Maharaja : మహారాజా మూవీ బిజినెస్ & బ్రేక్ ఈవెన్ డీటెయిల్స్..

Maharaja : ప్రముఖ కోలివుడ్ స్టార్ విజయ్ సేతుపతి గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. కోలీవుడ్ తో పాటు టాలీవుడ్ లో కూడా మంచి పేరున్న హీరోలలో ఒకరైన విజయ్ సేతుపతి త్వరలో తన కెరీర్ లో 50వ సినిమాగా రూపొందిన లేటెస్ట్ మూవీ “మహారాజా” (Maharaja) సినిమా తో ఆడియన్స్ ముందుకు ఈ శుక్రవారం రాబోతున్నాడు. క్రేజీ అంచనాల మధ్య మహారాజా మూవీ రిలీజ్ అవ్వడానికి సిద్ధం అవుతూ ఉండగా, ఈ సినిమా ట్రైలర్ రిలీజ్ అయిన తర్వాత సినిమాకి కూడా మంచి బజ్ అయితే ఏర్పడింది అని చెప్పాలి. ఇక ఈ సినిమా తమిళ్ తో పాటు తెలుగు లో ఇప్పుడు గ్రాండ్ రిలీజ్ ను సొంతం చేసుకోబోతుంది. మహారాజా సినిమా తెలుగు రాష్ట్రాల్లో మొత్తం మీద 300 వరకు థియేటర్స్ లో రిలీజ్ అవ్వడానికి సిద్ధం అవుతూ ఉండగా, తమిళ్ వర్షన్ ఓవరాల్ గా 300 వరకు థియేటర్స్ లో రిలీజ్ కానుంది. ఇక టోటల్ వరల్డ్ వైడ్ గా ఈ సినిమా 800 వరకు థియేటర్స్ లో సినిమా రిలీజ్ కాబోతుంది.

Maharaja Movie Business & Break Even Details

బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ డీటెయిల్స్…

ఇక మహారాజా సినిమా తమిళ్ వర్షన్ ఓవరాల్ వాల్యూ బిజినెస్ రేంజ్ 18 కోట్ల దాకా ఉంటుందని అంచనా. ఇక సినిమా తెలుగు రాష్ట్రాల్లో ఓవరాల్ గా వాల్యూ బిజినెస్ రేంజ్ 3 కోట్ల రేంజ్ దాకా ఉంటుందని అంచనా. దాంతో ఈ సినిమా తెలుగు లో క్లీన్ హిట్ అవ్వాలి అంటే, దాదాపు 3.5 కోట్ల రేంజ్ లో షేర్ ని అందుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఇక ఈ సినిమా టోటల్ వరల్డ్ వైడ్ గా 21 కోట్ల రేంజ్ లో వాల్యూ బిజినెస్ ను అందుకోగా సినిమా వరల్డ్ వైడ్ గా బ్రేక్ ఈవెన్ ని అందుకోవాలి అంటే దాదాపు 43 కోట్ల లోపు గ్రాస్ మార్క్ ని అందుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఇక మహారాజా సినిమా ఇక్కడ ఎలాంటి కలెక్షన్స్ ని అందుకుంటుందో చూడాలి.

- Advertisement -

భారీ అంచనాలతో మక్కల్ సెల్వన్ మూవీ…

ఇక మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి యొక్క 50వ చిత్రం మహారాజా సినిమా ఈ వారం అనగా జూన్ 14, 2024న విడుదల కానుంది. ట్రైలర్ ఇటీవల రిలీజ్ కాగా, ఆడియెన్స్ నుండి సూపర్ రెస్పాన్స్ ను సొంతం చేసుకుంది. ఇక ఈ చిత్రం సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకోగా, మహారాజ సినిమా యూ/ఎ సర్టిఫికెట్ పొందింది. అలాగే ఈ సినిమా రన్‌టైమ్ 142 నిమిషాలు (2 గంటల 22 నిమిషాలు) గా నిర్ణయించబడింది. ఇక మహారాజా మూవీకి నితిలా స్వామినాథన్ అనే డైరెక్టర్ దర్శకత్వం వహించడం జరిగింది. ఫ్యాషన్ స్టూడియోస్, ది రూట్ బ్యానర్లపై జగదీష్ పళని స్వామి, సుధన్ సుందరన్ ఈ చిత్రాన్ని సంయుక్తంగా నిర్మించారు. యంగ్ మ్యూజిక్ సెన్సేషన్ అజనీష్ లోకనాథ్ మహారాజా మూవీకి సంగీతం అందించడం జరిగింది. మరి తెలుగులో హరోం హర సినిమాతో పోటీగా రిలీజ్ అవుతున్న మహారాజా సినిమా థియేటర్లలో ఏ మేరకు మెప్పిస్తుందో చూడాలి.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు