Kurangu Pedal OTT: ఓటీటీలోకి వ‌చ్చేస్తోన్న‌ శివ‌కార్తికేయ‌న్ క్రేజీ మూవీ

సౌత్ ఇండస్ట్రీలో ఎంతోమంది స్టార్ హీరోలు ఉన్న సంగతి తెలిసిందే. కొంతమంది ఇండస్ట్రీలో ఉన్న కొంతమంది సపోర్ట్ తో..హీరోలుగా ఎదుగుతారు. మరికొంతమంది చాలా కష్టపడి ఇండస్ట్రీలో రాణిస్తూ ఉంటారు. అలా కష్టపడి పైకి వచ్చిన హీరోలు కొంతమంది మాత్రమే ఉంటారు. అలాంటి వారిలో కోలీవుడ్ స్టార్ హీరో శివ కార్తికేయన్ ఒకరు.

కోలీవుడ్ ఇండస్ట్రీలో శివ కార్తికేయన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. శివ కార్తికేయన్ సినిమా తీశాడంటే కచ్చితంగా హిట్ అవుతుంది. హిట్ శాతం ఎక్కువగా ఉన్న హీరోలలో మొదటి వరుసలో శివ కార్తికేయన్ ఉంటారన్న సంగతి తెలిసిందే. అయితే… ఈ హీరోకు మన తెలుగులో కూడా క్రేజ్ బాగానే ఉంది. ఆయన చేసిన ప్రతి సినిమా తెలుగులో రిలీజ్ అవుతూనే ఉంటుంది. అయితే లేటెస్ట్ గా… శివ కార్తికేయన్ ప్రొడ్యూస్ చేసిన సినిమా కురంగు పెడల్. ఈ సినిమాకు కమల కన్నన్ దర్శకత్వం వహించిన సంగతి మనందరికీ తెలిసిందే.

- Advertisement -

ఈ సినిమాలో కాళీ వెంకట్ తో సంతోష్ మేలు మురుగన్, వి ఆర్ రాఘవన్ రతీష్ కీలక పాత్రలో చేశారు. మే 3వ తేదీన థియేటర్లలో రిలీజ్ అయి ఈ సినిమా మంచి టాక్ తెచ్చుకుంది. అయితే లేటెస్ట్ గా ఈ సినిమా నుంచి అదిరిపోయే అప్డేట్ వచ్చింది. ఈ సినిమా ఓటిటిలో రిలీజ్ కాబోతుంది. జూన్ 14వ తేదీన ఆహా లో ఈ సినిమా స్ట్రీమింగ్ కానుంది. 1980 నాటి చిన్ననాటి మెమోరీస్ గుర్తుచేస్తూ… ఈ సినిమాను తెరకెక్కించారు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు