Laila: మేటర్ ఏంటి అంటే గురు , హీరోయిన్ కూడా వాడే

Laila: ప్రస్తుతం తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో ఉన్న యంగ్ హీరోస్ లో విశ్వక్సేన్ ఒకరు. వెళ్ళిపోమాకే సినిమాతో తెలుగు ఫిలిం ఇండస్ట్రీకి హీరోగా ఎంట్రీ ఇచ్చాడు విశ్వక్. కానీ ఆ సినిమా ఊహించిన విజయాన్ని సాధించుకోలేకపోయింది. ఆ తర్వాత తరుణ్ భాస్కర్ దర్శకత్వంలో వచ్చిన సాధించుకున్నాడు. కేవలం హీరో గానే కాకుండా ఆ సినిమా తర్వాత తన దర్శకత్వం ప్రతిభను కూడా బయటకు తీశాడు. మలయాళం లో వచ్చిన సూపర్ హిట్ అంగమలై డైరీస్ సినిమాకి రీమేక్ గా ఫలక్నామా దాస్ సినిమాను తెరకెక్కించాడు. ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద అద్భుతమైన విజయం సాధించింది.

ఆ సినిమా తర్వాత వరుసగా డిఫరెంట్ కాన్సెప్ట్ సినిమాలు చేయడం మొదలుపెట్టాడు విశ్వక్. అయితే విశ్వక్ చేసిన కొన్ని సినిమాలు ఫెయిల్ అయినా కూడా ఒక హీరోగా విశ్వక్సేన్ ఇప్పుడు ఫెయిల్ కాలేదు. డిఫరెంట్ కాన్సెప్ట్ సినిమాలు ఎంచుకొని చేస్తాడు అని మంచి పేరును సాధించుకున్నాడు. ఇకపోతే చివరగా గామి అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు విశ్వక్సేన్. ఈ సినిమా మంచి కలెక్షన్స్ తో పాటు విమర్శకుల ప్రశంసలు అందుకుంది.

Laila

- Advertisement -

ఇక ప్రస్తుతం లైలా అనే ఒక సినిమాను చేస్తున్నాడు. ఈ సినిమా ఫిబ్రవరి 14 2025న రిలీజ్ కానుంది. ఫిబ్రవరి 14 కి ఎంతటి ప్రత్యేకత ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు లవర్స్ డే సందర్భంగా లైలా అనే సినిమాను రిలీజ్ చేయనున్నాడు విశ్వక్. ఈ సినిమాకి సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్ను రిలీజ్ చేశారు. ఈ పోస్టర్లో విశ్వక్ లేడీ గెటప్ లో కనిపిస్తున్నాడు. త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వం వహించిన అత్తారింటికి దారేది సినిమా లో ఒక డైలాగును ఇప్పుడు కామెంట్స్ గా వాడుతున్నారు. చివరికి హీరోయిన్ కూడా వీడే అని కామెంట్స్ వినిపిస్తున్నాయి.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు