Gaddar Awards : గద్దర్ అవార్డ్స్ కోసం ప్రభుత్వం నియమించిన కమిటీ సభ్యులు వీరే!

Gaddar Awards : తెలుగు చలన చిత్ర పరిశ్రమకు ప్రభుత్వం నుండి ఎప్పటినుండో ఇస్తున్న గౌరవ గౌరవ పురస్కారాలు, తెలుగు రాష్ట్రాల విభజన తర్వాత నిలిచిపోయిన సంగతి తెల్సిందే. అయితే నంది అవార్డ్స్ ని ఇప్పుడు “గద్దర్ అవార్డ్స్” పేరిట తెలంగాణ ప్రభుత్వం నుండి ఇస్తామని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి తన అభిప్రాయం తెలపడం జరిగింది. అయితే కొన్నాళ్ల వరకు ఫిల్మ్ ఇండస్ట్రీ నుండి పెద్దగా స్పందన లేకపోవడంతో మరోసారి రేవంత్ రెడ్డి తన అభిప్రాయాన్ని ప్రకటించగా, వెంటనే స్పందించిన పద్మవిభూషణ్ చిరంజీవి (Chiranjeevi) తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ప్రముఖులకు సూచించగా, చిరంజీవి పిలుపు మేరకు ‘గద్దర్‌ అవార్డ్స్’ పై తెలుగు ఫిల్మ్ ఛాంబర్, ‘తెలంగాణ రాష్ట్ర ఫిల్మ్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌’ తో చర్చించి, సినీ ప్రముఖులతో పలు నియమనిబంధనలు, విధివిధానాలు రూపొందించి ప్రభుత్వానికి అందించారు.

List of Committee Members of Gaddar Awards

గద్దర్ అవార్డ్స్ చైర్మెన్ కంటే సభ్యులు వీరే!

ఇక గద్దర్ అవార్డ్స్ (Gaddar Awards) పేరిట తెలంగాణ ప్రభుత్వం తరపున ఇచ్చే ఈ గౌరవ పురస్కారాల కోసం “గద్దర్‌ అవార్డుల కమిటీ” ని ఏర్పాటు చేయడం జరిగింది. ఇండస్ట్రీలో సినీ ప్రముఖుల అభిప్రాయాలతో కమిటీని నియామకం చేయగా, ఈ గద్దర్‌ అవార్డుల కమిటీ చైర్మన్‌గా బి.నర్సింగరావు (మా భూమి నిర్మాత) , కమిటీ వైస్‌ చైర్మన్‌గా దిల్‌ రాజు (Dil raju), నియమించబడ్డారు. అలాగే కమిటీ సభ్యులుగా కె. రాఘవేంద్రరావు, అల్లు అరవింద్, సురేష్ బాబు , రచయిత అందెశ్రీ, రచయిత చంద్రబోస్, ఆర్.నారాయణ మూర్తి, వన్డే మాతరం శ్రీనివాస్, సానా యాదిరెడ్డి, అలాగే బలగం వేణు తదితరులు నియమించబడ్డారని సమాచారం.

- Advertisement -

త్వరలోనే గద్దర్ అవార్డ్స్ ప్రధానం..

ఇక ఈ గురువారమే కమిటీ నియామకం జరగగా, ఆ లిస్ట్ ని ఫిలిం ఛాంబర్ వారు ప్రభుత్వానికి అందచేయడం జరిగింది. టెలివిజన్, థియేటర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో గద్దర్ అవార్డు లోగో, విధివిధానాల రూప కల్పన కమిటీ ఏర్పాటు చేస్తూ తెలంగాణ సర్కార్ ఉత్తర్వులు జారీచేశారు. అతి త్వరలోనే ఈ గద్దర్ అవార్డ్స్ ని ప్రభుత్వం తరపున గ్రాండ్ గా స్టార్ట్ చేయనున్నారు. ఇక ఈ వేడుకకి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రతినిధులు కూడా గెస్ట్ గా హాజరయ్యే అవకాశం ఉంది. ఈ గద్దర్ అవార్డ్స్ గురించి మరింత సమాచారం రావాల్సి ఉంది.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు