Legend Saravanan: ఈ సమాజంలో 90 శాతం పనులు డబ్బులతో అయిపోతాయి అంటారు. కానీ గట్టిగా మాట్లాడితే 100% పనులు కూడా డబ్బులతో అయిపోతాయని చెప్పొచ్చు. ఇకపోతే లెజెండ్ శరణవన్ ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఒక బిజినెస్ మేన్ గా ఎంతో గుర్తింపును సాధించుకున్నాడు. తన షాపింగ్ మాల్ యాడ్స్ కోసం చాలామంది హీరోయిన్స్ తో వర్క్ కూడా చేశాడు. లెజెండ్ సినిమాలో ఫిలిం ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చాడు. ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద ఊహించిన విజయాన్ని సాధించకపోయినా కూడా కొంతమేరకు గుర్తింపును అయితే తీసుకొచ్చింది. ఈ సినిమా ట్రోల్స్ కి ఎక్కువ శాతం గురైంది చాలా మీమ్స్ ను ఈ సినిమాను వాడుకున్నారు.
అయితే, ఇప్పుడు ప్రస్తుతం శరణవన్ తన రెండో సినిమాను స్టార్ట్ చేశారు. దర్శకుడు దురై సెంథిల్ కుమార్ ఈ సినిమాకి దర్శకత్వం వహించనున్నారు. కాగా, ఈ సినిమా షూటింగ్ ను నేడు అఫీషియల్ గా స్టార్ట్ చేశారు. ఈ సినిమాలో ‘లెజెండ్’ శరవణన్ సరికొత్త గెటప్ లో కనిపిస్తున్నారు. ప్రస్తుతం ఆయనకు సంబంధించిన లుక్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. అయితే మొదటి సినిమాతో పోలిస్తే ఇప్పుడు శరనవన్ లుక్ లో చాలా మార్పు వచ్చింది అని చెప్పొచ్చు.
మొదటి సినిమాలో మీసం, గడ్డం లేకుండా కనిపించిన శరవణన్ ఈ పిక్స్‌లో మ్యాన్లీ లుక్‌లో పర్ఫెక్ట్ గా కనిపించారు. మరి లుక్ అయితే మారింది కానీ యాక్టింగ్ ఎలా ఉంటుందో అంటూ నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. త్వరలోనే ఈ ప్రాజెక్టుకి సంబంధించిన వివరాలు అధికారికంగా ప్రకటించనున్నారు. గరుడన్ సినిమాతో మంచి గుర్తింపును సాధించుకున్న సెంథిల్ కుమార్ ఈ సినిమాకి దర్శకుడుగా పనిచేయనున్నారు.