Kriti Shetty: నా ఓటమి కోసం వేయికళ్లు ఎదురు చూస్తున్నాయి..!

Kriti Shetty.. ప్రముఖ కన్నడ ముద్దుగుమ్మ కృతి శెట్టి(Kriti Shetty) గురించి పరిచయాలు ప్రత్యేకంగా అవసరం లేదు.. కన్నడ సినీ ఇండస్ట్రీలో యాడ్స్ ద్వారా తనకంటూ ప్రత్యేక ఇమేజ్ సొంతం చేసుకున్న ఈమె ఆ తర్వాత తెలుగులో బుచ్చిబాబు సనా (Bucchibabu sana) దర్శకత్వంలో వచ్చిన తొలి చిత్రం ఉప్పెన (Uppena )సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమై మొదటి సినిమాతోనే మంచి విజయం సాధించింది. అంతేకాదు ఈ సినిమాలో తొలి పరిచయంలో నటించిన మెగా మేనల్లుడు వైష్ణవ్ తేజ్ కూడా మంచి విజయాన్ని సొంతం చేసుకున్నారు. వీరిద్దరి కెమిస్ట్రీ కూడా బాగా పండింది. దీనికి తోడు రూ .100 కోట్ల క్లబ్లో చేరి రికార్డు సృష్టించింది ఈ సినిమా. ఇందులో వీరిద్దరి నటనకు బెస్ట్ మేల్, ఫిమేల్ విభాగంలో ఫిలింఫేర్ అవార్డులు కూడా లభించాయి.

Kriti Shetty: The thousands of eyes are waiting for my defeat..!
Kriti Shetty: The thousands of eyes are waiting for my defeat..!

కథల ఎంపిక విషయంలో తడబాటు..

ఇక తర్వాత కృతి శెట్టికి వరుస అవకాశాలు తలుపు తత్తాయి. అలా బంగార్రాజు, శ్యామ్ సింగరాయ్ చిత్రాలలో నటించి హ్యాట్రిక్ అందుకుంది ఈ ముద్దుగుమ్మ. అయితే ఆ తర్వాత ఏమైందో తెలియదు కానీ ఈమె నటించిన ప్రతి సినిమా కూడా డిజాస్టర్ వైపు అడుగులు వేసింది. చివరిగా కస్టడీ తో డిజాస్టర్ చవి చూసిన ఈమె ఇటీవల శర్వానంద్ తో కలిసి మనమే అనే సినిమాలో కూడా నటించింది. అయితే ఈ సినిమా కూడా డిజాస్టర్ గానే నిలిచింది. ఇదిలా ఉండగా తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న ఈమె తన ఓటమి కోసం వేయికళ్లు ఎదురు చూసాయి అంటూ షాకింగ్ కామెంట్లు చేసింది మరి అసలు విషయం ఏమిటో ఇప్పుడు చూద్దాం.

నాకు ఫ్లాప్ వస్తుందని ఒక సెక్షన్ జనం ఎదురు చూశారు..

కృతి శెట్టి మాట్లాడుతూ.. నాకు ఫ్లాప్ వస్తే చూడాలని ఒక బ్యాచ్ ఎంతో గట్టిగా ప్రయత్నం చేసింది. అయితే ఇండస్ట్రీలోకి వచ్చిన కొత్తలో ఉప్పెన పెద్ద హిట్ అయింది . కానీ ఒక సెక్షన్ జనం నాకు ఫ్లాప్ వస్తుందని ఎదురు చూశారు. నాకు ఫ్లాప్ వస్తే వేలు ఎత్తి చూపించాలని కూడా అనుకున్నారు. అయితే నేను హిట్ ప్లాప్ రెండూ ఒకేలా తీసుకున్నాను. ఎందుకంటే నా మొదటి సినిమా సక్సెస్ అయినప్పుడు కూడా నేను పూర్తి క్రెడిట్ తీసుకోలేదు. అందుకే ఫ్లాప్ వచ్చినప్పుడు కూడా నేను పూర్తి క్రెడిట్ తీసుకోను అంటూ తెలిపింది. మొత్తానికి అయితే తన ఓటమి కోసం ఎదురు చూసిన వ్యక్తులు ఎవరు అనే విషయాన్ని మాత్రం చెప్పలేదు కృతి శెట్టి.

- Advertisement -

ఫ్లాప్స్ వల్ల మరింత నేర్చుకున్నాను..

ఇకపోతే తప్పులు ఎక్కడ జరిగాయో తెలుసుకున్నాను. ఒక సక్సెస్ కంటే ఫెయిల్యూర్ వల్లే ఎక్కువ నేర్చుకోవడం జరిగింది. ఫ్లాప్స్ వల్ల ఒక టెక్నీషియన్ గా నేను మరింత మెరుగుపడ్డాను .ఎందుకు సినిమా ఆడలేదనే విశ్లేషణ కూడా నాలో బాగా పెరిగింది అంటూ తెలిపింది. ఇకపోతే కెరియర్ మొదట్లో ఫ్లాప్ రావడంతో మరింత ఎక్కువ నేర్చుకొని మరింత స్ట్రాంగ్ గా తయారై విమర్శలు తట్టుకోగలిగే స్థాయికి చేరుకున్నాను అంటూ తెలిపింది. కృతి శెట్టి. ఏదిఏమైనా కృతి శెట్టి చేసిన కామెంట్స్ ఇప్పుడు వైరల్ గా మారుతున్నాయి.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు