Maharaja : సెన్సార్ పనులు పూర్తిచేసుకున్న మక్కల్ సెల్వన్ మూవీ.. రన్ టైం ఎంతంటే!

Maharaja : కోలీవుడ్ స్టార్ విజయ్ సేతుపతి వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు. ఓ వైపు హీరోగా సినిమాలు చేస్తూనే, మరోవైపు విలక్షణ పాత్రలు, ఇతర స్టార్స్ సినిమాల్లో వైవిధ్యమైన ప్రతినాయకుడి పాత్రల్లో కూడా నటిస్తూ దూసుకుపోతున్నాడు. ఇక మక్కల్ సెల్వన్ గా తమిళ ప్రేక్షకుల అభిమానాన్ని చురగొన్న ఈ విలక్షణ నటుడు సౌతిండియా భాషల్లోనే గాక ఇప్పుడు హిందీలోనూ నటిస్తున్నాడు. విక్రమ్ వేద, 96 వంటి సినిమాల్లో ఎంతో హృదయాన్ని కరిగించే పాత్రలు చేసిన విజయ్ సేతుపతి తాజాగా తన సినిమా కెరీర్ లో మైల్ స్టోన్ చిత్రమైన “మహారాజా” సినిమాతో ప్రేక్షకులని పలకరించడానికి రెడీ అయ్యాడు. ఈ సినిమా విజయ్ సేతుపతి కెరీర్ లో 50వ సినిమాగా తెరకెక్కిన విషయం తెలిసిందే. ఇక ఫస్ట్ లుక్ తినే ఇంప్రెస్ చేసిన ఈ సినిమా ట్రైలర్ రీసెంట్ గా రిలీజ్ అయి మంచి రెస్పాన్స్ తెచ్చుకుంది. ఇక ట్రైలర్ లో విజయ్ సేతుపతి గతంలో ఎన్నడూ లేని విధంగా మోస్ట్ వైలెంట్ పాత్రలో కనిపించి అందరి దృష్టిని ఆకర్షించారు. తాజాగా ఈ సినిమా సెన్సార్ పనులను కూడా పూర్తి చేసుకుంది.

Maharaja movie got U/A certificate from Censor

మహారాజా సెన్సార్ పూర్తి రన్ టైం ఎంతంటే?

మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి యొక్క 50వ చిత్రం మహారాజా సినిమా ఈ వారం అనగా జూన్ 14, 2024న విడుదల కానుంది. ట్రైలర్ ఇటీవల రిలీజ్ కాగా, ఆడియెన్స్ నుండి సూపర్ రెస్పాన్స్ ను సొంతం చేసుకుంది. తాజాగా హైదరాబాద్‌లో మేకర్స్ ప్రెస్ మీట్ కూడా నిర్వహించారు. ఇక ఈ చిత్రం సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకోగా, మహారాజ సినిమా యూ/ఎ సర్టిఫికెట్ పొందింది. తాజా అప్డేట్ ప్రకారం, సినిమా రన్‌టైమ్ 142 నిమిషాలు (2 గంటల 22 నిమిషాలు)గా నిర్ణయించబడింది. ఇక మహారాజా మూవీకి నితిలా స్వామినాథన్ అనే డైరెక్టర్ దర్శకత్వం వహించడం జరిగింది. ఫ్యాషన్ స్టూడియోస్, ది రూట్ బ్యానర్లపై జగదీష్ పళని స్వామి, సుధన్ సుందరన్ ఈ చిత్రాన్ని సంయుక్తంగా నిర్మించారు. యంగ్ మ్యూజిక్ సెన్సేషన్ అజనీష్ లోకనాథ్ మహారాజా మూవీకి సంగీతం అందిస్తున్నారు. ఆయన మ్యూజిక్, బీజీఎమ్ ఈ సినిమాకి ప్లస్ పాయింట్ గా నిలవనుంది.

- Advertisement -

సేతుపతి కెరీర్ లో మరో మైల్ స్టోన్ సినిమా కానుందా?

ఇక మహారాజా (Maharaja) చిత్రంలో విజయ్ సేతుపతితో పాటు అనురాగ్ కశ్యప్, మమతా మోహన్ దాస్, భారతి రాజా, సింగం పులి, అరుణ్ దాస్ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. విజయ్ సేతుపతి నుండి సాలిడ్ కమ్ బ్యాక్ కోసం అభిమానులు ఎదురు చూస్తున్నారు. లాస్ట్ టైం మేరీ క్రిస్మస్ అనే సినిమాతో ఆడియన్స్ ని అలంకరించిన విజయ్ సేతుపతి ఆ సినిమాతో ఆశించిన విజయం సాధించలేదు. అయితే నటుడిగా మాత్రం ఇతర సినిమాలతో సక్సెస్ అంటుకుంటూనే ఉన్నారు. అలాగే విజయ్ సేతుపతి నటించిన విడుదలై2 కూడా త్వరలో రిలీజ్ కానుంది. ఇక ఈ మహారాజ చిత్రంతో విజయ్ సేతుపతి మరో సక్సెస్ ని అందుకోవడమే కాకుండా, తన కెరీర్ లో మంచి మైల్ స్టోన్ మూవీగా గొప్ప చిత్రంగా నిలిచే అవకాశం ఉందని ట్రేడ్ విశ్లేషకులు భావిస్తున్నారు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు