Maharaja Movie : విజయ్ మహారాజా… ఎంత మంది హీరోలు అంటే ఇష్టం… ప్రమోషన్స్ కాకుండా నిజం చెప్పండి

Maharaja Movie : మరి కొన్ని గంటల్లోనే మహారాజా అనే యాక్షన్ థ్రిల్లర్ మూవీతో ప్రేక్షకులను పలకరించబోతున్న తమిళ స్టార్ హీరో విజయ్ సేతుపతి ఇస్తున్న స్టేట్మెంట్స్ పై ట్రోలింగ్ మొదలైంది. మహారాజా మూవీ ప్రమోషన్స్ లో ఇప్పటిదాకా ఆయన ఇచ్చిన ప్రతి స్టేట్మెంట్ హాట్ టాపిక్కే అని చెప్పొచ్చు. రీసెంట్ గా మల్టీస్టారర్ సినిమాలు చేయను అంటూ తేల్చేసిన సేతుపతి తాజాగా ఫేవరెట్ హీరో ఎవరు అనే విషయంలో చెప్పిన సమాధానంపై నెటిజన్లు సెటైర్లు వేస్తున్నారు. ఇంతకీ విజయ్ సేతుపతి ఏం చెప్పాడు? అంటే…

రోజుకో స్టార్ హీరో ఫేవరెట్

మహారాజా మూవీకి సంబంధించిన ప్రమోషన్లలో బిజీగా ఉన్నాడు విజయ్ సేతుపతి. అయితే ఈ మూవీ ఫస్ట్ ప్రెస్ మీట్ లో మీకు ఇష్టమైన హీరో ఎవరు ? అని అడిగితే ఆలోచించకుండా బాలయ్య పేరు చెప్పాడు. ఆయనపై ఎన్ని ట్రోల్స్ వచ్చినా ఆయనంటే చాలా ఇష్టం అంటూ అభిమానాన్ని కురిపించాడు. దీంతో నందమూరి ఫ్యాన్స్ ఫుల్ ఖుషి అయ్యారు.

Vijay Sethupathi's Maharaja OTT Release Platform Revealed?

- Advertisement -

ఇక నిన్న ఓ మాల్ లో మహారాజా మూవీకి సంబంధించిన ప్రెస్ మీట్ జరగగా, మరోసారి ఫేవరెట్ హీరో ఎవరు అనే ప్రశ్న ఎదురైంది. అయితే ఈసారి సేతుపతి జూనియర్ ఎన్టీఆర్ పేరు చెప్పాడు. ఆ తర్వాత పవన్ కళ్యాణ్ తో సినిమా ఎందుకు చేయడం లేదు అని ప్రశ్నించగా, పవన్ కళ్యాణ్ అంటే నాకు ఇష్టం. కానీ ఆయనతో నటించే ఛాన్స్ రావట్లేదు. వస్తే మాత్రం కచ్చితంగా నటిస్తాను అంటూ మరో మారు తనకు ఇష్టమైన హీరో పేరు మార్చేశాడు. దీంతో విజయ్ మహారాజా అసలు ఎంత మంది ఫేవరెట్ హీరోలు ఉంటారు? మూవీ ప్రమోషన్స్ గురించి కాకుండా నిజంగా నీకు ఇష్టమైన హీరో ఎవరో చెప్పరాదు? అంటూ సెటైర్లు వేస్తున్నారు.

విజయ్ అలా చెప్పడానికి ఇదే కారణమా?

సాధారణంగా ఒక హీరోకు తన అభిమాన హీరో ఎవరు అనే ప్రశ్న ఇబ్బందికరంగా ఉంటుంది. ఎందుకంటే ఒక హీరో పేరు చెప్తే మరో హీరో అభిమానులు హర్ట్ అవుతారు. అందుకేనేమో విజయ్ సేతుపతి ఒక్కరి పేరు కాకుండా టాలీవుడ్ లో ఉన్న అందరూ హీరోల అభిమానులను ప్రసన్నం చేసుకునే పనిలో పడ్డాడు. అందుకే టైం చూసుకుని ఒక్కోసారి ఒక్కొక్కరి పేరు చెప్తున్నాడు. ప్రస్తుతానికి అయితే నందమూరి, జూనియర్ ఎన్టీఆర్, మెగా అభిమానులను ప్రసన్నం చేసుకున్నాడు. మరి సినిమా హిట్ అవ్వాలంటే ఈ మాత్రం స్ట్రాటజీ వాడాల్సిందే కదా. తమిళంలో అయితే ఆయన సినిమాకు తిరుగు లేదన్న విషయం తెలిసిందే.

కాగా మహారాజా సినిమాలో విజయ్ సేతుపతితో పాటు, మమతా మోహన్‌దాస్, అభిరామి, అనురాగ్ కశ్యప్, భారతిరాజా, తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. నితిలన్ స్వామినాథన్ దర్శకత్వం వహించగా, ప్యాషన్ స్టూడియోస్ బ్యానర్ పై జగదీష్ పళనిసామి, సుధన్ సుందరం ఈ మూవీని సంయుక్తంగా నిర్మించారు. కాంతారా ఫేమ్ అజనీష్ లోక్‌నాథ్ ఈ మూవీకి సంగీతం అందించారు. జూన్ 14 న ఈ మూవీ థియేటర్లలోకి రానుంది.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు