Love Me Trailer :ఇదేదో వర్కౌట్ అయ్యేలా ఉంది

Love Me: తెలుగు ఫిలిం ఇండస్ట్రీ లో ఉన్న టాప్ మోస్ట్ ప్రొడక్షన్ హౌసెస్ లో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ ఒకటి. ఈ బ్యానర్ పై ప్రముఖ నిర్మాత దిల్ రాజు సినిమాలు నిర్మిస్తూ ఉంటారు. దిల్ సినిమాతో మొదలైన ఈ బ్యానర్ ఇప్పటికీ విజయవంతంగా ఎన్నో సినిమాలు నిర్మిస్తూ వస్తుంది. ఈ బ్యానర్ లో ఎన్నో బ్లాక్బస్టర్ సినిమాలో వచ్చాయి. ఇదే బ్యానర్ తో ఎంతో మంది కొత్త దర్శకులు తెలుగు ఫిలిం ఇండస్ట్రీకి పరిచయం అయ్యారు. ఈ బ్యానర్ ద్వారా పరిచయమైన దర్శకులు అందరూ కూడా ప్రస్తుతం తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో ఒక రేంజ్ లో ఉన్నారని చెప్పొచ్చు. తెలుగు సినిమా సత్తా అని మరోసారి పాన్ ఇండియా లెవెల్లో చూపించిన సుకుమార్ కూడా ఇదే బ్యానర్ లో పరిచయం అయ్యాడు.

కొత్త దర్శకులను అందించిన బ్యానర్

ఎప్పుడూ కొత్త ఆలోచనలకు కొత్త కథలకు కొత్త దర్శకులకు ఒక అవకాశాన్ని ఇవ్వడంలో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ ముందంజలో ఉంటుందని చెప్పొచ్చు. ఒకరిలో టాలెంట్ ని గుర్తించడంలో ఎప్పటికీ ముందుంటారు దిల్ రాజు. అయితే ఈ బ్యానర్ లో వచ్చిన సినిమాలన్నీ దాదాపు బ్లాక్ బస్టర్ హిట్ అయ్యాయి. కొన్ని సినిమాలు మాత్రమే డిజాస్టర్ గా మిగిలాయి. ఇకపోతే ఈ బ్యానర్లో చాలా సినిమాలు లైన్ అప్ లో ఉన్నాయి. దాదాపు ఈ బ్యానర్ 50 సినిమాలను పూర్తి చేస్తుంది. ఈ బ్యానర్ లో ప్రజెంట్ జరుగుతున్న మోస్ట్ అవైటెడ్ ప్రాజెక్ట్ గేమ్ చేంజర్.

- Advertisement -

బ్యానర్ కి అనుబంధంగా మరో బ్యానర్ 

ఈ బ్యానర్ కి అనుబంధంగా దిల్ రాజు ప్రొడక్షన్స్ అనే బ్యానర్ను కూడా స్టార్ట్ చేశారు. ఈ బ్యానర్లో బలగం అనే ఒక సినిమా వచ్చింది. బలగం సినిమా క్రియేట్ చేసిన ఇంపాక్ట్ గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. ఇప్పుడు మిస్ అయిన ఫీల్ ను బలగం సినిమా తీసుకొచ్చింది. చాలామంది గ్రామాల్లో ఈ సినిమాను తెరపై వేసుకొని మరీ చూశారు. అంత అద్భుతంగా ఈ సినిమాను తీశాడు వేణు. ఈ సినిమా చూస్తున్నంత సేపు ఎమోషనల్ గా ప్రేక్షకుల్ని కట్టిపడేసాడు వేణు. దిల్ రాజు ప్రొడక్షన్స్ లో వచ్చిన ఈ సినిమా ఆ బ్యానర్ కు మంచి పేరును తీసుకొచ్చి పెట్టింది.

Love Me Trailer
Love Me Trailer

ట్రైలర్ టాక్

ఇప్పుడు అదే బ్యానర్ లో లవ్ మీ అని ఒక సినిమా రాబోతుంది.. ఇదివరకే ఈ సినిమా గురించి మాట్లాడుతూ ఇది ఒక ఆర్య లాంటి సినిమా అంటూ చెప్పుకొచ్చారు దిల్ రాజు. పోతే ఈ సినిమా ట్రైలర్ను రీసెంట్ రిలీజ్ చేసింది చిత్ర యూనిట్. ఈ ట్రైలర్ బాగానే ఆకట్టుకుంటుంది అని చెప్పొచ్చు. సినిమా పైన కూడా మంచి అంచనాలను పెంచుతుంది. ఈ ట్రైలర్ మొదటినుంచి చివరి వరకు చాలా ఆసక్తికరంగా కట్ చేశారు. ట్రైలర్ చూస్తున్నంత సేపు ఒక సస్పెన్షన్ మెయింటైన్ చేశారు. కచ్చితంగా ఇది వర్కౌట్ అవుతుంది అనిపించేలా ఉంది. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అద్భుతంగా అనిపించింది. హీరో దెయ్యం తో ప్రేమలో పడటం అనేది ఒక కొత్త పాయింట్ అని చెప్పొచ్చు.ఈ సినిమా వర్కౌట్ అయి మంచి హిట్ అయితే ఆశిష్ హీరోగా స్థిరపడిపోవచ్చు అని చెప్పొచ్చు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు