Lavanya: లావణ్యను టార్చర్‌ పెడుతున్న ఆ లాయర్‌ సాబ్‌ ?

Lavanya: ప్రముఖ టాలీవుడ్ నటుడు హీరో రాజ్ తరుణ్ ప్రేమ వ్యవహారంలో చిక్కుకున్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగానే ఈ వ్యవహారంలో అనేక ట్విస్టులు జరుగుతున్నాయి. ఇక తాజాగా ఈ వ్యవహారంలో మరో ట్విస్ట్ వెలుగులోకి వచ్చింది. తనను ప్రేమించి మోసం చేశాడంటూ హీరో రాజ్ తరుణ్ పై లావణ్య కేసు పెట్టిన సంగతి తెలిసిందే.

ఇక శుక్రవారం (జూలై 12) వ తేదీన అర్ధరాత్రి లావణ్య ఆత్మహత్యా ప్రయత్నం చేసింది. “రాజ్ లేని లైఫ్ లో నేను ఉండలేను. ఈ లోకం నుంచి వెళ్ళిపోతున్నాను” అంటూ తన అడ్వకేట్ కు సందేశం పంపించింది. దీంతో స్పందించిన అడ్వకేట్ వెంటనే డయల్ 112 ద్వారా నార్సింగి పోలీసులకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే అర్ధరాత్రి లావణ్య ఇంటికి వెళ్లారు. ఆమెకు కౌన్సిలింగ్ ఇచ్చారు. దీంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.

 

- Advertisement -

అయితే.. ఆత్మహత్యయత్నం ఎపిసోడ్‌ అయిన తర్వాత మరో ట్విస్ట్‌ ఇచ్చింది హీరో రాజ్ తరుణ్ బాధితురాలు లావణ్య. ఈ సందర్భంగా లావణ్య మీడియాతో మాట్లాడుతూ…రాజేష్ అనే వ్యక్తి నాకు మెసేజ్ చేశాడని తెలిపింది. తాను ఒక అడ్వకేట్ ను అని.. నీ కేసు నేను టేకప్ చేస్తాను అని మెసేజ్ పెట్టాడని మీడియాతో ముందు వెల్లడించింది. యాక్టింగ్ అంటే ఇష్టం ఉంటే చెప్పు.. అవకాశం ఇప్పిస్తాను అన్నాడని ఆఫర్‌ కూడా ఇచ్చాడట.

Raj Tarun - Lavanya: Is this much in Raj Tarun's affair list?
Lavanya comments on rajesh

అప్పటికే బాధలో ఉన్న నన్ను రాజేష్ అనే అడ్వకేట్ మరింత ఇబ్బంది పెట్టాడని వెల్లడించింది లావణ్య. దీంతో జీవితం పై విరక్తి వచ్చిందని తెలిపింది. నన్ను అడగకుండానే.. నాకు తెలియకుండానే ఉదయం డీజీపీ ఆఫీస్ కి వెళ్లి కలిశాడని కూడా బాంబ్‌ పేల్చింది. నిన్న రాత్రి ఒక్కసారిగా డిప్రెషన్ కి లోనయ్యానని… అందుకే ఆత్మహత్య చేసుకోవాలి అనుకున్నానని వెల్లడించింది లావణ్య. దీంతో ప్రముఖ టాలీవుడ్ నటుడు హీరో రాజ్ తరుణ్ ప్రేమ వ్యవహారం ఇంకా ఎన్ని మలుపులు తిరుగుతుందో అని అందరూ షాక్‌ అవుతున్నారు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు