Raj Tarun- Lavanya slapped: చెప్పుతో కొట్టిన లావణ్య, చేయి చేసుకున్న శేఖర్ బాష

Raj Tarun- Lavanya slapped: షార్ట్ ఫిలిమ్స్ తో కెరీర్ మొదలుపెట్టి ఉయ్యాల జంపాల సినిమాతో తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీకి హీరోగా ఎంట్రీ ఇచ్చాడు రాజ్ తరుణ్. మొదటి సినిమాతోనే మంచి హిట్ అందుకొని తెలుగు ఫిలిం ఇండస్ట్రీకి ఒక మంచి హీరో దొరికాడు అని ప్రూవ్ చేసుకున్నాడు. ఆ తర్వాత రాజధాని చేసిన సినిమాలు కూడా బాక్సాఫీస్ వద్ద అద్భుతంగా వర్కౌట్ అయ్యాయి. ఆ తర్వాత రాజ్ తరుణ్ కి వరుసగా అవకాశాలు రావడం మొదలైంది. కానీ రీసెంట్ టైమ్స్ లో రాజ్ తరుణ్ హిట్ సినిమా చేసి చాలా రోజులు అయింది.

ఇక ప్రస్తుతం రాజ్ తరుణ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు వర్ష వివాదాలు రాజ్ తరుణ్ మెడకు చుట్టుకుంటున్నాయి. తనని మోసం చేశాడు అనే లావణ్య ఒక అమ్మాయి రాజ్ తరుణ్ పై కేసు పెట్టిన సంగతి తెలిసిందే. రాజ్ తరుణ్ తనను పెళ్లి చేసుకొని దాదాపు 12 సంవత్సరాలు తనతో కలిసి ఉన్నాడని. ఇప్పుడు తనను వదిలేసాడని లావణ్య అనే అమ్మాయి కేసు పెట్టిన విషయం తెలిసిందే. అయితే ఈ వివాదం రోజు రోజుకి పెరుగుతూనే ఉంది. ఇక రాజ్ తరున్ ను శేఖర్ భాష అనే ఒక వ్యక్తి సపోర్ట్ చేస్తున్న సంగతి తెలిసిందే.

Raj Tarun

- Advertisement -

లావణ్య తరుపున కళ్యాణ్ దిలీప్ సుంకర కేసును వాదిస్తున్నారు. నిన్న జరిగిన సినిమా ఈవెంట్ లో కూడా రాజ్ తరుణ్ చాలా ప్రూఫ్స్ కోర్టుకు సబ్మిట్ చేశాను అంటూ చెబుతూ వస్తున్నారు. ఈ తరుణంలో ఒక ప్రముఖ మీడియా ఛానల్ శేఖర్ భాష, రవితేజ, లావణ్య, కళ్యాణ్ దిలీప్ సుంకర డిబేట్లో పాల్గొన్నారు. ఈ డిబేట్లో అనేక విషయాలను చర్చించారు. అయితే బాగా హీటెడ్ ఆర్గ్యుమెంట్ జరగడంతో లావణ్య చెప్పు తీసుకొని శేఖర్ భాషాను కొట్టింది. వెంటనే శేఖర్ బాషా కూడా చేయి చేసుకున్నాడు. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతుంది.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు