Lalsinghchadda: బాలరాజు ఆసక్తికర విషయాలు

టాలీవుడ్ యంగ్ హీరో నాగ చైతన్య బాలీవుడ్ లో “లాల్ సింగ్ చడ్డా” సినిమా చేసిన విషయం విదితమే. ఇదివరకే చైతుకి సంబంధించిన లుక్‌ని విడుదల చేసిన టీమ్, ఇప్పుడు స్పెషల్ వీడియోతో అతని క్యారెక్టర్‌‌ గురించి మరిన్ని ఆసక్తికర విశేషాలను పంచుకుంది. తన పాత్ర కోసం చైతూ ఎలా మేకోవర్‌ అయ్యాడు.. షూటింగ్‌ సెట్‌లో ఎంతగా కష్టపడ్డాడో చూపిస్తూ చేసిన వీడియో ఆసక్తికరంగా ఉంది. ఇందులో చిత్రం గురించి, తన పాత్ర గురించి చైతన్య వివరించారు. ఈ కథ తన దగ్గరికి వచ్చినప్పుడు తన పాత్ర పేరు బాల అని చెప్పారన్నాడు. ఏపీలోని బోడిపాలెం నుంచి ఆర్మీలో చేరేందుకు వచ్చిన యువకుడిగా కనిపిస్తానన్నాడు. చాలా మంది పేర్లకు ముందు వారి ఇంటిపేరుగా ఊరి పేర్లు కూడా జత చేసి ఉంటాయి. అలా ఈ చిత్రంలో తన పేరు బాలరాజు బోడిపాలెం అని పెట్టారని వెల్లడించాడు.

ఇదే పేరుతో 1948లో చైతన్య తాత అక్కినేని నాగేశ్వరరావు ‘బాలరాజు’ చిత్రం ఉంది. బాలరాజు తెలుగు సినిమా మార్కెట్‌ స్థాయి ఎంతో తొలిసారి చూపించి అనూహ్యమైన సంచలనాన్ని రేపిన చిత్రం. అప్పటి వరకూ మూడు పదుల వయసు దాటిన కథానాయకుల చిత్రాలే ఎక్కువగా వచ్చాయి. అంతా ఓ సంప్రదాయ పద్ధతిలో వెళ్లే కథలే. ‘బాలరాజు’ ఆ ధోరణిని మార్చింది. ఈ సినిమా అక్కినేని నాగేశ్వరరావు, కస్తూరి శివరావుల సినీ జీవితాన్ని మలుపు తిప్పింది.

ప్రస్తుతం ఆ చిత్రంలోని అక్కినేని గెటప్‌ను కూడా ట్రై చేశామని చెప్పాడు. షూటింగ్‌ జరిగినన్ని రోజులు తానో కొత్త ప్రపంచాన్ని చూశానని తెలిపాడు.‘లాల్ సింగ్ చడ్డా’లో నాగచైతన్య వివిధ గెటప్స్‌తో అలరించనున్నాడు. ఈ చిత్రం కోసం ఎంతో కష్టపడ్డ చైతన్యపై ఆమిర్‌ ఖాన్‌, డైరెక్టర్‌, ఇతర సాంకేతిక నిపుణులు పొగడ్తలు కురిపించారు.

- Advertisement -

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు