Maaveeran : తమిళ్ ఆడియన్స్ ఫెయిల్ అయ్యారు

Maaveeran : మండేలా సినిమాతో ఇండస్ట్రీకి దర్శకుడుగా ఎంట్రీ ఇచ్చాడు అశ్విన్. ఆ సినిమా ఎంతటి హిట్ గా నిలిచిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తమిళ్ లో వచ్చిన ఈ సినిమాను కేవలం తమిళ్ ప్రేక్షకులు మాత్రమే కాకుండా తెలుగు ప్రేక్షకులు కూడా ఈ సినిమాకి బ్రహ్మరథం పట్టారు. అయితే ఈ సినిమా పొలిటికల్ బ్యాక్ డ్రాప్ లో వచ్చింది. ఈ సినిమాలోని ఎన్నో అద్భుతమైన సామాజిక అంశాలను దర్శకుడు చూపించాడు. ఇదే సినిమాను తెలుగులో కూడా మార్టిన్ లూథర్ కింగ్ అనే పేరుతో రీమేక్ చేశారు. కానీ ఈ సినిమా ఊహించిన విజయాన్ని తెలుగులో సాధించలేకపోయింది.

ఇకపోతే మండేలా సినిమా గురించి తెలిసిన చాలా మంది కూడా దర్శకుడు అశ్విని గురించి కూడా తెలుసుకున్నారు. అశ్విని నుంచి రెండువ సినిమా కోసం క్యూరియాసిటీతో వెయిట్ చేశారు. అశ్విని దర్శకత్వం వహించిన రెండవ సినిమా మావీరన్. ఈ సినిమా తెలుగులో మహావీరుడు పేరుతో విడుదలైంది. ఇకపోతే ఈ సినిమాలో శివ కార్తికేయన్ హీరోగా నటించాడు. ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద మంచి విజయాన్ని సాధించుకుంది. కానీ ఈ సినిమా బ్లాక్ బస్టర్ అవ్వడానికి స్కోప్ కూడా ఉంది. ఈ సినిమా విషయంలో తమిళ్ ఆడియన్స్ ఎక్కడో ఫెయిల్ అయ్యారు అని అనిపించక మానదు. తెలుగులో ఈ సినిమా మంచి హిట్ అయింది.

Mahaveerudu

- Advertisement -

ఈ సినిమా కథ విషయానికి వస్తే

సత్య (శివకార్తికేయన్) ఓ పిరికివాడు. తన తల్లి (సరిత) మరియు చెల్లితో కలిసి ఓ బస్తీలో లైఫ్ లీడ్ చేస్తుంటాడు. ఐతే, ఇష్టం లేకపోయినా ప్రభుత్వం ఇచ్చిన ఓ అపార్ట్ మెంట్స్ లోకి తమ బస్తీవాసులతోటి కలిసి వెళ్లాల్సి వస్తోంది. అయితే, ఆ అపార్ట్ మెంట్స్ చాలా నాసిరకంగా కట్ట బడి ఉంటాయి. ఈ క్రమంలో జరిగిన కొన్ని నాటకీయ పరిణామాల నేపథ్యంలో సత్య తన బస్తీ వాసులను ఎలా సేవ్ చేశాడు?, ఆ అపార్ట్ మెంట్స్ ను అంత దారుణంగా కట్టిన మంత్రికి సత్య ఎలా బుద్ది చెప్పాడు?, ఈ మధ్యలో చంద్రమతి (అదితి శంకర్)తో సత్య లవ్ ట్రాక్ ఎలా సాగింది?, చివరకు సత్య మహావీరుడు అయ్యాడా ? లేదా ? అనేది మిగిలిన కథ. బ్లాక్ బస్టర్ హిట్ అవ్వాల్సిన సినిమాను మాములుగా వదిలేసారు తమిళ్ ఆడియన్స్. ఇక్కడే తమిళ్ ఆడియన్స్ ఫెయిల్ అయ్యారు అనిపిస్తుంది. బాక్స్ ఆఫీస్ వద్ద మ్యాజిక్ సృష్టించిన ఈ సినిమా విడుదలై నేటికి ఏడాది కావస్తుంది.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు