Lavanya: రాజ్ తరుణ్ మగాడు కాదు.. వైరల్ వీడియో పై లావణ్య రియాక్షన్ ఇదే..!

Lavanya.. టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారిన ఒకే ఒక జంట లావణ్య – రాజ్ తరుణ్.. యంగ్ హీరో రాజ్ తరుణ్ దాదాపు 11 సంవత్సరాల పాటు తనను ప్రేమించి పెళ్లి చేసుకుంటానని చెప్పి, కడుపు చేసి అబార్షన్ కూడా చేయించాడంటూ మీడియా ముందుకు వచ్చింది ఆయన ప్రేయసి లావణ్య. అంతేకాదు సాక్షాదారాలతో సహా మీడియా ముందు ఉంచింది. ఎఫ్ఐఆర్ కూడా నమోదు చేయించింది. దీంతో కోర్టు రాజ్ తరుణ్ కు నోటీసులు జారీ చేసినా, వ్యక్తిగతంగా కొన్ని కారణాల వల్ల విచారణకు హాజరు కాలేనంటూ తప్పించుకు తిరుగుతున్నాడు అనే వార్తలు వినిపిస్తున్నాయి.

Lavanya: Raj Tarun is not a man.. This is Lavanya's reaction on the viral video..!
Lavanya: Raj Tarun is not a man.. This is Lavanya’s reaction on the viral video..!

లావణ్య – రాజ్ తరుణ్ కేసులో రోజుకొక ట్విస్ట్..

దీనికి తోడు మరొకవైపు శేఖర్ భాషా , మస్తాన్ సాయి లాంటి పేర్లు కూడా వెలుగులోకి రావడం గమనార్హం. శేఖర్ భాషా లావణ్య పై దాడి చేయడం , ఆమె లైవ్ లో చెప్పుతో కొట్టడం అందర్నీ ఆశ్చర్యానికి గురిచేసాయి. దీనికి తోడు మస్తాన్ సాయితో లావణ్య ఎఫైర్ పెట్టుకుందనే వార్తలు రాగా, అతని వల్లే తాను ఇబ్బందులు పడుతున్నానని లావణ్య రివర్స్ కేస్ పెట్టింది. మస్తాన్ సాయిని అరెస్టు చేసినప్పుడు అతడు డ్రగ్స్ తీసుకుంటాడని , అమ్మాయిలను ట్రాప్ చేసి అమ్మాయిల తల్లిదండ్రులను డబ్బు కోసం బెదిరిస్తున్నాడు అంటూ పోలీసులు నిజాలు బయట పెట్టారు.

రాజ్ తరుణ్ కి మేటర్ లేదంటూ వీడియో..

దీనికి తోడు నిన్నటికి నిన్న ఒక అమ్మాయి ఒక వీడియో వదిలింది.సంయుక్త తన పేరు అంటూ.. రాజ్ తరుణ్ లో మేటర్ లేదు అంటూ హాట్ బాంబు పేల్చింది. తన స్నేహితురాలు రాజ్ తరుణ్ ను ప్రేమిస్తోందని, ఒకే బెడ్ పై ఇద్దరూ పడుకున్నా ఏమి జరగడం లేదు అంటూ తన దగ్గర బాధపడిందని షాకింగ్ కామెంట్లు చేసింది. దీంతో ఈ విషయాలు సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో, ఈ వైరల్ గా మారిన వీడియో పై రాజ్ తరుణ్ ప్రేయసి లావణ్య రియాక్ట్ అయింది. ఒక మీడియా ఛానల్ తో మాట్లాడుతూ.. లావణ్య ఈ వ్యవహారంపై మండిపడింది.

- Advertisement -

సినిమా ప్రమోషన్ కోసం ఇలా.. మండిపడ్డ లావణ్య..

ఈ వీడియో తెల్లవారుజామున నా దృష్టికి వచ్చింది. ఇక అందరూ నేను ఇదే చేయించానేమో అనుకొని నన్ను తిడుతున్నారు. నేను మొత్తుకొని చెబుతున్నాను ప్రతి ఒక్కరికి కూడా కాల్ చేసి మరీ చెప్పుకుంటూ వచ్చా.. ఇది నేను చేయించలేదని, అయితే ఇది ఒక సినిమా ప్రమోషన్ కోసం ఇలా చేశారట. నేనే దీనిని అసలు ఊహించలేదు. ఇది నా జీవితం దాన్ని కూడా మీరు ఇలా ప్రమోషన్ కోసం వాడతారని నేను అనుకోలేదు. ముఖ్యంగా రాజ్ తరుణ్ కూడా ఇలా చేస్తాడని, వాళ్ళు చెబితే అతను ఎలా ఒప్పుకున్నాడో నాకు అర్థం కావడం లేదు. ముందు నేను ఏమనుకున్నాను అంటే రాజ్ తరుణ్ కి మేటర్ లేదు అంటూ ఒక వీడియో రిలీజ్ చేస్తే, నా ప్రెగ్నెన్సీ దగ్గర కేసు డైవర్ట్ చేయడానికి ఈ కొత్త వీడియో తీసుకొచ్చారేమో అనుకున్నాను. చివరికి ఇది సినిమా ప్రమోషన్ అని తెలిసి చాలా చండాలం అనిపించింది.. కనీసం డైరెక్టర్ కైనా ఇలాంటి ఆలోచన ఎలా వచ్చింది? రాజ్ తరుణ్ ఇలాంటి విషయాలకు అసలు ఎలా ఒప్పుకున్నాడు అనేది నాకర్ధం కావడం లేదు.

సినిమా కూడా పోతుందంటూ.. శాపం పెడుతున్న లావణ్య..

రాజ్ తరుణ్ కి రెండు సినిమాలు కూడా కలిసి రాలేదు. పండగ రోజు చెబుతున్నాను నా ఉసురు పోసుకుంటే ఈ సినిమా కూడా పోతుంది. ముఖ్యంగా ఈ ఒక్క ఆడదాని ఉసురు చాలా పవర్ఫుల్, నేను కోర్టు మెట్లు ఎక్కుతుంటే అతడు మాత్రం ఎక్కడో ఒక అమ్మాయితో కలిసి ముంబైలో ఎంజాయ్ చేస్తున్నాడు..ప్రస్తుతం రాజ్ తరుణ్ కి మేటర్ లేదు అని చెప్పిన అమ్మాయి అతడితో సంసారం చేసిందో లేక షూట్ చేసిందో ఆమెకే తెలియాలి అంటూ చెప్పుకొచ్చింది లావణ్య.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు