Maar Muntha Chod Chinta Song : ఏం చేద్దాం అంటవ్ మరి… ఏం లేదు ఎంజాయ్ పండుగో

Maar Muntha Chod Chinta Song : డాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ ప్రకటించినట్లుగానే చెప్పిన టైమ్ కు ‘డబుల్ ఇస్మార్ట్’ నుండి మాస్ ట్రాక్ ‘మార్ ముంత చోడ్ చింత’ పాటను విడుదల చేశారు. మరి ఈ సాంగ్ విశేషాలు ఏంటంటే..

సెకండ్ సాంగ్ తో అల్ట్రా మాస్ ట్రీట్

రామ్, పూరీ జగన్నాధ్‌ల డబుల్ ఇస్మార్ట్ నుండి ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న మార్ ముంత చోడ్ చింతా రెండవ సింగిల్ ఎట్టకేలకు విడుదలైంది. ఇటీవల విడుదలైన ప్రోమో సాంగ్ పై ఇంట్రెస్ట్ ను క్రియేట్ చేయగా, తాజాగా రిలీజైన ఈ పాట అచ్చమైన తెలంగాణా ఫ్లేవర్‌లో ఎనర్జిటిక్ బీట్స్, క్యాచీ లిరిక్స్‌తో అల్ట్రా మాస్ డ్యాన్స్ నంబర్ గా ఉండడం విశేషం. ఫస్ట్ పార్ట్ ఇస్మార్ట్ శంకర్ లో పాటలు, మ్యూజిక్ మూవీ బ్లాక్ బస్టర్ కావడానికి ప్రధాన కారణం అయ్యాయి. ఇప్పుడు ‘డబుల్ ఇస్మార్ట్’లోనూ అదే పరిస్థితి కన్పిస్తోంది. సీక్వెల్ నుంచి ఇప్పటికే రిలీజైన ఫస్ట్ పాట ‘స్టెప్పా మార్’కి మంచి స్పందన వచ్చింది.

‘మార్ ముంత చోడ్ చింత’ పాటకు కాసర్ల శ్యామ్ సాహిత్యం అందించారు. ఈ పాటలోని హైదరాబాదీ స్లాంగ్, రసవంతమైన సాహిత్యం ఖచ్చితంగా యూత్ ను ఆకర్షిస్తుంది. ఈ సాంగ్ ను రాహుల్ సిప్లిగంజ్, ధనుంజన్ సీపాన, కీర్తనా శర్మ త్రయం పాడారు. మణిశర్మ తన లోకల్ బీట్‌లతో ఈ పాటను అందించిన మ్యూజిక్ ఒక్క మాటలో చెప్పాలంటే సూపర్. ఇకపై పార్టీలు, ఫంక్షన్ల సమయంలో ఈ పాట మార్మోగడం ఖాయం.

- Advertisement -

Image

 

 

పాపులర్ మీమ్స్ ను కూడా వదల్లేదు

రెండవ పాట మార్ ముంత చోడ్ చింత మాస్ బీట్ ఊహించినట్టుగానే బాగుంది. అయితే పాపులర్ మీమ్ డైలాగ్‌లతో నిండి ఉండడం సర్ప్రైజ్. ‘కుర్చిని మద్దపెట్టి’ పాట మాదిరిగానే డబుల్ ఇస్మార్ట్ మేకర్స్ మాజీ సీఎం కేసీఆర్ ‘ఏం చేద్దామంటావ్ మరి’, ‘ఎంజాయ్ పండగో’ అనే మరో డైలాగ్‌ను చేర్చారు. ఇక లిరికల్ వీడియోను చూస్తుంటే కన్నుల పండగగా కన్పిస్తోంది. ఈ భారీ సెట్లో హీరోయిన్ కావ్య థాపర్, హీరో రామ్ రెచ్చిపోయి డ్యాన్స్ చేయడం అదుర్స్. వాళ్ళ హుక్ స్టెప్ వైరల్ అయ్యే ఛాన్స్ ఉంది. ఈ పాటకు విజయ్ పోలంకి చేసిన కొరియోగ్రాఫీ బాగుంది. ఓవరాల్ గా చూసుకుంటే మేకర్స్ పాపులర్ మీమ్స్ ను కూడా వదలకుండా వాడేసి, మాస్ మూవీ లవర్స్ కు మంచి అల్ట్రా మాస్ ట్రీట్ ఇచ్చారు.

ఇదిలా ఉండగా, డబల్ ఇస్మార్ట్ ఆగస్ట్ 15న తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో పాన్-ఇండియన్ మూవీగా విడుదల కానుంది. ఛార్మి, పూరి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ హై-వోల్టేజ్ యాక్షన్ ఎంటర్‌టైనర్ కోసం హాలీవుడ్ సినిమాటోగ్రాఫర్ జియాని జియానెల్లి పని చేస్తున్నారు. కేచ యాక్షన్ కొరియోగ్రాఫర్. కావ్యా థాపర్‌ కథానాయిక. సంజయ్ దత్ విలన్‌గా నటిస్తున్నారు. మరి ఈ మూవీ రామ్, పూరీలకు స్ట్రాంగ్ కమ్ బ్యాక్ అవుతుందా అనేది చూడాలి.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు