Lawrence: కాంచన 4పై వస్తున్న ఆ రూమర్స్ కి చెక్ పెట్టిన లారెన్స్.. క్లారిటీ ఇచ్చేసాడుగా..!

Lawrence: మల్టీ టాలెంటెడ్ హీరోలలో లారెన్స్ ముందు స్థానంలో ఉంటారు. హీరో, దర్శకుడు అయినటువంటి లారెన్స్ తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును ఏర్పరచుకున్నారు. కొన్ని సినిమాలకి డైరెక్టర్ గా వ్యవహరించి గొప్ప డైరెక్టర్ అనిపించుకున్న హీన మరికొన్ని సినిమాల్లో హీరోగా కూడా నటించి మంచి పాపులారిటీని సంపాదించుకున్నాడు.

ఇక ఇందులో కాంచన సిరీస్ ఈయనకి మంచి హిట్ ఇచ్చాయి. కాగా రీసెంట్ గా కాంచన 4 పై ఓ అప్డేట్ బయటికి వచ్చింది. అయితే కాంచన 4 విషయంలో షూటింగ్ సహా కాస్టింగ్ పరంగా కొన్ని రూమర్స్ బయటకి వచ్చాయి. మరి ఈ రూమర్స్ పై ఇప్పుడు స్వయంగా రాఘవ లారెన్స్ స్పందించాడు.

కాస్టింగ్ విషయంలో వస్తున్న వార్తల్లో ఎటువంటి నిజం లేదని వాటిని ఎవరు నమ్మవద్దని క్లారిటీ ఇచ్చారు. దీనిపై తన రాఘవేంద్ర ప్రొడక్షన్స్ నుంచే అఫీషియల్ క్లారిటీ త్వరలోనే వస్తుంది అని కన్ఫామ్ చేశారు లారెన్స్. అయితే ఈ చిత్రంలో రీసెంట్గా మృణాల్ ఠాకూర్ నటించబోతున్నట్లు బజ్ వచ్చింది. ఇక దీని పైనే లారెన్స్ క్లారిటీ ఇచ్చాడు అనే సందేహణలు వ్యక్తమవుతున్నాయి.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు