Mahabharatham: రాజమౌళి తీస్తారా.. నాగ్ అశ్విన్ తీస్తారా..?

Mahabharatham: తెలుగు సినీ ఖ్యాతిని బాహుబలి సినిమాతో పాన్ ఇండియా వైడ్ గా విస్తరించిన రాజమౌళి గురించి ఎంత చెప్పినా తక్కువే.. తెలుగు సినీ ఇండస్ట్రీనీ RRR చిత్రంతో ఏకంగా ఆస్కార్ వద్దకు తీసుకువెళ్లడమే కాకుండా ఆస్కార్ అవార్డును కూడా గెలుచుకునేలా చేశారు రాజమౌళి.. దీంతో రాజమౌళి అనగానే తెలుగు సినీ పరిశ్రమ గుర్తుకు వచ్చేలా ఇతర దేశాలలో కూడా పేరు సంపాదించుకున్నారు. ఇప్పటివరకు ఒక్క ఫెయిల్యూర్ లేని డైరెక్టర్ గా కూడా పేరు సంపాదించారు రాజమౌళి. అంతలా తన సినిమాలతో ప్రేక్షకులను ఆకట్టుకుంటూ ఉంటారు. అయితే ఇప్పుడు రాజమౌళికి చాలా ఇష్టమైన డ్రీం ప్రాజెక్ట్ మహాభారతం.. ఎప్పుడు తెరకెక్కిస్తారా అంటూ అభిమానులు సైతం చాలా ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు.

రాజమౌళి డ్రీమ్ ప్రాజెక్ట్..

Mahabharatham: Will Rajamouli take it.. Nag Ashwin take it..?
Mahabharatham: Will Rajamouli take it.. Nag Ashwin take it..?

ఒకవేళ రాజమౌళి మహాభారతం తీస్తే ఒక్క పార్ట్ తో అది ఆగిపోదని.. అలాగే దేశంలో ఉండే అన్ని సినీ పరిశ్రమల నుంచి చాలామంది నటీనటులు సైతం ఇందులో నటిస్తారని వెల్లడించారు. ఇప్పటికే వెబ్ సిరీస్ , టీవీ సీరియల్స్ ద్వారా ఎంతోమంది మహాభారతాన్ని చాలా రకాలుగా చూపించడం జరుగుతోంది. కానీ రాజమౌళి మహాభారతం తీస్తే ఎలా ఉంటుందో అంటూ అభిమానులు కూడా చాలా ఎక్సైటింగ్ గా ఎదురు చూస్తున్నారు. ఇలాంటి సమయంలోనే ఇప్పుడు మరొక ప్రశ్న ఎదురవుతోంది

కల్కితో నాగ్ అశ్విన్ ప్రభంజనం..

అదేమిటంటే ఇటీవలే ప్రభాస్ నటించిన కల్కి2898AD చిత్రం నిన్నటి రోజున విడుదలై భారీ విజయాన్ని అందుకున్నది.. ఈ చిత్రాన్ని డైరెక్టర్ నాగ్ అశ్విన్ తెరకెక్కించారు. ముఖ్యంగా ఈయన తీసిన సినిమా చాలా అద్భుతంగా వచ్చిందని.. గ్రాఫిక్స్ మాత్రమే కాకుండా , తాను ఎంచుకున్న పాత్రలు, నటీనటుల విషయంలో కూడా అద్భుతంగా ఉండడంతో రాజమౌళి కంటే నాగ్ అశ్విన్ ముందుగా మహాభారతాన్ని తీస్తాడేమో అనేంతలా విజువల్స్ లో కల్కి చిత్రాన్ని చూపించారు. కల్కి చిత్రం కురుక్షేత్రానికి – కలియుగానికి మధ్య లింక్ పెట్టి చూపించడం జరిగింది.

- Advertisement -

మహాభారతం సినిమా నాగ్ అశ్విన్ తీస్తారా..

అలా కల్కి2898AD చిత్రంలో మహాభారతానికి సంబంధించి కొన్ని విజువల్స్ కూడా చూపించారు. ఇవి ఈ చిత్రానికే హైలైట్ గా నిలిచాయి. అయితే ఇంత బాగా ఎవరూ కూడా ఇలాంటి కురుక్షేత్ర యుద్ధానికి సంబంధించినటువంటి సన్నివేశాలు చూపించరేమో అనేంతగా ప్రేక్షకులు తెలియజేస్తున్నారు. అయితే మహాభారతం కల్కి నెక్స్ట్ పార్ట్ లో కూడా ఉంటుందంటూ సినిమా చివరిలో హింట్ ఇవ్వడం జరిగింది నాగ్ అశ్విన్.. కల్కి యూనివర్సల్ లో భాగంగా రాబోతున్న నెక్స్ట్ చిత్రంలో మహాభారతానికి సంబంధించిన వాటిని చూపిస్తారా లేదా అనే విషయం మాత్రం ఇంకా క్లారిటీ ఇవ్వలేదు.

రాజమౌళి Vs నాగ్ అశ్విన్..

కల్కి చిత్రంలో కేవలం ఐదు నిమిషాలలో చూపించిన మహాభారతం విజువల్స్ అందరినీ ఆకట్టుకోవడంతో మహాభారతం సీన్స్ మరింత ఎక్కువ చూపిస్తే.. కచ్చితంగా రాజమౌళి కంటే ముందుగా నాగ్ అశ్విన్ తన కల్కి సినిమాటిక్ యూనివర్స్ లో భాగంగా మహాభారతాన్ని సైతం చూపిస్తారేమో అని ప్రేక్షకులు తెలియజేస్తున్నారు. అయితే రాజమౌళి తన డ్రీమ్ ప్రాజెక్టుగా పెట్టుకున్న ఈ మహాభారతం సినిమాని నాగ్ అశ్విన్ తెరకెక్కిస్తారా లేక రాజమౌళి కోసం వదిలేస్తారా అన్నది కూడా ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారింది. అయితే మహాభారతం సినిమాను ఎవరు ఎన్ని విధాలుగా తీర్చిదిద్దిన సినిమా చూడడానికి ఎప్పుడు చాలా కొత్తగానే ఉంటుంది. మరి నాకు అశ్విన్ కూడా సినిమాను తెరకెక్కిస్తారా అనే విషయాలు ఇంకా ప్రశ్నలు గానే మిగిలిపోయాయి. మరి ఏం జరుగుతుందో చూడాలి మరి.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు