RajTarun – Lavanya : రాజ్ తరుణ్ కేసుపై సంచలన నిజాలు బయటపెట్టిన లావణ్య తరపు లాయర్..

RajTarun – Lavanya : టాలీవుడ్ హీరో రాజ్ తరుణ్ ప్రేమ వ్యవహారం కేసు రోజుకో మలుపు తిరుగుతూ వార్తల్లో నిలుస్తుంది. వారం రోజుల కిందట అతని ప్రియురాలు లావణ్య నార్సింగ్ పోలీస్ స్టేషన్ లో రాజ్ తరుణ్ మోసం చేశాడంటూ పిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. అప్పుడే కొన్ని ఆధారాలను కూడా పోలీసులకి ఇవ్వడం జరిగింది. ఇకపోతే రాజ్ తరుణ్ పై సెక్షన్ 420, 493, 506 సెక్షన్ల కింద రాజ్ తరుణ్‌పై నార్సింగ్ పోలీసులు కేసు నమోదు చేశారు. దీనిపై రాజ్ తరుణ్ కూడా అప్పటికప్పుడు స్పందించి ఆమెకి కౌంటర్ వేయడం, అలాగే వీళ్ళ మధ్య గొడవకి కారణం మాల్వి మల్హోత్రా అనే హీరోయిన్ పై నింద మోపడం, అలాగే ఆ హీరోయిన్ కూడా కౌంటర్ ఇవ్వడం జరిగిపోయాయి. తాజాగా రాజ్ తరుణ్ – లావణ్య (RajTarun – Lavanya) ప్రేమ వ్యవహారంపై లావణ్య తరఫు లాయర్ కళ్యాణ్ దిలీప్ సుంకర లేటెస్ట్ గా మీడియాతో స్పందించగా, ఈ కేసుపై కొన్ని సంచలన నిజాలు కూడా చెప్పుకొచ్చారు.

రాజ్ తరుణ్ -పై సంచలన వ్యాఖ్యలు చేసిన లావణ్య లాయర్

ఇక లావణ్య తరపున కేసు తీసుకున్న ప్రముఖ లాయర్ కళ్యాణ్ దిలీప్ సుంకర లేటెస్ట్ గా రాజ్ తరుణ్‌పై ఆయన సంచలన వ్యాఖ్యలు చేశాడు. లావణ్య కి ఆమె లవర్ తీవ్ర అన్యాయం చేసాడని అతను నేరం చేసాడనడానికి దాదాపు 700కి పైగా ఆధారాలను పోలీసులకి అందచేసినట్టుగా లాయర్ దిలీప్ చెప్పారు. ఇక లావణ్యతో పదేళ్లు ప్రేమాయణం నడిపిన రాజ్ తరుణ్ లావణ్య ని మానసికంగా హింసించాడని చెప్పుకొచ్చాడు. అలాగే ఓ సందర్భంలో లావణ్యపై రాజ్ తరుణ్ బీర్ బాటిల్‌తో దాడి కూడా చేశాడన్నాడు. రాజ్ తరుణ్ మొన్నామధ్య లావణ్యతో పెళ్లి కాలేదని చెప్తున్నా మాట అబద్ధమని, పదేళ్లు లావణ్యని అతను వాడుకుని రెండు సార్లు ప్రెగ్నెంట్ చేసి దగ్గరుండి అబార్షన్ కూడా చేయించాడని లాయర్ కళ్యాణ్ చెప్పుకొచ్చారు. నార్సింగి పోలీస్ స్టేషన్‌లో లావణ్య ఇచ్చిన ఫిర్యాదులో మాల్వీ మల్హోత్రా అనే హీరోయిన్ తనని చంపేస్తానని బెదిరిస్తుందని తనకి ప్రాణహాని ఉందని, భద్రత కల్పించాలని కోరింది. దీంతో ఆ హీరోయిన్ నుండి ఇన్ఫర్మేషన్ లాగితే రాజ్ తరుణ్ గురించి అన్ని విషయాలు తెలిసాయి అంటూ అంటూ దిలీప్ సుంకర చెప్పుకొచ్చారు.

Lawyer Kalyan Dileep Sunkara sensational comments on Raj Tharun - Lavanya case

- Advertisement -

కుక్కల మధ్య వదిలేసాడు..

నటుడు రాజ్ తరుణ్ లావణ్యకి మస్తాన్ సాయి అనే కొత్త క్యారెక్టర్‌ ను సృష్టించి లావణ్యతో లింక్ చేసి ఆమె క్యారెక్టర్‌ను దెబ్బతీసే ప్రయత్నం చేశాడని, ఓ తప్పుడు ఆడియో క్లిప్ ని సృష్టించి ఆమె ఇమేజ్ ని డ్యామేజ్ చేసాడని చెప్పుకొచ్చారు. ఈ సందర్బంగా ఓ ఆడియో క్లిప్ గురించి లావణ్యాన్ని సమర్ధిస్తూ.. మరి కడుపు రగిలిన అమ్మాయి.. తనని మోసం చేసి వాడుకొని వదిలేసిన సమయంలో కోపంతో బూతులు మాట్లాడక నీతులు మాట్లాడుతుందా? మరి లావణ్య పై బీర్ బాటిల్ పగలగొట్టిన రాజ్ తరుణ్‌ను ఏం చేయాలంటూ ఫైర్ అయ్యాడు. ఒకానొక సందర్భంలో లావణ్యని ఇంట్లో తాను పెంచుకుంటున్న 15 కుక్కల మధ్య వదిలేసి వెళ్లిపోయాడని చెప్పుకొచ్చాడు. అప్పటినుంచి లావణ్యే ఆ కుక్కల్ని అన్నం పెట్టి చేరదీసిందని చెప్పుకొచ్చాడు. రాజ్ తరుణ్ ని వదిలే సమస్యే లేదని, పెళ్లి చేసుకుంటానని మోసం చేసి, కడుపు చేసిన అతగాడికి నేరం రుజువైతే 10 ఏళ్ళ జైలుశిక్ష పడుతుందని, అంతలోపు రానివ్వకుండా రాజ్ తరుణ్ లావణ్య ని పెళ్లి చేసుకుంటే ఇక్కడితో ముగిసిపోతుందని. లేకపోతే తర్వాత జరిగే పరిణామాలకు బాధ్యత వహించాల్సి వస్తుందని హెచ్చరించాడు. ఏది ఏమైనా ఈ కేసులో ఇంకెన్ని మలుపులు తిరుగుతాయో, ఎప్పుడు ఈ కేసు ముగుస్తుందో అంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు