Maar Muntha Chod Chinta Song : డబుల్ ఇస్మార్ట్ సెకండ్ సాంగ్ రిలీజ్ డేట్ ఫిక్స్

Maar Muntha Chod Chinta Song : టాలీవుడ్ యంగ్ హీరో రామ్ పోతినేని, డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ కాంబినేషన్లో వస్తున్న మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ డబుల్ ఇస్మార్ట్. ఈ సినిమా నుంచి బ్యాక్ టు బ్యాక్ సాంగ్స్ రిలీజ్ చేస్తూ అభిమానులకు మంచి మ్యూజికల్ ట్రీట్ ఇస్తున్నారు మేకర్స్. తాజాగా ఈ సినిమాలోని రెండో పాట రిలీజ్ కు ముహూర్తం ఖరారు చేశారు. మరి రెండో పాట ఎప్పుడు రిలీజ్ కాబోతోంది? అనే వివరాల్లోకి వెళితే…

మార్ ముంతా చోడ్ చింతా సాంగ్ టైమ్ ఆగయా

పూరి, రామ్ బ్లాక్ బస్టర్ మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ ఇస్మార్ట్ శంకర్ కు సీక్వెల్ గా వస్తున్న మూవీనే డబుల్ ఇస్మార్ట్. ఈ సినిమాలో రామ్ అల్ట్రా స్టైలిష్ గా కనిపించబోతున్నాడు. ఆయన సరసన కావ్య థాపర్ హీరోయిన్ గా నటిస్తోంది. అలాగే బాలీవుడ్ స్టార్ సంజయ్ దత్ కీలకపాత్రను పోషిస్తున్నారు. పూరి కనెక్ట్ బ్యానర్ పై ఛార్మితో కలిసి పూరి జగన్నాథ్ స్వయంగా ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఆగస్టు 15న ప్రపంచ వ్యాప్తంగా డబుల్ ఇస్మార్ట్ మూవీని రిలీజ్ చేయడానికి మేకర్స్ రెడీగా ఉన్నారు. ఇప్పటికే షూటింగ్ పనులు పూర్తి కాగా మ్యూజికల్ ప్రమోషన్స్ షురూ చేశారు మేకర్స్. మెలోడీ బ్రహ్మ మణిశర్మ ఈ సినిమాకు సంగీతం అందిస్తుండడంతో పాటలపై కూడా మంచి హైప్ క్రియేట్ కావడం విశేషం. అందుకు తగ్గట్టుగానే ఇప్పటికే డబుల్ ఇస్మార్ట్ నుంచి రిలీజ్ అయిన ఫస్ట్ సింగిల్ స్టెప్పా మార్ అనే పాటకు మంచి రెస్పాన్స్ దక్కింది. ఈ నేపథ్యంలోనే మేకర్స్ రెండో పాటను కూడా రిలీజ్ చేయడానికి రెడీ అయ్యారు.

- Advertisement -

రెండో పాట రిలీజ్ ఎప్పుడు అంటే?

తాజాగా మార్ ముంతా చోడ్ చింతా మేకర్స్ ఓ స్పెషల్ పోస్టర్ తో మార్ ముంతా చోడ్ చింతా అంటూ సాగే రెండో సాంగ్ రిలీజ్ పై అప్డేట్ ఇచ్చారు. రియల్ ఎంజాయ్మెంట్ బిగిన్స్ అంటూ జూలై 16న సెకండ్ సింగిల్ లిరికల్ వీడియోను రిలీజ్ చేయబోతున్నామని అనౌన్స్ చేశారు. ఇప్పటికే ఈ మూవీ నుంచి రిలీజ్ అయిన ప్రమోషనల్ కంటెంట్ టీజర్, ఫస్ట్ సాంగ్ సినిమాపై మంచి క్రియేట్ చేశాయి. మరి జూలై 16న రిలీజ్ కాబోతున్న మార్ ముంతా చోడ్ చింతా అనే సాంగ్ ఎంత వరకు ప్రేక్షకులకు కనెక్ట్ అవుతుందనేది తెలియాలంటే మరో రెండ్రోజులు ఆగాల్సిందే.

డబుల్ ఇస్మార్ట్ లో సర్ప్రైజ్….

అలాగే మేకర్స్ ఈ సినిమాలో ఓ సర్ప్రైజ్ కూడా ఇవ్వబోతున్నారని టాక్ నడుస్తోంది. ఇస్మార్ట్ శంకర్ మూవీలో హీరోయిన్ గా నటించిన నభా నటేష్ సీక్వెల్ లో కూడా కనిపించబోతుందని అంటున్నారు. నిజానికి ఫస్ట్ పార్ట్ లో నభా నటేష్ చనిపోయినట్టుగా చూపించారు. మరి సెకండ్ పార్ట్ లో ఈ బ్యూటీ ఎలా తిరిగి వస్తుంది ? అనే విషయంపై ఇప్పుడు సర్వత్రా ఆసక్తి నెలకొంది.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు