాకపోవడంతో అవకాశాలే లేని పరిస్థితి ఏర్పడింది కృతికి. మొత్తానికి ఇన్నాళ్లకు గ్లామర్ గేట్లు ఎత్తేసి మరింత మంది ఫాలోవర్లను పెంచుకునే పనిలో పడింది బేబమ్మ. ఇప్పుడు కృతి డ్యాన్స్ వీడియో నెట్టింట్లో చక్కర్లు కొడుతోంది.

- Advertisement -

ప్రస్తుతం కృతి తెలుగులో శర్వానంద్ కొత్త సినిమాలో హీరోయిన్ గా నటిస్తోంది. శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీని పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మిస్తోంది. నితిన్ హీరోగా వెంకి కుడుముల దర్శకత్వంలో రాబోతున్న “రాబిన్ హుడ్” సినిమాలో ఈ అమ్మడు ఓ పాత్రలో కనిపించబోతుందని టాక్ నడుస్తోంది. ఇక గతంతో పోల్చుకుంటే ఇప్పుడు అవకాశాలతో పాటు కృతి రెమ్యూనరేషన్ కూడా తగ్గింది. ఒకప్పుడు కోటి రూపాయల వరకు పారితోషకం తీసుకున్న ఈ బ్యూటీ ఇప్పుడు చాలా తక్కువ రెమ్యూనరేషన్ తీసుకుంటున్నట్టు తెలుస్తోంది. బాక్సాఫీస్ వద్ద ఆమె నటించిన సినిమాలన్నీ తుస్సుమనడంతో రెమ్యూనరేషన్ విషయంలో నిర్మాతల డిమాండ్ కు తలొగ్గక తప్పట్లేదు కృతికి. మరి ఇప్పటికైనా గ్లామర్ ఒలకబోయడానికి రెడీ అయిన కృతికి మళ్ళీ మంచి టైం కలిసొస్తుందేమో చూడాలి.

Check out Filmify for the latest Tollywood news in Telugu, and all the Entertainment News, current news in Bollywood and Celebrity News & Gossip, from all Film Industires.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు