Love Me: లవ్ మీ మూవీ ఓటిటి డేట్ లో మార్పు..వారం రోజులు ముందుగానే !

Love Me: ఈ మధ్య కాలంలో ఎన్నో రకాల సినిమాలు వస్తూనే ఉన్నాయి. అందులో కొన్ని సక్సెస్ అయితే మరికొన్ని ఫెయిల్ అవుతున్నాయి. అలా ఫెయిల్ అయిన సినిమాలు అతి తక్కువ సమయంలోనే ఓటీటీలోకి వస్తున్నాయి. ఈ మధ్యకాలంలో ప్రతి ఒక్కరూ థియేటర్లలో సినిమాలు చూడడం కన్నా ఎక్కువగా ఓటిటిలోనే సినిమాలు చూసేందుకు ఆసక్తిని చూపిస్తున్నారు. ఈ క్రమంలోనే తాజాగా హారర్ త్రిల్లర్ గా తెరకెక్కిన “లవ్ మీ” సినిమా మే 25న ప్రేక్షకుల ముందుకు వచ్చింది.

ఈ సినిమా నెగటివ్ టాక్ మూటగట్టుకుంది. ఈ సినిమా ప్రమోషన్స్ ని పెద్దగా మూవీ టీం చేయలేదు. దీంతో బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా మీద పెద్దగా ప్రభావం చూపలేకపోయింది. ఈ సినిమాలో ఆశిష్, వైష్ణవి చైతన్య ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ సినిమా కాన్సెప్ట్ కొత్తదే అయినప్పటికీ సినిమా తీసే విధానం కాస్త నిరాశపరిచింది. తాజాగా ఈ చిత్రం ఓటీటీ రిలీజ్ పై సోషల్ మీడియాలో బజ్ ఉంది.

Love Me movie 3 days collections
లవ్ మీ సినిమా తెలుగు స్ట్రీమింగ్ ప్లాట్ ఫారమ్ ఆహాలో జూన్ 15న వచ్చే అవకాశం ఉందని టాక్. అయితే దీనిపైన అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది. ఈ సినిమాకి అరుణ్ భీమవరపు దర్శకత్వం వహించారు. హర్షిత, హర్షిత్ రెడ్డి నాగమల్లిడి సినిమాను నిర్మించారు. ఈ సినిమాకు ఆస్కార్ అవార్డు గ్రహీత ఎంఎం కీరవాణి మ్యూజిక్ అందించారు. పిసి శ్రీరామ్ కెమెరా వర్క్ చేశారు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు