HBD Gopichand : గోపీచంద్ ని మళ్ళీ ఇలా చూడాలనుకుంటున్న అభిమానులు…

HBD Gopichand : టాలీవుడ్ లో ఉన్న నేటితరం హీరోల్లో మాస్ హీరో పర్ఫెక్ట్ కటౌట్ ఉన్న హీరో “గోపీచంద్”. మాస్ అన్న పదానికి నిలువెత్తు నిదర్శనంగా, ఆరడుగుల బులెట్ లా నిలిచే హీరో “గోపీచంద్”. మ్యాచో స్టార్ గా అభిమానులు పిలిపించుకునే ఈ మాస్ హీరో తన స్క్రీన్ ప్రెజెన్స్ తోనే కట్టిపడేస్తాడు. తన ఇంటెన్స్ లుక్ తో, గంభీరమైన గొంతు తో చెప్పే పవర్ ఫుల్ డైలాగులకు ప్రేక్షకులు ఎవరైనా ఫిదా అయిపోతారు. ఎదురుగా ఎంత పెద్ద విలన్ ఉన్నా వాళ్ళకి ఎదురెళితే తలదన్నేలా ఉంటాడు గోపీచంద్. నిజానికి ఒకప్పుడు గోపీచంద్ వేరు ఇప్పుడు గోపీచంద్ వేరు. ఆ రోజుల్లో పదిహేనేళ్ల కింద గోపీచంద్ సినిమా వస్తుందంటే మినిమం గ్యారెంటీ అనుకునేవాళ్లు. హిట్ ప్లాప్ తో సంబంధం లేకుండా మాస్ జనాలు గోపీచంద్ సినిమాలకు బ్రహ్మరథం పట్టేవారు. విలన్ నుండి హీరోగా ఎదిగి నేడు మ్యాచో స్టార్ట్ గా తెలుగు చిత్ర పరిశ్రమలో రెండు దశాబ్దాలుగా అభిమానులని అలరిస్తున్న గోపీచంద్ కొన్నాళ్లుగా వరుస పరాజయాలతో వెనకబడిపోయాడు. ఒకప్పటిలా తన రేంజ్ కి తగ్గ సినిమాలు రావట్లేదు. కానీ తన సినిమాల్లో రాటు దేలిన తన అద్భుతనటన తో ప్రేక్షకుల్ని మెప్పిస్తున్నాడు. బాక్స్ ఆఫీస్ కి హిట్టిచ్చి పదేళ్లయినా, కొన్నేళ్లుగా వరుస పరాజయాలు అందుకుంటున్నా, చెక్కు చెదరని అభిమానం మ్యాచో స్టార్ సొంతం.

Macho Star HBD Gopichand Birth Day Special

ఇలాంటి సినిమాల్లో గోపీచంద్ ని మళ్ళీ చూడాలి…

అయితే గోపీచంద్ మొదట హీరోగా ఎంట్రీ ఫస్ట్ సినిమా ఫెయిల్ అయ్యాక, విలన్ గా ఎంట్రీ ఇచ్చాడని తెలిసిందే. ఇక యజ్ఞం, నిజం, వర్షం లాంటి సినిమాల్లో అద్భుతమైన విలనిజం తో ప్రేక్షకులకి దడ పుట్టించాడు. ఆ సినిమాల్లో హీరోలని మించి అద్భుతంగా నటించి మెప్పించాడు. ఇక ఆ తర్వాత యజ్ఞం సినిమాతో మళ్ళీ హీరోగా మారి సక్సెస్ అయ్యాడు. ఇక గోపీచంద్ కెరీర్ లో బెస్ట్ మూవీస్ గా నిలిచిన చిత్రాలు ఆంధ్రుడు, గోలీమార్, శౌర్యం చిత్రాలు. ఇంకా వేరే సినిమాలు కూడా బాగానే ఉన్నా ఈ సినిమాల్లో గోపీచంద్ పెర్ఫెర్మన్స్ వేరే లెవెల్. ముఖ్యంగా ఆంధ్రుడు సినిమాలో ఓ నిజమైన పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ ఎలా ఉంటాడో అలా ఉంటాడు.

- Advertisement -

గోపీచంద్ వన్ మ్యాన్ షో తోనే ఆ సినిమా సూపర్ హిట్ అయిందంటే అతిశయోక్తి కాదు. ఇక పూరి జగన్నాథ్ సినిమాల్లో హీరో కి సెపరేట్ క్రేజ్ ఉంటుంది. ఎలాంటి క్లాస్ హీరోనైనా ఊరమాస్ గా చూపించే పూరి జగన్నాథ్ గోపీచంద్ (HBD Gopichand) ని గోలీమార్ సినిమాలో అద్భుతంగా చూపించాడు. ఆ సినిమాలో కూడా ఒక పవర్ ఫుల్ కాప్ గా, ఎన్కౌంటర్ స్పెషలిస్ట్ గంగారాం గా అభిమానులని అలరించాడు. ఆ రోజుల్లో 79 కేంద్రాల్లో అర్ధశతదినోత్సవం జరుపుకుంది ఈ సినిమా. ఇక శౌర్యం వంటి చిత్రాల్లో కూడా ఎంటర్టైన్ చేస్తూనే, విలన్లతో డైలాగులు చెప్పాల్సిన సందర్భం వచ్చినపుడు తన గంభీరమైన గొంతుతో ఓ రేంజ్ వాయిస్ బేస్ తో డైలాగ్ చెప్తుంటే థియేటర్లో విజిల్స్ పడతాయి.

మరో గంగారాం… ఒక గౌతమ్ నంద..

అయితే గోపీచంద్ లో ఆనాటి మాస్ హీరోని చాలా మిస్ అవుతున్నారు అభిమానులు. అప్పుడెప్పుడో పదేళ్ల కింద లౌక్యం సినిమాతో హిట్ అందుకున్న గోపీచంద్ మళ్ళీ సక్సెస్ కొట్టలేదు. అయినా గోపీచంద్ ఒకప్పుడు చేసిన గోలీమార్ లో గంగారాం పాత్ర గాని, గౌతమ్ నంద లో నంద పాత్ర గాని అభిమానులకు కల్ట్ ఫెవరేట్. అలాంటి క్రేజీ రోల్స్ లో గోపీచంద్ ని చూడాలని అనుకుంటున్నారు అభిమానులు. నిజంగా గోపీచంద్ కటౌట్ కి తగ్గ మాస్ సినిమా పడితే బాక్స్ ఆఫీస్ వద్ద జాతరే. ఇక నేడు మ్యాచో స్టార్ “గోపీచంద్” (HBD Gopichand) పుట్టినరోజు (జూన్12) నేడు. ఈ సందర్బంగా గోపీచంద్ కి బర్త్ డే విషెస్ ని అందచేస్తూ త్వరలో ఆయన హీరోగా రాబోతున్న “విశ్వం” సినిమాతో మళ్ళీ స్ట్రాంగ్ కం బ్యాక్ ఇవ్వాలని, ఆనాటి మ్యాచో స్టార్.. మాస్ గోపీచంద్ ని మళ్ళీ థియేటర్లో చూడాలని కోరుకుంటున్నారు అభిమానులు..

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు