Tollywood : సరిగ్గా రెండు నెలలు.. ఈ వారం ఖచ్చితంగా హిట్టొచ్చే ఛాన్స్!

Tollywood : టాలీవుడ్ లో గత ఈ సంవత్సరం రిలీజ్ అయిన సినిమాల్లో దాదాపు పదికి ఎనిమిది సినిమాలు ప్లాప్ అయ్యాయి. ఈ ఏడాది లో బాక్స్ ఆఫీస్ దగ్గర ఈ ఇయర్ ఫస్ట్ 5 నెలలు ఆల్ మోస్ట్ ఎండ్ కావొస్తుంది. అప్పుడెప్పుడో టిల్లు స్క్వేర్ సినిమాతో దక్కిన టాలీవుడ్ కి ఇప్పటి వరకు మరో హిట్ దక్కలేదు. రీసెంట్ గా గత కొన్నేళ్లలో ఏ ఇయర్ లో కూడా ఈ రేంజ్ లో లో లెవల్ లో సినిమాల సక్సెస్ లు అవ్వకుండా ఉండలేదు. ఈ ఇయర్ వన్ ఆఫ్ ది వీకేస్ట్ సక్సెస్ లను దక్కించుకోగా, ఈ ఇయర్ మొత్తం మీద ఇప్పటి వరకు వచ్చిన సినిమాల్లో ఒకటి రెండు సినిమాలు మాత్రమే మంచి లాభాలను సొంతం చేసుకోగా మిగిలిన సినిమాలు అన్నీ కూడా నిరాశ పరిచే రిజల్ట్ లను సొంతం చేసుకున్నాయి. ఇక టాలీవుడ్ లో లాస్ట్ బ్రేక్ ఈవెన్ తెలుగు మూవీ రిలీజ్ అయ్యి ఆల్ మోస్ట్ 2 నెలలు అవుతుంది. మార్చ్ ఎండ్ లో 29న ఆడియన్స్ ముందుకు వచ్చిన టిల్లు స్క్వేర్ మంచి హిట్ గా నిలిచింది. ఆ సినిమా రిలీజ్ అయ్యి ఆల్ మోస్ట్ 2 నెలలు కంప్లీట్ అవ్వగా 2 నెలలలో టాలీవుడ్ (Tollywood) నుండి ఒక్కటంటే ఒక్క తెలుగు సినిమా కూడా హిట్ గీతని అందుకోలేక పోయాయి.

List of movies releasing this week in Tollywood

డబ్బింగ్ సినిమాల కన్నాఘోరం..

అయితే తెలుగులో రిలీజ్ అయిన కొన్ని ప్రతిష్టాత్మక చిత్రాలు చాలా దారుణంగా పరాజయం పాలయ్యాయి. ఇక టిల్లు స్క్వేర్ తరవాత కొన్ని డబ్బింగ్ సినిమాలు మంచి విజయం సాధించాయి. ప్రేమలు, మంజుమ్మేల్ బాయ్స్ వంటి సినిమాలు తెలుగులో కూడా విజయం సాధించాయి. కానీ ఎన్నో భారీ అంచానాలతో వచ్చిన ఫ్యామిలీ స్టార్, వంటి సినిమాలు తెలుగులో దారుణంగా పరాజయం పాలయ్యాయి. చిన్న సినిమాలు కూడా బాక్స్ ఆఫీస్ వద్ద చతికిలపడ్డాయి. కనీసం డబ్బింగ్ సినిమాల రేంజ్ లో కూడా ఆడలేదంటే అర్ధం చేసుకోవచ్చు ఇక్కడ ఎలాంటి కంటెంట్ ఉన్న సినిమాలు వచ్చాయో. అయితే ఈ వారం అనగా మే 31న మూడు ప్రతిష్టాత్మక చిత్రాలు రిలీజ్ అవుతున్నాయి. ఈ సినిమాల్లో ఖచ్చితంగా ఒక హిట్ వచ్చే ఛాన్స్ ఉందని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు.

- Advertisement -

ఈ మూడింట్లో ఒక హిట్ గ్యారెంటీ?

ఇక టాలీవుడ్ (Tollywood)లో ఈ వారం (మే 31న) మూడు సినిమాలు మినిమం అంచనాలతో రిలీజ్ కావడం జరుగుతుంది. అందులో ఒకటి విశ్వక్ సేన్ నటించిన గ్యాంగ్స్ అఫ్ గోదావరి, మరొకటి, కార్తికేయ నటించిన భజే వాయువేగం, ఇంకొకటి ఆనంద్ దేవరకొండ నటించిన గం గణేశా సినిమా. ఇక హిట్టు లేక కరువులో ఉన్న ఈ టైం లో ఆడియన్స్ ముందుకు గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి, భజే వాయు వేగం మరియు గం గం గణేశ సినిమాలు రిలీజ్ కానుండగా, ఉన్నంతలో మూడు సినిమాలలో ట్రైలర్ రిలీజ్ ల తర్వాత విశ్వక్ సేన్ ‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి’ సినిమా ఎంతో కొంత బాక్స్ ఆఫీస్ దగ్గర హిట్ గీతని దాటే సినిమాలా అనిపిస్తూ ఉందని చెప్పాలి. మిగిలిన సినిమాల బజ్ ఇంకా పెరగాల్సి ఉంది. మొత్తం మీద 2 నెలలుగా టాలీవుడ్ హిట్ మూవీ కోసం ఎదురు చూస్తూ ఉండగా ఈ వీకెండ్ తో అయినా ఓ మంచి హిట్ టాలీవుడ్ కి సొంతం అవుతుందో లేదో చూడాలి.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు