Krithi Shetty: ఆ స్టార్‌ హీరోపై మోజుపడుతున్న కృతి ?

Krithi Shetty: టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎంతమంది హీరోయిన్లు ఉన్న సంగతి తెలిసిందే. అందులో క్యూట్ బ్యూటీ కృతి శెట్టి గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఈ ముద్దుగుమ్మ ఉప్పెన సినిమాతో తెలుగు సినీ పరిశ్రమకులోకి అడుగుపెట్టింది. మొదటి సినిమాతోనే మంచి సక్సెస్ సొంతం చేసుకుంది. ఆ సినిమాలో తన నటన, అందం, అమాయకత్వంతో ఎంతోమంది ప్రేక్షకుల మనసులను కొల్లగొట్టింది. ఇక ఈ బ్యూటీ నటనకు ఫిదా అయిన దర్శక నిర్మాతలు సైతం కృతి శెట్టితో వరుసగా సినిమాలు తీశారు.

ఇక కృతి శెట్టి కూడా సినిమా స్టోరీలు వినకుండానే హీరోయిన్గా చేసింది. ఇక అదే కృతి శెట్టికి పెద్ద మైనస్ పాయింట్ అయింది. వరుసగా కొన్ని సినిమాలు డిజాస్టర్లుగా మారాయి. దీంతో ఈ అమ్మడికి ప్రస్తుతం సినిమాల్లో పెద్దగా అవకాశాలు రావడం లేదు. దర్శక నిర్మాతలు సైతం కృతి శెట్టితో సినిమాలు చేయడానికి పెద్దగా ఆసక్తిని చూపడం లేదు. వరుసగా ఫ్లాప్లు రావడంతో కృతి శెట్టి కెరియర్ కు పెద్ద మైనస్ పాయింట్ అయిందని చెప్పవచ్చు. ఇక సినిమాల్లో పెద్దగా అవకాశాలు రాకపోవడంతో ఈ బ్యూటీ కాస్త గ్లామర్ డోస్ పెంచుతూ ఫోటో షూట్లు చేస్తోంది.

సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్ గా ఉంటూ తనకు సంబంధించిన అన్ని విషయాలను అభిమానులతో పంచుకుంటూ ఉంటుంది. సరికొత్త ఔట్ ఫిట్లు ధరిస్తూ, తన అందమైన ఫోటోలను నెట్టింట్లో పోస్ట్ చేస్తూ దుమారం రేపుతూ ఉంటుంది. ఇక ఈ ముద్దుగుమ్మ తన మొదటి సినిమాలో కేవలం 6 లక్షల రూపాయల రెమ్యూనరేషన్ మాత్రమే తీసుకుందట. ప్రస్తుతం కృతి శెట్టి 60 లక్షల రూపాయల రెమ్యూనరేషన్ తీసుకుంటుందట. ఈ విషయం తెలిసి తన అభిమానులు షాక్ అవుతున్నారు. కృతి శెట్టి సినిమాలు డిజాస్టర్లుగా మారినప్పటికీ తనకు ఫ్యాన్ ఫాలోయింగ్ భారీగానే ఉంటది.

- Advertisement -
Krithi Shetty: Krithi Shetty said bye bye to Tollywood.. Is that the reason..?
Krithi Shetty

ఇక ఇదిలా ఉండగా…. ఈ బ్యూటీకి సంబంధించిన ఓ వార్త ప్రస్తుతం సోషల్ మీడియా మాధ్యమాల్లో వైరల్ గా మారుతుంది. గతంలో ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న కృతి శెట్టిని మీకు ఏ హీరోతో సినిమా చేయాలని ఇంట్రెస్ట్ ఉంది అని అడగ్గా…. కృతి నాకు రామ్ చరణ్ సినిమాలో హీరోయిన్ గా చేయాలని ఎంతో ఆశగా ఉందని చెప్పిందట. రామ్ చరణ్ సినిమాలో హీరోయిన్గా ఛాన్స్ రావాలని కోరుకుంటున్నానని చెప్పుకొచ్చిందట. ఈ విషయం ప్రస్తుతం సోషల్ మీడియా మాధ్యమాల్లో వైరల్ గా మారుతుంది. ఇక ఈ విషయం తెలిసి కృతి శెట్టి అభిమానులు రామ్ చరణ్ సినిమాలో తప్పకుండా అవకాశం వస్తుందంటూ కామెంట్లు చేస్తున్నారు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు