Lavanya tripathi: కదలలేని స్థితి లో మెగా కోడలు.. ఆందోళనలో ఫ్యాన్స్..!

Lavanya tripathi.. తాజాగా మెగా కోడలు లావణ్య త్రిపాఠి షేర్ చేసిన ఒక పోస్ట్ ఇప్పుడు అభిమానులలో ఆందోళన కలిగిస్తోంది. ఇకపోతే నార్త్ బ్యూటీ లావణ్య త్రిపాఠి మెగా హీరో వరుణ్ తేజ్ ను ప్రేమించి పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే..అప్పటి నుంచి ఈ ముద్దుగుమ్మ సినిమాలకు దూరం అయింది… వివాహం తర్వాత మిస్ పర్ఫెక్ట్ వెబ్ సిరీస్ చేసింది. అయితే ఈ సీరీస్ తరువాత పూర్తిగా ఇండస్ట్రీకి దూరమైందనే చెప్పాలి. అప్పుడెప్పుడో నటించిన ప్రాజెక్ట్ జెడ్ కూడా ఇటీవల ఓ టి టి లోకి వచ్చి భారీగానే సందడి చేసింది.. కానీ అనుకున్నంత స్థాయిలో సక్సెస్ కాలేదు.. మరోవైపు ప్రస్తుతం ఈమె ఒక సినిమాలో కూడా నటించడం లేదు అని స్పష్టం అవుతోంది. ప్రస్తుతం ఇండస్ట్రీకి దూరమయ్యే కుటుంబ బాధ్యత తీసుకొని ఇంట్లోనే ఉంటుంది.. ఇక వరుణ్ మాత్రం వరుస సినిమాలు చేస్తున్నా.. సరైన సక్సెస్ మాత్రం అందుకోలేకపోతున్నాడు.. ప్రస్తుతం రెండు మూడు సినిమాలను లైన్లో పెట్టాడు ఇక షూటింగ్ గ్యాప్ దొరికితే చాలు లావణ్య త్రిపాఠితో కలిసి వెకేషన్ కి వెళ్తూ ఫుల్ ఎంజాయ్ చేస్తున్నాడు.

పెళ్లి తర్వాత అటు సినిమాలకు ఇటు సోషల్ మీడియాకి దూరం..

ఆ వెకేషన్ కి వెళ్ళిన ప్రతిసారి ఫోటోలను షేర్ చేస్తూ అందరిని అబ్బురపరుస్తూ ఉంటుంది. ఇక సినిమాల ద్వారా ప్రేక్షకులను అలరించకపోయిన సోషల్ మీడియా ద్వారా ఎప్పుడు ప్రేక్షకులకు అందుబాటులో ఉంటుందని చెప్పాలి.. అయితే వివాహం తర్వాత ఏమైందో తెలియదు కానీ.. ఈమధ్య పెళ్లి తర్వాత సోషల్ మీడియాలో కూడా అంత యాక్టివ్ గా కనిపించడం లేదు.. అప్పుడప్పుడు మాత్రమే పోస్ట్లు పెడుతోంది. ఇక ప్రస్తుతం సినిమాలకు కూడా దూరమైన నేపథ్యంలో

కాలికి గాయం..

Lavanya tripathi: Mega daughter-in-law in a state of immobility.. Fans are worried..!
Lavanya tripathi: Mega daughter-in-law in a state of immobility.. Fans are worried..!

తాజాగా మెగా కోడలు తన ఇంస్టాగ్రామ్ వేదికగా ఒక ఫోటో షేర్ చేసి అందరికీ షాక్ ఇచ్చింది. కాలికి గాయం అయి.. పట్టి ధరించిన ఫోటో పెట్టి వైద్యం తీసుకున్నట్లు తెలిపింది. ఈ పోస్ట్ చూస్తే ఈమె కూర్చుని నడవలేని పరిస్థితిలో ఉన్నట్లు తెలుస్తోంది. అయితే ఈ పాదం ఎవరిదో అనే విషయం మాత్రం క్లారిటీ లేదు. అయితే ఈ ఫోటో ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతూ ఉండగా.. ఈ విషయం తెలిసిన అభిమానులు లావణ్యకు ఏమైంది అంటూ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

- Advertisement -

లావణ్య కెరియర్..

ఇక లావణ్య త్రిపాఠి విషయానికి వస్తే.. ఈమె ఒక మోడల్ .. తెలుగు, తమిళ్, హిందీ భాషలలో పలు చిత్రాలలో నటించి ప్రేక్షకులను ఆకట్టుకుంది.. 2012లో వచ్చిన అందాల రాక్షసి సినిమా ద్వారా తెలుగు తెరకు పరిచయమైన లావణ్య త్రిపాఠి.. ఉత్తరప్రదేశ్లోని అయోధ్యలో జన్మించింది… ఉత్తరాఖండ్లోని డెహ్రాడూన్ లో పెరిగింది.. ఈమె తండ్రి హైకోర్టు న్యాయవాది.. తల్లి ఉపాధ్యాయురాలు.. పదవీ విరమణ చేసింది.. అంతేకాదు ఈమెకు ఒక చెల్లెలు , తమ్ముడు కూడా ఉన్నారు. మార్షల్ స్కూల్ విద్యాభ్యాసం పూర్తి చేసిన తర్వాత ముంబైకి వెళ్లి రిషి దయారాం నేషనల్ కాలేజీలో ఆర్థిక శాస్త్రంలో పట్టా కూడా అందుకుంది. మొదటినుంచి గ్లామర్ పరిశ్రమలో ప్రవేశించాలని ఉండేదని… కానీ తన తండ్రి కోరిక మేరకు చదువు పూర్తి చేసి ఆ తర్వాత మోడలింగ్ లోకి, టీవీ రంగంలోకి అడుగుపెట్టిందట లావణ్య. ఇక 2006లో మిస్ ఉత్తరాఖండ్ టైటిల్ కూడా గెలుచుకుంది. ఇక టీవీ సీరియల్స్, టీవీ షోలు , వెబ్ సిరీస్లలో కూడా నటించింది ఈ ముద్దుగుమ్మ.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు