Kalki 2898 AD: ప్రభాస్ ‘కల్కి’ మూవీ టైమ్‌ ఫిక్స్‌..డార్లింగ్ థియేటర్లో ఎంతసేపు సందడి చేయనున్నాడంటే..?

Kalki 2898 AD: టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎంతోమంది హీరోలు ఉన్న సంగతి తెలిసిందే. అందులో కృష్ణంరాజు అండతో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చి మంచి గుర్తింపు తెచ్చుకున్న ప్రభాస్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఈశ్వర్ సినిమాతో టాలీవుడ్ సినీ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన ప్రభాస్ ఆ సినిమాతో మంచి గుర్తింపు అందుకొని వరుస చిత్రాల్లో నటిస్తూ ప్రేక్షకులను అలరిస్తున్నాడు. బాహుబలి సినిమాతో ప్రభాస్ రేంజ్ ఎక్కడికో వెళ్లిపోయింది. ఈ సినిమా అనంతరం ప్రభాస్ వరుస పాన్ ఇండియా సినిమాల్లో నటిస్తున్నాడు. ప్రభాస్ తాజాగా నటించిన మూవీ కల్కి 2898 ఏడీ.

ఈ సినిమా ఇండియన్ మైథాలజీని బేస్ చేసుకుని ఫ్యూచరిస్టిక్ కాన్సెప్ట్ తో ఈ చిత్రాన్ని నాగ్ అశ్విన్ తెరకెక్కించారు. వైజయంతి మూవీస్ బ్యానర్ లో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న ఈ సినిమా గ్లోబల్ మార్కెట్లోకి ఎంట్రీ ఇవ్వబోతోంది. మైథాలజీకి సైన్స్ ను లింక్ చేస్తూ డిఫరెంట్ కాన్సెప్ట్ తో కల్కి 2898 ఏడీ కథను రూపొందించారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి ఫస్ట్ గ్లింప్స్, బుజ్జి విత్ భైరవ గ్లింప్స్ అలాగే బుజ్జి అండ్ భైరవ యానిమేషన్ సిరీస్ కూడా రిలీజ్ అయ్యాయి. ఈ సినిమా ట్రైలర్ కు కూడా మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ సినిమాకి U/A సర్టిఫికెట్ వచ్చింది.

- Advertisement -

సెన్సార్ కూడా పూర్తి చేసుకుంది. ఈ సినిమా నిడివి 180.55 నిమిషాలు. అంటే దాదాపు మూడు గంటలు. ఇప్పుడు యావరేజ్ గా చూసుకుంటే రన్ టైం ఎక్కువే. సినిమా నిడివి అనేది పెద్ద సమస్య కాదని యానిమల్ సినిమా నిరూపించింది. 3 గంటల 20 నిమిషాల టైం తో యానిమల్ సినిమా వచ్చింది. ఆ సినిమా సూపర్ సక్సెస్ అందుకుంది. ఇప్పుడు కల్కి కూడా సక్సెస్ అవుతుందని అందరూ చెబుతున్నారు. కాగా ఈ సినిమా ఈ నెల చివరి వరకు ప్రేక్షకుల ముందుకు రానుంది. దీంతో ఈ సినిమా కోసం ప్రభాస్ ఫ్యాన్స్ ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు