Double Ismart : డబుల్ ఇస్మార్ట్ నుంచి రొమాంటిక్ సాంగ్ వచ్చేసింది..ఈ లఫుడా ఏంటి మాస్టారూ..

Double Ismart : టాలీవుడ్ యంగ్ హీరో రామ్ పోతినేని నటించిన డబుల్ ఇస్మార్ట్ సినిమా విడుదలకు సిద్ధంగా ఉన్న సంగతి తెలిసిందే.. ఈ సినిమా ఆగస్టు 15 న ప్రేక్షకుల ముందు రాబోతుంది.. ఈ సినిమాను ఎప్పుడెప్పుడు చూస్తామా అని ఫ్యాన్స్ ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు.. ఇప్పటివరకు మేకర్స్ వదిలిన అప్డేట్స్ సినిమా పై అంచనాలను పెంచేశాయి.. ఈ సినిమా నుంచి మరో అప్డేట్ వచ్చేసింది.. తాజాగా ఈ మూవీ నుంచి సాంగ్ ను రిలీజ్ చేశారు. ప్రస్తుతం ఆ పాట సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతుంది..

మొన్న వచ్చిన మాస్ సాంగ్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది.. అందులో కేసీఆర్ డైలాగ్ ఎంతగా వైరల్ అయ్యిందో చూశాం.. తాజాగా క్యా లఫుడా అనే రొమాంటిక్ సాంగ్ ను రిలీజ్ చేశారు.. లిరిక్స్ మాములుగా లేవని చెప్పాలి.. ఆ సాంగ్ ప్రస్తుతం నెట్టింట ట్రెండ్ అవుతుంది.. ఇకపోతే ఇప్పటి వరకు వచ్చిన అప్డేట్స్ జనాలను బాగా ఆకట్టుకున్నాయి. తాజాగా విడుదలైన రొమాంటిక్ సాంగ్ మాత్రం ఓ రేంజులో హైప్ ను క్రియేట్ చేసింది..

Kya Lafuda song from double smart..
Kya Lafuda song from double smart..

ఇకపోతే ఈ సినిమా బిజినెస్ డిటైల్స్ కూడా మామూలుగా లేవని చెప్పాలి.. ఎంత రాబట్టిందంటే.. డబుల్ ఇస్మార్ట్ సినిమా థియేట్రికల్ రైట్స్ ను రూ.56 కోట్లకు నిర్మాత నిరంజన్ రెడ్డి కొనుగోలు చేయగా.. హిందీ రైట్స్ కు రూ.6 కోట్లకు అమ్ముడయ్యాయి. అలాగే ఓటీటీ రైట్స్ ను కూడా రూ.33 కోట్లకు తెలుగుతో పాటు తమిళం, కన్నడ, మలయాళం భాషల్లోఅమెజాన్ ప్రైమ్ దక్కించుకుంది.. ఆడియో రైట్స్ ను రూ.9 కోట్లకు ఆదిత్య మ్యూజిక్ కు నిర్మాత ఛార్మి కౌర్ సేల్ చేసిన విషయం తెలిసిందే. ఈ సినిమాలో భాలీవుడ్ నటుడు సంజయ్ దత్ కీలక పాత్ర పోషిస్తున్నారు. సినిమా ఓపెనింగ్స్ అయితే బాగానే వచ్చాయి.. ఇక టాక్ ఎలా ఉంటుందో చూడాలి…

- Advertisement -

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు