Indian Box Office : బాలీవుడ్ బడా స్టార్ల కంటే మన డార్లింగే కాస్ట్లీ హీరో… ఎన్ని వేల కోట్లు సృష్టించాడంటే..?

Indian Box Office : రెబల్ స్టార్ ప్రభాస్ సినిమా సినిమాకి తన రేంజ్ ని అమాంతం పెంచుకుంటూ పోతున్నాడు. బాహుబలి సిరీస్ తో పాన్ ఇండియా రేంజ్ లో సంచలనం సృష్టించిన ప్రభాస్, ఆ తర్వాత కూడా తన సినిమాలతో రికార్డులు సృష్టిస్తున్నాడు. రీసెంట్ గా కల్కి2898AD సినిమాతో పాన్ ఇండియా రేంజ్ లో సక్సెస్ ని అందుకున్న ప్రభాస్ ఎన్నో చెరగని రికార్డులు తన ఖాతాలో వేసుకున్నాడు. జయాపజయాలతో సంబంధం లేకుండా, టాక్ తో సంబంధం లేకుండా తన సినిమాల ఓపెనింగ్స్ తోనే రికార్డులు సృష్టించే ప్రభాస్ తాజాగా కల్కి సినిమాతో మరో అరుదైన రికార్డు సాధించాడు. ఈ రికార్డుతో ఏకంగా బాలీవుడ్ బడా స్టార్లనే బీట్ చేసి తన రేంజ్ ని పెంచుకున్నాడు.

బాలీవుడ్ స్టార్లనే బీట్ చేసిన డార్లింగ్…

రీసెంట్ గా విడుదలైన కల్కి పాన్ ఇండియా వైడ్ గా బ్లాక్ బస్టర్ హిట్ కావడమే కాకుండా వెయ్యి కోట్లకి పైగా వసూళ్లు కొల్లగొట్టింది. ఇక తాజాగా ప్రభాస్ ఈ సినిమా ద్వారా మరో అరుదైన రికార్డు సృష్టించాడు. బాక్స్ ఆఫీస్ వద్ద గత దశాబ్ద కాలంలో తన సినిమాలతో అత్యధిక వసూళ్లు సాధించిన హీరోగా ప్రభాస్ నిలిచాడు. గత పదేళ్లలో తాను నటించిన 7 సినిమాలతోనే ఈ ఫీట్ ని సాధించడం విశేషం. ప్రభాస్ నటించిన బాహుబలి ది బిగినింగ్, బాహుబలి ది కంక్లూజన్, సాహో, రాధే శ్యామ్, ఆది పురుష్, సలార్, కల్కి2898AD సినిమాలతో ఈ రేర్ ఫీట్ ని సాధించాడు. ఈ సినిమాలన్నీ కలిపి 5300 కోట్ల వసూళ్ళని సాధించగా, గత దశాబ్దంలో వచ్చిన సినిమాలతో అత్యధిక వసూళ్లు అందుకున్న హీరోగా మొదటి స్థానంలో ప్రభాస్ నిలిచాడు. ఈ రికార్డుతో బాలీవుడ్ స్టార్ హీరోలని కూడా ప్రభాస్ అధిగమించి నెంబర్ వన్ గా నిలిచాడు.

List of Indian Actors with Highest Box office collection movies

- Advertisement -

దశాబ్దకాలంలో సినిమాలతో అత్యధిక వసూళ్లు సాధించిన స్టార్స్ వీరే!

1). ప్రభాస్ – 5300cr (7 Movies)
2). సల్మాన్ ఖాన్ – 5000cr (14 Movies)
3). షారుఖ్ ఖాన్ – 4300cr (10 Movies)
4). అమీర్ ఖాన్ – 4150cr (6 Movies)
5). రణబీర్ కపూర్ – 2810cr (10 Movies)
6). తలపతి విజయ్ – 2780cr (12 Movies)

కాస్ట్లీ హీరో అయిపోయిన డార్లింగ్…

ఇక ప్రభాస్ ఈ రికార్డులతో బాలీవుడ్ స్టార్లని మించి కాస్ట్లీ హీరో అయిపోయాడని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. ప్రస్తుతం సినిమాకి 100 నుండి 150 కోట్లు తీసుకుంటున్న ప్రభాస్ త్వరలో 200 కోట్లు కూడా తీసుకోవచ్చని అంటున్నారు. ఇక ప్రభాస్ చేతిలో ప్రస్తుతం నాలుగు సినిమాలు ఉన్నాయి. ఆల్రెడీ రాజా సాబ్ ఫినిషింగ్ దశకు చేరుకోగా, సందీప్ రెడ్డి వంగ స్పిరిట్, హనురాఘవ పూడి తో ఒక సినిమా, అలాగే శౌర్యంగ పర్వం, కల్కి పార్ట్2 లైన్లో ఉన్నాయి. ఈ సినిమాలు రావడానికి మరో మరో మూడేళ్లు పడుతుందని చెప్పొచ్చు.

 

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు