Lavanya Tripathi : తెలుగు రాష్ట్రాల్లో ఫైనల్ గా రేపు ఎన్నికల వోటింగ్ జరుగనున్న సంగతి తెలిసిందే. గత కొన్ని రోజులుగా ఎన్నికల ప్రచారం హోరాహోరీగా జరగగా, నిన్న సాయంత్రంతో ముగిసింది. ఇక ఆంధ్ర ప్రదేశ్ లో అసెంబ్లీ ఎన్నికలతో పాటు ఎంపీ ఎలెక్షన్లు ఒకేసారి జరగనుండగా, తెలంగాణ లో ఆల్రెడీ అసెంబ్లీ ఎన్నికలు అయిపోగా, ఎంపీ ఎన్నికలు ఇప్పుడు జరుగనున్నాయి. రేపు ఫైనల్ గా అనగా మే 13న తెలుగు రాష్ట్రాలతో పాటు, నార్త్ లో కూడా పలు రాష్ట్రాలలో ఎన్నికల ఓటింగ్ జరుగుతుంది. ఇక ఈ ఎన్నికల బరిలో పవన్ కళ్యాణ్ జనసేన తరపున ఎన్నికల బరిలో నిల్చొని “పిఠాపురం” నియోజకవర్గం నుండి పోటీ చేస్తున్న సంగతి తెలిసిందే. ఇక ఈసారి పవన్ కళ్యాణ్ కోసం టాప్ హీరోలలో రామ్ చరణ్ మొదలుకొని మీడియం రేంజ్ చిన్న హీరోల దాకా అందరూ మద్దతు పలికారు. ఒక్క మాటలో చెప్పాలంటే పవన్ కళ్యాణ్ గెలుపు కోసం తెలుగు ఇండస్ట్రీ మొత్తం వెయిట్ చేస్తుందని చెప్పాలి. ఇక పవన్ కళ్యాణ్ కోసం ఆల్మోస్ట్ మెగా ఫ్యామిలీ ప్రచారం కోసం వచ్చారు.
జనసేనాని కోసం ఫ్యామిలీ మొత్తం..
ఇక పవన్ కళ్యాణ్ ఎన్నికల బరిలో పిఠాపురం లో నిల్చోగా, పవన్ కళ్యాణ్ కోసం మెగా ఫ్యామిలి మొత్తం ప్రచారానికి రావడం విశేషం. ఇక అన్న మెగాస్టార్ చిరంజీవి ప్రచారానికి రాకపోయినా తమ్ముడికి అండగా నిలిచారు. ఇక సాయి ధరమ్ తేజ్, వైష్ణవ్ తేజ్ సహా వరుణ్ తేజ్ కూడా జనసేన ప్రచారాల్లో పాల్గొన్నారు. ఫైనల్ టచ్ గా గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ కూడా బాబాయ్ కోసం ఎన్నికల చివరిరోజున ప్రచారంలో దిగాడు. ఇక అల్లు అర్జున్ పవన్ కోసం ట్వీట్ కూడా వేశారు. అలాగే టాలీవుడ్ స్టార్స్ ప్రభాస్, రవితేజ, నాని, విజయ్ దేవరకొండ, విశ్వక్ సేన్, సిద్ధూ జొన్నలగడ్డ తేజ సజ్జా, కార్తికేయ సహా చాలా మంది హీరోలు పవన్ కళ్యాణ్ కి మద్దతు గా నిలిచారు. అలాగే మెగా కుటుంబంలో ఆడవాళ్ళందరూ కూడా పవన్ కి మద్దతుగా అండగా నిలిచి తమ సపోర్ట్ ని తెలియచేసారు.
మెగా కోడళ్లు కూడా జనసేనాని సపోర్ట్..
ఇక మెగా ఫ్యామిలీ హీరోలతో పాటు ఈసారి మెగా కుటుంబీకులు అందరూ, మహిళలతో సహా పవన్ కళ్యాణ్ కి మద్దతు గా నిలిచారు. ఇప్పటికే కొనెడల ఉపాసన తన భర్త రామ్ చరణ్ తో సహా పవన్ కళ్యాణ్ కి మద్దతు తెలియచేసారు. ఇక తాజాగా మెగా న్యూ కోడలు వరుణ్ తేజ్ భార్య కొణెదల లావణ్య త్రిపాఠి (Lavanya Tripathi) కూడా పవన్ కళ్యాణ్ కి సపోర్ట్ గా ట్వీట్ వేసింది. ఇక ఆ ట్వీట్ లో ‘రాబోయే ఎన్నికలకు సిద్ధమవుతున్న ‘పవన్ కళ్యాణ్’ గారికి నేను మనస్పూర్తిగా మద్దతు ఇస్తున్నాను! మంచి భవిష్యత్తును సృష్టించాలనే మీ చిత్తశుద్ధి నిజంగా స్ఫూర్తిదాయకం, ఈసారి అందరూ దానిని గుర్తిస్తారు. “సానుకూల మార్పు మరియు ఉజ్వల భవిష్యత్తు కోసం ఏకం చేద్దాం”! అని ఇంగ్లీష్ లో ట్వీట్ వేసింది. ఇక ఎన్నికల వోటింగ్ రేపు మే 13న జరగనున్నాయి.
I wholeheartedly support @PawanKalyan garu as he prepares for the upcoming elections! Your sincere commitment to creating a better future is truly inspiring, and this time, everyone will recognize it. Let's unite for a positive change and a brighter future! #JanaSena… pic.twitter.com/ogzME6uOTu
— LAVANYA (@Itslavanya) May 12, 2024