MAA fire on Hema : అఫిషియల్‌‌గా మా నుంచి హేమ సస్పెండ్… తెరపైకి మరో డిమాండ్.

MAA fire on Hema : బెంగళూరు రేవ్ పార్టీ కేసులో హేమ చుట్టూ ఉచ్చు బిగుస్తోంది. ఇప్పటికే పోలీసులు ఆమెను జైల్లో ఊచలు లెక్కబెట్టేలా చేశారు. ఇప్పుడు మా అసోసియేషన్ షాకింగ్ నిర్ణయం తీసుకుంది. తాజాగా జరిగిన ప్రెస్ మీట్ లో మా అధ్యక్షుడు మంచు విష్ణు హేమపై కఠినమైన చర్యలు తీసుకున్నామంటూ బాంబు పేల్చారు. ఏకంగా ఆమెను మా నుంచి అఫీషియల్ గా సస్పెండ్ చేసినట్టుగా తెలుస్తోంది.

హేమపై మా వేటు

గత నెల 20వ తేదీన బెంగళూరు శివారులోని హెబ్బగుడి పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న జిఆర్ ఫామ్ హౌస్ లో రేవ్ పార్టీ జరిగిన విషయం తెలిసిందే. పక్కా సమాచారంతో పోలీసులు దాడి చేయగా ఏకంగా పార్టీలో పాల్గొన్న 103 మందిని అదుపులోకి తీసుకోగా, అందులో కొంతమంది సినీ ప్రముఖులు ఉండడం విశేషం. ఆ లిస్ట్ లో హేమ కూడా ఉండడం గమనార్హం. ఈ నేపథ్యంలోనే మే 25న హేమను విచారణకు రావాలని పోలీసులు నోటీసులు ఇచ్చారు. కానీ ఆమె అసలు తాను రేవ్ పార్టీలో పాల్గొనలేదు అని బుకాయిస్తూ మొండిగా విచారణకు వెళ్లడానికి నిరాకరించింది. అయితే పోలీసులు మే 29న జూన్ 1న విచారణకు రావాలంటూ మళ్ళీ నోటీసులు పంపించారు. అయినప్పటికీ హేమా వెళ్లకపోవడంతో జూన్ 3న మరోసారి నోటీసులు ఇచ్చి ఆమెను విచారణ కోసం పిలిపించారు. అప్పటికే హేమ రేపు పార్టీలో పాల్గొని, డ్రగ్స్ తీసుకుందని రిపోర్ట్స్ రావడంతో ఆమెను మేజిస్ట్రేట్ ఎదుట హాజరు పరిచి 14 రోజుల పాటు జ్యుడీషియల్ కస్టడీకి పంపారు.

Hema : నటి హేమను సస్పెండ్ చేస్తూ నిర్ణయం.. ఈరోజు ప్రకటించే అవకాశం | maa president manchu vishnu will be suspended from the association as actress hema was arrested in a drug case

- Advertisement -

ఈ నేపథ్యంలోనే హేమ డ్రగ్స్ విషయం చిత్ర పరిశ్రమ పరువు ప్రతిష్టలకు సంబంధించింది కావడంతో మంచు విష్ణు కఠినమైన నిర్ణయం తీసుకున్నారు. తాజాగా జరిగిన ప్రెస్ మీట్ లో మా అసోసియేషన్ అధ్యక్షుడిగా ఉన్న మంచు విష్ణు హేమను మా నుంచి సస్పెండ్ చేస్తున్నామనే విషయాన్ని అధికారికంగా వెల్లడించారు. మంచు విష్ణు ఈ మీడియా సమావేశంలో హేమ మా సభ్యత్వాన్ని రద్దు చేశామని వెల్లడించారు.

అప్పుడేమో సపోర్ట్ ఇప్పుడేమో సస్పెండ్

అయితే నిజానికి రేవ్ పార్టీ గురించిన వార్తలు బయటకు వచ్చిన సమయంలో హేమపై తీవ్రమైన ఆరోపణలు వెల్లువెత్తాయి. కానీ హేమ తాను రేవ్ పార్టీలో పాల్గొనలేదంటూ ఆ వార్తలను ఖండించింది. అయితే చిత్ర పరిశ్రమ నుంచి కూడా పలువురు నటీనటులు ఆమెకు వ్యతిరేకంగా కామెంట్స్ చేయడంతో మంచు విష్ణు హేమకు సపోర్టుగా నిలిచారు. ఈ విషయంలో విచారణ జరుగుతుంది అంటూనే హేమ గురించి ఎవరు మాట్లాడొద్దని ఆదేశాలు జారీ చేశారు. ఈ నేపథ్యంలోనే ఆమెను పోలీసులు ఆధారాలతో సహా తాజాగా అరెస్టు చేయడంతో మంచు విష్ణు ఆమెను మా నుంచి సస్పెండ్ చేయడం చర్చకు దారి తీసింది.

మరో కొత్త డిమాండ్

ఈ నేపథ్యంలోనే హేమను సినిమాల్లో నటించకుండా బ్యాన్ చేయాలని ఆడియన్స్ డిమాండ్ చేస్తున్నారు. ఇదివరకు నిర్మాతలు హేమను సినిమా ఇండస్ట్రీ నుంచి బ్యాన్ చేయబోతున్నట్టుగా వార్తలు వచ్చిన విషయం తెలిసిందే.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు