Lavanya : శేఖర్ భాషా బండారం బట్టబయలు… బిగ్ బాస్ ను ఇన్వాల్వ్ చేస్తూ లావణ్య షాకింగ్ కామెంట్స్

Lavanya : టాలీవుడ్ యంగ్ హీరో రాజ్ తరుణ్, లావణ్యల వివాదం ఇంకా నడుస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఆర్జే శేఖర్ భాషా తాను రాజ్ తరుణ్ కి సన్నిహితుడిని అని చెప్పుకుంటూ వివాదం మధ్యలో తల దూర్చాడు. అక్కడితో ఆగకుండా పలు డిబేట్లలో పాల్గొంటూ లావణ్యకు వ్యతిరేకంగా సెన్సేషనల్ కామెంట్స్ చేశాడు. రాజ్ తరుణ్, లావణ్యల మధ్య జరుగుతున్న గొడవ ఇంకా సద్దుమనగక ముందే బిగ్ బాస్ లోకి అడుగుపెట్టి షాక్ ఇచ్చాడు శేఖర్ భాషా. ఈ నేపథ్యంలోనే శేఖర్ బిగ్ ప్లాన్ కు సంబంధించిన బండారాన్ని బయట పెట్టి, బిగ్ బాస్ ను ఇన్వాల్వ్ చేస్తూ షాకింగ్ కామెంట్స్ చేసింది లావణ్య.

శేఖర్ భాషా బండారం బట్టబయలు

శేఖర్ భాషా లావణ్య డ్రగ్స్ కు అడిక్ట్ అయ్యిందని, ఆమెకు అసలు పిల్లలే పుట్టరు అంటూ లావణ్య గురించి షాకింగ్ కామెంట్స్ చేసి వార్తల్లో నిలిచాడు. అప్పటిదాకా అసలు శేఖర్ భాషా అనే ఆర్జే ఉన్నాడన్న విషయం చాలామందికి తెలియదనే చెప్పాలి. కానీ ఎప్పుడైతే ఆయన రాజ్ తరుణ్, లావణ్య వివాదం మధ్యలో వచ్చాడో ఒక్కసారిగా అందరికీ శేఖర్ భాషా అనే పేరు నోటెడ్ అయిపోయింది.ఎన్నో ట్విస్ట్ లు, టర్న్ లు.. ఈ గొడవలో ఎంతోమంది పేర్లను బయట పెట్టడమే కాకుండా, రాజ్ తరుణ్ తనకు మంచి స్నేహితుడు, ఆ అమ్మాయి అతన్ని టార్చర్ చేస్తోంది, అతనికి అండగా తాను నిలబడతాను అంటూ ముందుకొచ్చి లావణ్య చేతిలో లైవ్ లోనే చెప్పు దెబ్బలు కూడా తిన్నాడు. అతను రాజ్ తరుణ్ కు బాగా క్లోజ్ ఫ్రెండ్ కాబట్టి ఇంతగా పోరాడుతున్నాడు అని అనుకున్నారంతా. కానీ లావణ్య తాజాగా బిగ్ న్యూస్ కి ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో అసలు విషయాన్ని బయట పెట్టింది. అతను బిగ్ బాస్ లో అడుగు పెట్టడానికి తనను పావులా వాడుకున్నాడని, ఈ పాపులారిటీ కోసమే తనపై అంత దారుణమైన ఆరోపణలు చేశాడంటూ శేఖర్ భాషా బిగ్ ప్లాన్ ను బయట పెట్టింది. శవాలపై చిల్లర ఏరుకోవడమే అంటూ అతను తన పట్ల వ్యవహరించిన తీరును గుర్తు చేస్తూ అసలు విషయాన్ని వెల్లడించింది.

Lavanya vs Sekhar Basha: శేఖర్ బాషాను చెప్పుతో కొట్టిన లావణ్య? - NTV Telugu

- Advertisement -

అంతేకాకుండా తనకు పిల్లలు పుట్టరు అని చెప్పడానికి అతను ఎవరు? నాతో కాపురం చేశాడా? చేసిన వాడిని చెప్పామనండి అంటూ తన అబార్షన్ విషయం గురించి షాకింగ్ కామెంట్స్ చేసింది. అలాగే పాపులారిటీ కోసం అతను ఒక అమ్మాయి ఉసురు పోసుకున్నాడని, అతను మగజాతి ఆణిముత్యం కాదు బిగ్ బాస్ లో అడుగు పెట్టడానికి అవసరమైన పాపులారిటీ కోసమే ఇలాంటి పని చేశాడని వెల్లడించింది.

లావణ్య శాపనార్థాలు

వివాదాన్ని వదిలేస్తాను అంటే నాగార్జునతో సహ అందరికీ సారీ చెప్పాను అనే విషయాన్ని గుర్తు చేస్తూ శేఖర్ భార్యకు ఎందుకు సారీ చెప్పాలి అని ప్రశ్నించింది లావణ్య. అంతేకాకుండా శేఖర్ బిగ్ బాస్ విన్నర్ కాలేడని శాపనార్థాలు పెట్టింది. రెండు మూడు రోజుల్లోనే లేదా వారాల్లోనే అతను బయటకు రావాలని కోరుకుంది.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు