Indian2 : ఇండియన్2 లో సీన్ రీ క్రియేట్ చేసిన నర్సులు.. మొబైల్ చూసి ఆపరేషన్! దారుణం బాబోయ్..

Indian2 : సొసైటీలో సినిమాలు అనేవి ఒకప్పుడు ఆటవిడుపుగా మాత్రమే ఉండేవి. కానీ ఇప్పుడు వాటిని చూసి కూడా ఇన్స్పైర్ అవుతున్నారు జనాలు. అయితే నిజ జీవితాల్లో జరిగే సంఘటనలని తీసుకునే దర్శకులు ఒకప్పుడు సినిమాలు తీసేవారు. ఇప్పుడు దర్శకుడి టాలెంట్ తో సినిమాటిక్ లిబర్టీతో సినిమాలు చేస్తున్నాడు. ఇకపోతే సినిమాల్లో జరిగే కొన్ని సంఘటనలు కూడా రీ క్రియేట్ అవుతుండడం చూస్తూనే ఉంటాం. అయితే కొన్నేళ్ల కింద వచ్చిన ఠాగూర్ సినిమాలో హాస్పిటల్ సీన్ తరహాలో చాలా ఎన్నో హాస్పిటల్స్ లో డబ్బులు లాగడం కోసం చనిపోయిన శవాలకు కూడా ఆపరేషన్లు చేయడం వైన్ ఉంటాం. అయితే తాజాగా మరో చోట ఒక సినిమాలో హాస్పిటల్ సీన్ రీ క్రియేట్ అయింది. అది కూడా రీసెంట్ గా వచ్చిన ఇండియన్2 సినిమాలోది కావడం గమనార్హం.

Like in the movie Indian2, the nurses who operated on a pregnant woman by looking at the mobile phone

ఇండియన్ 2 హాస్పిటల్ సీన్ రిపీట్..

రీసెంట్ గా వచ్చిన ఇండియన్2 సినిమా ప్లాప్ అయినా, అందులో జనాల్ని ప్రభావితం చేసే కొన్ని మంచి సీన్లు ఉన్నాయి. ఆ సినిమాలో హీరోయిన్ ఒక హాస్పిటల్ సీన్ గురించి చెప్తుంది. ఆ సన్నివేశంలో డాక్టర్ కి ఆపరేషన్ చేయడం రాకపోతే, ఇంకో డాక్టర్ కి ఫోన్ చేసి మొబైల్ లో చూస్తూ ఆపరేషన్ చేస్తారు. ఇలాంటి ఘోరాలు బయట విన్నాం కూడా. లేటెస్ట్ గా ఇదే తరహా సన్నివేశం రిపీట్ అయింది. అది కూడా దేశంలో ఎక్కడో కాదు, తెలుగు రాష్ట్రమైన తెలంగాణలో వనపర్తి లో ఈ దారుణం జరిగింది.

- Advertisement -

మొబైల్ చూసి ఆపరేషన్..

వనపర్తి కి చెందిన శ్రీరంగపూర్ మండలం నాగసానిపల్లి కి చెందిన ఒక మహిళా నిండు గర్భిణి గా కడుపులో నొప్పి వస్తుందని పెబ్బేరు లో ఓ ప్రయివేట్ హాస్పిటల్ లో చేరింది. అయితే హాస్పిటల్ లో ఆ సమయంలో డాక్టర్ అందుబాటులో లేకపోయినా నర్సులు అడ్మిట్ చేసుకొని, డాక్టర్‌ తో ఫోన్‌ లో మాట్లాడుతూ, మెసేజ్‌లు చేస్తూ గర్భిణీకి ట్రీట్మెంట్ చేశారు.. నర్సులకు ట్రీట్మెంట్ చేయడం రాక ఆ మహిళ గర్భ సంచి బ్లాస్ట్ అయి మృతి చెందింది. ఇలాంటి దారుణం జరుగుతుందని అసలు ఊహించలేదు. ఇది చూసి నెటిజన్లు దారుణంగా ఫైర్ అయ్యారు. పోలీసులు ఆ హాస్పిటల్ నర్సులను అరెస్ట్ చేసారు. అప్పట్లో ఠాగూర్ సినిమాలో, ఇప్పుడు ఇండియన్2 సినిమాలో హాస్పిటల్ సీన్స్ మళ్ళీ వైరల్ అవుతున్నాయి.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు