Kalki2898AD : కల్కిలో భాగమైన భారీ తారాగణం…పాత్రల అంచనా ఇదే?

Kalki2898AD : టాలీవుడ్ తో పాటు ఇండియన్ మూవీ లవర్స్ కళ్లన్నీ ఇప్పుడు కల్కి2898AD మూవీ పైనే ఉన్నాయి. ఈ సినిమా కోసం ప్రభాస్ అభిమానులతో పాటు, కామన్ ఆడియన్స్ కూడా కళ్ళు కాయలు కాచేలా ఎదురుచూస్తున్నారు. రెబల్ స్టార్ ప్రభాస్ – నాగ్ అశ్విన్ కాంబినేషన్ లో తెరకెక్కిన ఈ సినిమాను వైజయంతి మూవీస్ బ్యానర్ లో అశ్విని దత్ ఏకంగా 600 కోట్ల భారీ బడ్జెట్ తో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించాడు. సెన్స్ ఫిక్షన్ డ్రామాకి మైథలాజికల్ టచ్ ఇస్తూ నాగ్ అశ్విన్ చేస్తున్న ప్రయోగాత్మక కథని చూడడానికి మూవీ లవర్స్ ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తూ కూర్చున్నారు. ఇక మరో సరిగ్గా ఐదు రోజుల్లో జూన్ 27న వరల్డ్ వైడ్ గా రిలీజ్ కాబోతున్న ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి. ఇక ఇప్పటికే రిలీజ్ అయిన ఈ సినిమా టీజర్, ట్రైలర్స్ పిచ్చెక్కించే హైప్ ని పెంచేసాయి. తాజాగా రిలీజ్ ట్రైలర్ పేరిట విడుదల చేసిన మరో ట్రైలర్ కూడా అంచనాలని పీక్స్ కి తీసుకుపోతుంది. ఇదిలా ఉండగా కల్కి2898AD (Kalki2898AD) సినిమాలో ఇండియన్ ఇండస్ట్రీలకి సంబంధించిన భారీ తారాగణం నటిస్తున్నారు. అయితే ఆ పాత్రల గురించి ఇప్పటివరకూ ఎవరికీ పెద్దగా తెలీదు. అయితే మాకందిన సమాచారం ప్రకారం కల్కి లో భాగమైన నటీనటుల డీటెయిల్స్ ఇలా ఉంది.

List of famous actors who acted in the movie Kalki2898AD

కల్కి2898AD లో భాగమైన భారీ తారాగణం…

ప్రభాస్ – భైరవ / కల్కి?
అమితాబ్ బచ్చన్ – అశ్వత్థామ
కమల్ హాసన్ – సుప్రీమ్ యాస్కిన్‌ (దేవుడిగా ప్రకటించుకున్న ఋషి)
దీపికా పదుకొనే – గర్భిణీ ల్యాబ్ సబ్జెక్ట్ SUM-80, పేరు ఇంకా రివీల్ కాలేదు.
దిశా పటాని – రాక్సీ
శోభన – మరియమ్‌
శశ్వత ఛటర్జీ – కమాండర్ మానస్‌
బ్రహ్మానందం – రాజన్
పశుపతి – వీరన్ (శంభల తిరుగుబాటుదారుడు)
అన్నా బెన్ – కైరా
కీర్తి సురేష్ – భైరవ అసిస్టెంట్ కార్ (వాయిస్ ఓవర్)
మాళవిక నాయర్ – ఉత్తర
రాజేంద్ర ప్రసాద్

- Advertisement -

ఇంకా ఈ సినిమాలో దుల్కర్ సల్మాన్, నాని, విజయ్ దేవరకొండ, ఎస్.ఎస్. రాజమౌళి కూడా గెస్ట్ అప్పీరెన్స్ ఇవ్వనున్నారు. బహుశా వీళ్ళ పాత్రలు మహాభారత యుద్ధం ఎపిసోడ్ లో కనిపించే అవకాశం ఉంది.

మొదలైన బుకింగ్స్.. ఆల్ టైం రికార్డ్స్ గ్యారెంటీ?

ఇక కల్కి2898AD సినిమా పై వరల్డ్ వైడ్ గా భారీ అంచనాలు ఉన్నాయ్. ఇక ఈ సినిమాలో దాదాపు అన్ని ఇండస్ట్రీ లకి చెందిన నటీనటులు ఉండడం వల్ల భారీ హైప్ ని తెచ్చుకుంది ఈ సినిమా. ఇక ఇప్పటికే ఓవర్సీస్ లో టాప్ గేర్ లో బుకింగ్స్ సొంతం చేసుకున్న కల్కి, తెలుగు రాష్ట్రాల్లో కూడా కొన్ని చోట్ల బుకింగ్స్ ఆల్రెడీ ఓపెన్ కావడం జరిగింది. ఇక కల్కి2898AD వరల్డ్ వైడ్ గా భారీ ఓపెనింగ్స్ ని కొల్లగొట్టే ఛాన్స్ ఉంది. ఇప్పటికే ఓవర్సీస్ లో ప్రీమియర్స్ బుకింగ్స్ 3 మిలియన్ డాలర్ల మార్క్ దాటిపోగా, వరల్డ్ వైడ్ గా అన్ని భాషల్లో కలిపి 250 నుండి 300 కోట్ల వరకూ గ్రాస్ ఓపెనింగ్స్ అందుకోవచ్చని అంటున్నారు ట్రేడ్ విశ్లేషకులు. ఒక్క తెలుగు రాష్ట్రాల్లోనే 100 కోట్ల ఓపెనింగ్స్ తెచ్చుకునే అవకాశం ఉంది. మరి రిలీజ్ రోజు నుండి కల్కి ఏ రేంజ్ లో బాక్స్ ఆఫీస్ వద్ద రచ్చ చేస్తాడో చూడాలి.

 

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు