Manchu Vishnu : డీజీపీ వరకు వెళ్లిన మంచు విష్ణు… సెల్యూట్ కొడుతున్న సినీ ఇండస్ట్రీ..

Manchu Vishnu : సోషల్ మీడియాలో సినీ నటుల గురించి అసభ్యంగా వస్తున్నా వీడియోలు , వార్తల పై ఇటీవల మా అసోషియేషన్ అధ్యక్షుడు మంచు విష్ణు సీరియస్ అయిన సంగతి తెలిసిందే.. అంతేకాదు కొన్ని యూట్యూబ్ ఛానెల్స్ ను కూడా బ్యాన్ చేశారు. తాజాగా ఈ విషయం పై మరో వార్త సంచలనం రేపుతోంది. తాజాగా ఈ విషయం పై మంచు విష్ణు తెలంగాణ డిజీపీని కలిసిన ఫిర్యాదు చేసినట్లు తెలుస్తుంది. శివబాలాజీ, రాజీవ్ కనకాల, సీనియర్ నటుడు శివకృష్ణలు మా అసోసియేషన్ తరపున డీజీపీని కలిశారు. ఐదు యూట్యూబ్ ఛాన‌ల్స్‌ను నిషేధించాలని విజ్ఞప్తి చేశారు.అంతేకాదు ఆ ఛానెల్స్ ను బ్యాన్ చెయ్యాలని యూట్యూబ్ కు ఫిర్యాదు చేసిన కాపీని కూడా డిజిపికి సబ్మిడ్ చేసారు..

గతంలో ఓ యూట్యూబర్ పెట్టిన అసభ్య వీడియో పై సాయి ధరమ్ తేజ్ స్పందించడమే కాదు. తెలంగాణ ముఖ్యమంత్రిని ప్రత్యేకంగా కలిసి ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే.. ఆ క్రమంలో మా అసోసిషియేషన్ సభ్యులు కూడా ఆ వీడియో పై స్పందించారు. అలాంటి కంటెంట్ ను ఇస్తున్న ఛానెల్స్ పై కొరడా ఝుళిపించడానికి రెడీ అయ్యారు.. ఈ మేరకు గత కొన్ని రోజుల క్రితం మంచు విష్ణు నటీనటుల పై యూట్యూబ్ లో వస్తున్న అసభ్య కంటెంట్ ను తీవ్రంగా ఖండించారు. అలాగే అలాంటి వీడియోలు ఉన్న ఛానెల్స్ ను మా అసోషియేషన్ బ్యాన్ చేస్తున్నట్లు చెబుతూ ఓ వీడియోను రిలీజ్ చేసాడు.

maa association has complained to the DGP about YouTube channels trolling actors
association has complained to the DGP about YouTube channels trolling actors

ఆ వీడియో నెట్టింట సంచలనంగా మారింది. ఆ వీడియోలో ఆయన మాట్లాడుతూ.. 200 లకు పైగా ఛానెల్స్ ట్రోల్స్ చెయ్యగా , అందులో 25 ఛానెల్స్ ను టెర్మినేట్ చేస్తున్నట్లు చెప్పారు.. మంచు విష్ణు 48 గంటలలోపు ట్రోల్స్ చేస్తున్న వీడియోలను డిలీట్ చెయ్యాలని హెచ్చరించారు.. కానీ కొన్ని ఛానెల్స్ స్పందించక పోవడంతో తాజాగా తెలంగాణ డిజిపి జితేందర్ కు ఫిర్యాదు చేసారు.. దీనిపై త్వరగా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేసారు. ఇకపోతే సైబర్ క్రైమ్ డిపార్ట్‌మెంట్‌తో కలిసి కో ఆర్డినేషన్ కమిటి ఏర్పాటు చేయబోతున్నామన్నారు.. ఈ విషయంపై మైంత సమాచారం తెలియాల్సి ఉంది..

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు