Love Mouli : కోలుకోలేని దెబ్బ తీసింది.. ఇకపై హీరోగా చెయ్యడా?

Love Mouli : టాలీవుడ్ లో చాలా కాలంగా హిట్ కోసం ఎదురుచూస్తున్న హీరోల్లో నవదీప్ ఒకరు. పరిచయమై దాదాపు రెండు దశాబ్దాలు కాగా, కెరీర్ బిగినింగ్ లో మంచి హిట్ల తో రచ్చ చేసాడు. కానీ ఆ తర్వాత అనూహ్యంగా డిజాస్టర్లు అందుకుని ఫామ్ కోల్పోయాడు. దాదాపు పది పదిహేనేళ్లుగా హిట్ లేదు. అందుకే స్టార్ హీరోల సినిమాల్లో సైడ్ రోల్స్ చేస్తూ వచ్చాడు. ఇక చాలా రోజుల తర్వాత మళ్ళి హీరోగా ట్రాక్ లోకి రావాలని ఒక్క సక్సెస్ అయినా కొట్టాలని బాగా కష్టపడి “లవ్ మౌళి” (Love Mouli) అనే సినిమా చేసాడు. ఆ సినిమా కోసం నవదీప్ చాలా కష్టపడ్డాడు. తనని తాను డిఫరెంట్ గా మలచుకుని పూర్తి కొత్త మేకోవర్ లో కనిపించాడు. సిక్స్ ప్యాక్ తో సహా డిఫరెంట్ హెయిర్ స్టయిల్ తో రగ్గడ్ గా కనిపించాడు సినిమాలో. పైగా నవదీప్ 2.0 అని ప్రమోట్ చేసారు. అయితే సినిమా ట్రైలర్ తోనే అడల్ట్ కంటెంట్ ఎక్కువగా ఉందని, యూత్ ని ఎక్కువగా టార్గెట్ చేసి ఈ సినిమా రూపొందింది అనిపించగా, మేకర్స్ యూత్ టార్గెట్ ఆడియన్స్ థియేటర్స్ కి భారీగా వస్తారు కలెక్షన్స్ వస్తాయి అని అంచనా వేశారు. తీరా విడుదలయ్యాక పరిస్థితి మారింది.

Love Mouli Movie was a disaster at the box office

ఏ రకంగానూ మెప్పించని మౌళి…

ఇక రెండు వారాల కింద రిలీజ్ అయిన లవ్ మౌళి (Love Mouli), సినిమా రిలీజ్ అయిన తర్వాత కాన్సెప్ట్ ఓవరాల్ గా పర్వాలేదు అనిపించేలా ఉన్నా, కామన్ ఆడియన్స్ రిజెక్ట్ చేసారు. యూత్ ని టార్గెట్ చేస్కుని తీసిన ఈ సినిమాను వాళ్ళు కూడా దారుణంగా దెబ్బ కొట్టారు. సినిమా పూర్తిగా ఓల్డ్ కంటెంట్ ఉందని. ఓన్లీ రొమాన్స్ ని టార్గెట్ చేసారని, కథలో బలంలేదని అన్నారు. ఇక బాక్స్ ఆఫీస్ దగ్గర కూడా కలెక్షన్స్ పరంగా ఏ దశలో కూడా మినిమమ్ ఓపెనింగ్స్ ను కూడా అందుకోలేక పోయింది ఈ సినిమా. ఇక మొదటి వీకెండ్ లోనే పెద్దగా ఇంపాక్ట్ ను చూపించ లేక పోయిన సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర వర్కింగ్ డేస్ లో కంప్లీట్ గా చేతులు ఎత్తేసింది. దాంతో టోటల్ రన్ ని చాలా త్వరగానే కంప్లీట్ చేసుకున్న సినిమా తీవ్రంగా నిరాశ పరిచే రిజల్ట్ తో పరుగును కంప్లీట్ చేసుకుంది. టోటల్ రన్ లో సినిమా ఓవరాల్ గా పట్టుమని 50 లక్షల గ్రాస్ ను కూడా అందుకోలేక పోయింది. వర్త్ షేర్ 22-24 లక్షల రేంజ్ లో మాత్రమే సొంతం చేసుకున్న ఈ సినిమాకి పెద్దగా బిజినెస్ ఏమి జరగలేదు కానీ సినిమా బడ్జెట్ 6 కోట్లకు పైనే ఉంటుందని అంచనా. ఆ బడ్జెట్ ప్రకారం చూసుకుంటే మాత్రం సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర తీవ్రంగా నిరాశ పరిచే రిజల్ట్ నే సొంతం చేసుకుంది అని చెప్పాలి.

- Advertisement -

ఇక నవదీప్ హీరోగా చెయ్యలేడా?

అయితే ఎన్నో ఆశలతో నవదీప్ మళ్ళీ హీరోగా లవ్ మౌళి అంటూ డిఫరెంట్ సినిమాతో వస్తే ప్రేక్షకులు దారుణంగా తిప్పి కొట్టారు. టార్గెట్ చేసిన యూత్ ఆడియన్స్ కూడా సినిమాను చూడటానికి పెద్దగా థియేటర్స్ కి రాకపోవడంతో ఈ సినిమాతో హీరోగా కంబ్యాక్ ఇవ్వాలని చూసిన నవదీప్ కి నిరాశనే మిగిలించింది. ఇక చాలా మంది నెటిజన్లు ఇప్పుడు నవదీప్ ఇక మళ్ళీ హీరోగా సినిమాలు చేసి చేతులు కాల్చుకోడు అంటున్నారు. ఎందుకంటే చాలా ఏళ్లుగా నవదీప్ స్క్రిప్ట్ సెలక్షన్ కూడా ఏమి బాగాలేదు. ఇక కొన్నేళ్లుగా ఇతర హీరోల సినిమాల్లో చేస్తున్నట్టు, స్టార్ హీరోల సినిమాల్లో ఇంపార్టెంట్ రోల్స్ చేస్తూ, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కొనసాగుతాడని నెటిజన్లు అంటున్నారు. మరి చూడాలి ముందు ముందు మళ్ళీ నవదీప్ హీరోగా చేస్తాడా లేదా.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు