Mahesh Babu: మహేష్ వదులుకున్న బ్లాక్ బస్టర్ సినిమాలివే..!

Mahesh Babu.. టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో సూపర్ స్టార్ గా గుర్తింపు తెచ్చుకున్న మహేష్ బాబు (Mahesh Babu) భారీ పాపులారిటీ సొంతం చేసుకున్నారు. రెండు తెలుగు రాష్ట్రాలలో ఈయనకు ఎంతోమంది డైహార్డ్ ఫ్యాన్స్ ఉన్నారన్న విషయం తెలిసిందే. ఈయన సినిమాలు ఎప్పుడు వస్తాయని అభిమానులు కూడా ఎదురు చూస్తూ ఉంటారు. ఒక మూవీ రిలీజ్ అయ్యాక నెక్స్ట్ సినిమా అప్డేట్ కోసం ఎదురు చూస్తూ ఉంటారు. అయితే చివరిగా గుంటూరు కారం సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈయన ఇప్పుడు దర్శక ధీరుడు ఎస్ఎస్ రాజమౌళితో కలిసి ఎస్ఎస్ఎంబి 29 సినిమా కోసం పనిచేస్తున్నారు.

Mahesh Babu: Blockbuster movies that Mahesh gave up..!
Mahesh Babu: Blockbuster movies that Mahesh gave up..!

రాజమౌళి మూవీ కోసం మేకోవర్ చేసుకున్న మహేష్..

రాజమౌళి , మహేష్ బాబు కాంబినేషన్లో వస్తున్న ఈ సినిమా కోసం మహేష్ బాబు ఫుల్ మేకవర్ చేసుకున్నట్లు ఇప్పటికే మనకు క్లారిటీ కూడా వచ్చేసింది. గుబురు గడ్డం, ఫుల్ హెయిర్ తో పలుమార్లు కెమెరాకి కూడా చిక్కారు. ఇక త్వరలో ఎస్ ఎస్ ఎం బి 29 సినిమా షూటింగ్ మొదలుకానున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే తెలుగులో సూపర్ స్టార్ అయినా అనేక సూపర్ హిట్ ప్రాజెక్ట్లు వదులుకున్నారన్న విషయం చాలామందికి తెలియదని చెప్పాలి. మరి మహేష్ బాబు వదులుకున్న ఆ సినిమాలేంటి ..? ఆయన వదులుకున్న చిత్రాలను ఎవరు చేశారు..? అనే విషయాలు ఇప్పుడు చూద్దాం.

మహేష్ బాబు వదులుకున్న చిత్రాలు..

సూపర్ స్టార్ మహేష్ బాబు గత ఏడాది చివర్లో వచ్చిన సూపర్ హిట్ సినిమా యానిమల్ మూవీ ని వదులుకున్నారు. ఈ సినిమా కథ ముందుగా మహేష్ బాబు దగ్గరికి వెళ్ళింది. కానీ ఈ సినిమాలో హీరో పాత్ర తీరు నచ్చకపోవడంతో ఆయన రిజెక్ట్ చేశారు. దీంతో రణబీర్ కపూర్ ఆ చాన్స్ అందుకుని స్టార్ స్టేటస్ ను సొంతం చేసుకున్నారు.. ఈ చిత్రమే కాదు ఇంతకుముందు కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ అట్లీ దర్శకత్వం వహించిన జవాన్ , మణిరత్నం రూపొందించిన పొన్నియన్ సెల్వన్ తో పాటు పలు ప్రాజెక్టులు కూడా మహేష్ బాబు వదులుకున్నారు.

- Advertisement -

పుష్ప తో పాటు సూర్య 24..

ఇవే కాకుండా అల్లు అర్జున్ కు పాన్ ఇండియా రేంజ్ తీసుకొచ్చిన బ్లాక్ బాస్టర్ హిట్ మూవీ పుష్ప కూడా మహేష్ బాబు చేయాల్సి ఉంది. మొదట సుకుమార్ ఆయనకే కథ చెప్పగా హీరో మేకోవర్ నచ్చక మహేష్ బాబు ఒప్పుకోలేదు . ఆ తర్వాత అల్లు అర్జున్ ఒప్పుకోవడంతో ఈ సినిమా భారీ విజయాన్ని అందుకోవడమే కాదు అల్లు అర్జున్ కు ఏకంగా నేషనల్ అవార్డు అందించింది. అలాగే ఇప్పుడు పుష్ప 2 కూడా రిలీజ్ కి సిద్ధమవుతోంది. ఇంతకుముందు 2016 లో వచ్చిన సూర్య 24 సినిమా కూడా మహేష్ బాబు రిజెక్ట్ చేశారు.

ఫిదా, గజిని, వర్షం ఇలా ఎన్నో..

ఇవే కాదు శేఖర్ కమ్ముల దర్శకత్వంలో వచ్చిన ఫిదా సినిమాలో కూడా మహేష్ బాబు నటించాల్సి ఉండగా.. ఆయన ప్రాజెక్ట్ ను రిజెక్ట్ చేయడంతో అది కాస్త వరుణ్ తేజ్ కి దక్కి ఆయన హిట్ అందుకున్నారు. అలాగే సమంత డెబ్యూ మూవీ ఏ మాయ చేసావే , గజిని, వర్షం ఇలా ఎన్నో చిత్రాలను మహేష్ బాబు వదులుకున్నారు. ఇక ఈ సినిమాలు చేసిన హీరోలంతా కూడా ఈ సినిమాలతో భారీ విజయాన్ని సొంతం చేసుకోవడం గమనార్హం.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు