Manamey Pre Release Event : దేవకన్యలా బెబమ్మ.. మాటల్లో కూడా

Manamey Pre Release Event : టాలీవుడ్ టాలెంటెడ్ హీరో శర్వానంద్ హీరోగా నటించిన “మనమే” సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ తాజాగా హైదరాబాద్ లో గ్రాండ్ గా జరిగింది. ఇక ఈ ఈవెంట్ కి గెస్ట్ లుగా మారుతి సహా పలువురు డైరెక్టర్లు గెస్ట్ లుగా హాజరయ్యారు. అలాగే ఈ సినిమాలో హీరోహీరోయిన్లుగా నటించిన శర్వానంద్, కృతి శెట్టి కూడా ఈవెంట్ కి రావడం జరిగింది. ఇక ఈ ఈవెంట్ లో స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచింది మాత్రం కృతి శెట్టి అని చెప్పాలి. అసలే చూడ్డానికి క్యూట్ గా ఉండే ఈ అమ్మాయి, మనమే ప్రీ రిలీజ్ ఈవెంట్ కి దేవకన్య లా రెడీ అయి వచ్చింది. వైట్ కలర్ డ్రెస్ లో అనార్కలి మోడల్ మాచింగ్ కాస్ట్యూమ్స్ తో ముత్యాలు పొదిగిన హారంతో కళ్ళు జిగేలుమనిపించింది బేబమ్మ. ఇక ఈ ఈవెంట్ లో లుక్స్ పరంగా అందర్నీ ఆకర్షించింది కృతి శెట్టినే అని చెప్పాలి. ప్రీ రిలీజ్ ఈవెంట్ (Manamey Pre Release Event) కి వచ్చిన ఫ్యాన్స్ కూడా కృతి శెట్టి ని ఆ డ్రెస్ లో చూసి ఫిదా అయిపోయారు. ఇక కృతి శెట్టి  ఇలా రెడీ రావడమే కాదు తన క్యూట్ తెలుగు స్పీచ్ తో అదరగొట్టింది.

Krithi Shetty Stunning Looks At Manamey Pre Release Event

క్యూట్ స్పీచ్ తో అదరగొట్టిన కృతి..

ఇక మనమే ప్రీ రిలీజ్ ఈవెంట్ లో కృతి శెట్టి మాట్లాడుతూనే ముందుగా ఫంక్షన్ కి లేట్ గా వచ్చినందుకు సారీ చెప్పింది. ఇక ఈ సినిమాలో శర్వా గురించి మాట్లాడుతూ తనతో వర్క్ చేయడం చాలా నచ్చిందని, తన పెర్ఫార్మన్స్ చూస్తున్నపుడు, ఏ సీన్ అయినా కూడా చాలా ఈజీ గా చేసేస్తారు ,మల్టి టాలెంటెడ్ అయన అని చెప్పుకొచ్చింది. ఇక మ్యూజిక్ డైరెక్టర్ హేశం అబ్దుల్లా ఈ సినిమాకి సోల్ అని, ఆయన పాటలు మ్యాజిక్ చేస్తాయని చెప్పుకొచ్చింది. అలాగే ఈ సినిమాలో నటించిన ఇతర కాస్ట్, తులసి, ఆయేషా ఖాన్, రాహుల్ రామకృష్ణ, వెన్నెల కిషోర్ లకు స్పెషల్ గా థ్యాంక్స్ చెప్పుకొచ్చింది. ఇక కృతి శెట్టి తెలుగు స్పీచ్ కి ఫిదా అయ్యారు అక్కడి చిత్ర యూనిట్. ఈ సినిమాతో సూపర్ హిట్ కొట్టి కం బ్యాక్ ఇవ్వాలని చూస్తుంది కృతి శెట్టి.

- Advertisement -

మనమే తో కం బ్యాక్ ఇస్తుందా?

ఇక కృతి శెట్టి మూడేళ్ళ కింద టాలీవుడ్ లో ఉప్పెన సినిమాతో ఉవ్వెత్తున ఎగిసిపడింది. కన్నడ భామ అయినా బేబమ్మ గా తెలుగు ప్రేక్షకులకు చేరువైన ఈ అమ్మాయి ఆ తర్వాత వరుస హిట్లతో జోరు చూపించింది. బంగార్రాజు, శ్యామ్ సింగరాయ్ సినిమాలతో ఊపు ఊపిన ఈ భామ తన రెమ్యూనరేషన్ కూడా అమాంతం పెంచేసింది. కానీ ఆ తర్వాత వరుస బెట్టి సినిమాలు ప్లాప్ అయ్యాయి. ఒక్కటంటే ఒక్క సినిమా కూడా సరైన బ్రేక్ ఇవ్వలేదు. అయినా తన వరకు పెర్ఫార్మన్స్ విషయంలో చేయాల్సింది చేసింది. కానీ ఎంత స్టార్ హీరోయిన్ కైనా టాలీవుడ్ లో వరుసగా నాలుగైదు ప్లాపులు పడ్డాయంటే, కెరీర్ డైలమా లో పడ్డట్టే అని నెటిజన్లు అంటుంటారు. ఇక కృతి శెట్టి మనమే సినిమా తో ఎలాగైనా హిట్ కొట్టి కం బ్యాక్ ఇవ్వాలని చూస్తుంది కృతి శెట్టి. మరి బేబమ్మ ఆశలు ఫలిస్తాయో లేదో చూడాలి.

 

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు