Lokesh Kanagaraj Speech: మూడో రోజు షూట్‌లో నన్ను తిట్టారు

Lokesh Kanagaraj Speech: ముందుగా షార్ట్ ఫిలిమ్స్ తో కెరియర్ స్టార్ట్ చేసి నగరం సినిమాతో తమిళ్ ఫిలిమ్ ఇండస్ట్రీకి దర్శకుడుగా ఎంట్రీ ఇచ్చాడు లోకేష్ కనకరాజ్. ఆ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద కమర్షియల్ గా మంచి విజయాన్ని సాధించి తమిళ్ ఫిలిమ్ ఇండస్ట్రీకి ఒక గొప్ప దర్శకుడు దొరికాడు అనేలా అనిపించింది. అదే సినిమా తెలుగులో నగరం పేరుతో రిలీజ్ అయింది. తెలుగు ప్రేక్షకులు కూడా ఈ సినిమాను అద్భుతంగా ఆదరించారు. ఈ సినిమా తర్వాత లోకేష్ చేసిన సినిమా ఖైదీ. ఈ సినిమా గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. ఒక రాత్రి ప్రయాణాన్ని ఒక రెండు గంటల పాటు ఎంతో ఉత్కంఠగా ఆసక్తికరంగా చూపించి దర్శకుడుగా తన టాలెంట్ ఏంటో మరోసారి ప్రూవ్ చేసుకున్నాడు.

విక్రమ్ సినిమాతో స్ట్రాంగ్ కం బ్యాక్

ఈ సినిమా తర్వాత తలపతి విజయ్ హీరోగా విజయ్ సేతుపతి విలన్ గా చేసిన సినిమా మాస్టర్. సంక్రాంతి కానుకగా రిలీజ్ అయిన ఈ సినిమా కూడా కమర్షియల్ గా మంచి హిట్ అయింది. ఈ సినిమా తర్వాత కమల్ హాసన్ తో విక్రమ్ అనే సినిమాను తెరకెక్కించాడు లోకేష్. దాదాపు కమల్ హాసన్ సినిమా కెరియర్ అయిపోయిందని త్వరలో ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ కొట్టింది. ఈ సినిమా భారీ కలెక్షన్స్ కూడా వసూలు చేసింది.

Lokesh kanagaraj

- Advertisement -

 

 

లోకేష్ కనకరాజ్ మాట్లాడుతూ

ఇకపోతే ప్రస్తుతం కమల్ హాసన్ ఇండియన్ టు అనే సినిమాని చేస్తున్న సంగతి తెలిసిందే. సినిమా మీద మంచి అంచనాలు ఉన్నాయి. అప్పట్లో వచ్చిన ఇండియన్ సినిమా ఎంత పెద్ద సంచలనం సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆ సినిమాకు సీక్వెల్ గా ఈ సినిమా వస్తుంది కాబట్టి ఈ సినిమా పైన ఎక్కువ అంచనాలు ఉన్నాయి. ఈ సినిమాకి అనిరుద్ రవిచంద్రన్ సంగీతం అందిస్తున్నారు. ఇప్పటికే రిలీజ్ అయిన పాటలు కూడా విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి. ఈ సినిమా ఆడియో లాంచ్ కు హాజరయ్యాడు లోకేష్ కనకరాజ్. ఆడియో లాంచ్ లో కొన్ని ఆసక్తికరమైన విషయాలను పంచుకున్నాడు. ఈ సినిమా అనౌన్స్‌మెంట్ అయినప్పటి నుండి నేను ఎదురు చూస్తున్నాను. నేను కమల్ సర్ లేదా శంకర్ సర్ లేదా అనిరుధ్‌ని ఎప్పుడు కలిసినా, ఈ సినిమా గురించిన అప్‌డేట్ కోసం అడుగుతాను. విక్రమ్ సినిమాకి సైన్ చేస్తున్నప్పుడు, కమల్ సర్ భారతీయ తాత గెటప్‌లో ఉన్నాడు. మేకప్ కారణంగా సంతకం చేయడానికి 5 నిమిషాలు పట్టింది. పూర్తి మేకప్ కోసం ఎంత సమయం పట్టిందో ఆలోచించండి. మూడో రోజు షూట్‌లో విక్రమ్‌లో స్పెల్లింగ్ మిస్టేక్ కోసం నన్ను తిట్టారు అంటూ చెప్పుకొచ్చాడు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు