Lokesh Kanagaraj : టార్గెట్ మెగా కాంపౌండ్ ?

లోకేష్ కనగరాజ్, చేసింది నాలుగంటే, నాలుగే సినిమాలు. కానీ, మూడో సినిమాకే స్టార్ డైరెక్టర్ అయిపోయాడు. కోలీవుడ్ లో మాత్రమే కాదు టాలీవుడ్ లో ఉన్న స్టార్ హీరోలు కూడా ఈ యంగ్ డైరెక్టర్ తో సినిమాలు చేయడానికి వెయిట్ చేస్తున్నారు. లోకేష్ కూడా హీరోలకు తగట్టు మాస్, పవర్ ఫుల్ లైన్ లను చెబుతూ వస్తున్నాడు.

ఈ యంగ్ డైరెక్టర్ ప్రస్తుతం విజయ్ తో తలపతి67 అనే వర్కింగ్ టైటిల్ తో ఓ సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమా ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనుల్లో ఉంది. అతి త్వరలోనే సెట్స్ పైకి వెళ్లడానికి రెడీ అవుతుంది. అంతలోనే లోకేష్ తర్వాత ప్రాజెక్ట్ పై ఫోకస్ పెట్టేశాడు. తన ఆరో సినిమాను టాలీవుడ్ స్టార్ హీరోలతోనే చేయాలని ఫిక్స్ అయినట్టు తెలుస్తుంది. అందుకే వరుసగా తెలుగు స్టార్ లకు స్టోరీ చెబుతున్నట్టు ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తోంది.

ఇప్పటికే పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ లకు లోకేష్ పవర్ ఫుల్ లైన్ లను వినిపించినట్టు సమాచారం. ప్రభాస్ కొంత వరకు మార్పులు సూచిండట. అలాగే తారక్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు తెలుస్తుంది. కానీ, వీరి కంటే ముందే మెగా హీరోలతో సినిమా చేయాలని లోకేష్ పట్టుదలతో ఉన్నాడని, అందుకే మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కు, మెగాస్టార్ చిరంజీవికి మాస్ లైన్ లను వినిపించాడని టాక్. లోకేష్ స్టైల్ నచ్చడంతో ఇద్దరు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు ఫిల్మ్ నగర్ లో గుస గుసలు వినిపిస్తున్నాయి.

- Advertisement -

రామ్ చరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో RC15 చిత్రీకరణలో ఉండటంతో లోకేష్ ప్రయత్నాలకు బ్రేక్ పడింది. దీంతో మెగాస్టార్ చిరంజీవితో సినిమాను దాదాపు ఫిక్స్ చేయాలనే ఆలోచనలో లోకేష్ ఉన్నాడని తెలుస్తుంది. విక్రమ్ విజయం తర్వాత కమల్ హాసన్, లోకేష్ కనగరాజ్ ను చిరంజీవి సన్మానించిన విషయం తెలిసిందే. ఈ సమయంలోనే వీరి మధ్య స్టోరీకి సంబంధించిన చర్చ జరిగిందట.

నిజానికి, మెగాస్టార్ చిరంజీవి కూడా యంగ్ హీరోలను తలదన్నేలా ఫుల్ స్వింగ్ లో సినిమాలు చేస్తున్నాడు. వరుసగా సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడమే కాకుండా, అంతే వేగంగా షూటింగ్స్ లో కూడా పాల్గొంటున్నారు. అయితే, అన్ని అనుకున్నట్టు జరిగితే, చిరంజీవి – లోకేష్ కనగరాజ్ కాంబోలో అతి త్వరలోనే సినిమా వచ్చే అవకాశం ఉందని సమాచారం.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు