Tollywood : ఈ వారం ఏకంగా 9 సినిమాలు… ఒక్కదానికి సరైన బజ్ లేదుగా!

Tollywood : టాలీవుడ్ లో గత వారం రెండు క్రేజీ సినిమాలు రిలీజ్ అయ్యాయన్న సంగతి తెలిసిందే. అందులో ఒకటి హిట్ అవగా, మరొకటి అంతగా ఆడలేదు. మరో వారం రోజుల్లో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ కల్కి2898AD సినిమా రిలీజ్ ఉన్న నేపథ్యంలో ఈ వారం ఏ సినిమా కూడా రిలీజ్ చేయడానికి ధైర్యం చేయదని అనుకున్నారు అందరూ. ఎందుకంటే వారం తరవాత ఎలాగూ థియేటర్లలోంచి పాజిటివ్ టాక్ ఉన్నా తీసేస్తారు. పైగా కల్కి లాంటి పెద్ద సినిమా ఉండగా జనాలు ఇప్పుడేం సినిమా చుస్తాంలే డైరెక్ట్ గా వారం వెయిట్ చేసి కల్కినే చూద్దాం అన్న మైండ్ సెట్ తో ఉంటారు. మహా అయితే ఈ వారం ఒకటో రెండో సినిమాలు రావచ్చని అనుకున్నారు. కానీ అనూహ్యంగా ఈ వారం ఏకంగా తొమ్మిది సినిమాలు రిలీజ్ కాబోతున్నాయి. అందులో రెండు రీ రిలీజ్ సినిమాలు కూడా ఉన్నాయి. అయితే అన్ని చిన్న సినిమాలే ఉండడం విశేషం. ఇక ఈ వారం రిలీజ్ కాబోతున్న ఆ సినిమాలపై ఓ లుక్కేద్దాం.

List of movies releasing this week in Tollywood

ఈ వారం 9 సినిమాలు…

టాలీవుడ్ (Tollywood ) లో ఈ వారం జూన్21న తొమ్మిది సినిమాలు రిలీజ్ అవుతుండగా అందులో రెండు రీ రిలీజ్ సినిమాలు ఉన్నాయి. పైగా అన్నీ చిన్న సినిమాలే కావడం గమనార్హం. ముందుగా వరుణ్ సందేశ్ నటించిన నింద సినిమా శుక్రవారం రిలీజ్ కాబోతుంది. అలాగే సీతా కల్యాణ వైభోగమే పేరుతో మరో చిన్న సినిమా రిలీజ్ అవుతుంది. అలాగే వెన్నెల కిషోర్ మెయిన్ లీడ్ గా నటించిన ఓ మంచి ఘోస్ట్ (OMG) సినిమా ఈ వారం రిలీజ్ అవుతుంది. అలాగే ప్రభుత్వ జూనియర్ కళాశాల, సందేహం, పద్మవ్యూహంలో చక్రధారి, ఇట్లు మీ సినిమా వంటి చిత్రాలు ఈ వారమే రిలీజ్ కాబోతున్నాయి. అలాగే చైతన్య రావు, హెబా పటేల్ జంటగా నటించిన హనీ మూన్ ఎక్స్ ప్రెస్ ఈ వారం అనగా రేపే విడుదల ఆ అవుతుంది. ఇవన్నీ కాకుండా సుధీర్ బాబు నటించిన ప్రేమకథా చిత్రం ఈ వారం రీ రిలీజ్ అవుతుంది. అలాగే కన్నడ స్టార్ ఉపేంద్ర నటించిన ‘A’ సినిమా కూడా రీ రిలీజ్ అవుతుంది.

- Advertisement -

ఒక్కదానికి హైప్ లేదు…

అయితే ఇప్పుడు రిలీజ్ అవుతున్న సినిమాల్లో ఒక్క సినిమాకు సరైన హైప్ లేకపోవడం గమనార్హం. అందులోనే చాలా సినిమాలు అసలు రిలీజ్ అవుతున్న విషయం కూడా జనాలకి తెలీదు. ఇక ఉన్నంత లో వరుణ్ సందేశ్ నింద, అలాగే చైతన్య రావు హనీ మూన్ ఎక్స్ప్రెస్ సినిమాలు జనాలు కొంతవరకూ పట్టించుకునే ఛాన్స్ ఉంది. అయితే కొంతమంది మాత్రం ఈ సినిమాల కన్నా రీ రిలీజ్ అవుతున్న ఉపేంద్ర A సినిమా చూడొచ్చని అంటున్నారు. ఏది ఏమైనా కల్కి2898AD కన్నా వారం ముందు రిలీజ్ అవుతున్న ఈ సినిమాలలో ఏదైనా పాజిటివ్ టాక్ తెచ్చుకుంటుందో లేదో రేపటితో తెలుస్తుంది.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు