Mahesh Babu: మహేష్ బాబు దర్శకత్వంలో ఎనర్జిటిక్ హీరో

Mahesh Babu: సందీప్ కిషన్ హీరోగా నటించిన రా రా కృష్ణయ్య అనే సినిమాతో తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీకి దర్శకుడుగా పరిచయం అయ్యాడు మహేష్ బాబు. సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని సాధించుకుంది. కానీ అవకాశాలు మాత్రం ఊహించిన రీతిలో రాలేదు. అయితే మజిలీ సినిమాకి ఒక డిపార్ట్మెంట్ లో వర్క్ చేశాడు మహేష్ బాబు. తర్వాత ఇవి క్రియేషన్స్ బ్యానర్లు మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి అనే సినిమాకి దర్శకత్వం వహించాడు. ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద ఎంతటి ఘనవిజయాన్ని సాధించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అనుష్క నవీన్ పోలిశెట్టి నటించిన ఈ సినిమా మంచి కలెక్షన్స్ ను వసూలు చేసింది దర్శకుడుగా మహేష్ బాబును నిలబెట్టింది.

మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి బ్రేక్

కొన్నిసార్లు టాలెంట్ ఉన్నా కూడా అది బయటపడటానికి టైం పడుతుంది. అలా ఎన్నో ఏళ్ల నిరీక్షణ తర్వాత నవీన్ పోలిశెట్టితో సినిమా చేసి మంచి పేరును సాధించాడు. ప్రస్తుతం మహేష్ బాబుకి వరుస అవకాశాలు వస్తున్నట్లు తెలుస్తుంది. ఇకపోతే యంగ్ హీరో రామ్ తో సినిమా చేయబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. రామ్ ప్రస్తుతం పూరి దర్శకత్వంలో డబల్ ఇస్మార్ట్ అనే సినిమాను చేస్తున్నాడు. రామ్ కెరియర్లో రీసెంట్ టైమ్స్ లో హిట్ సినిమా పడి చాలా రోజులు అయింది. పూరి జగన్నాథ్ దర్శకత్వంలో వచ్చిన ఇస్మార్ట్ శంకర్ సినిమా తర్వాత ఇప్పటివరకు రామ్ కి సరైన హిట్ సినిమా కూడా లేదు. రామ్ అంచనాలన్నీ డబల్ ఇస్మార్ట్ సినిమా పైన ఉన్నాయి. ఈ సినిమా తర్వాత దర్శకుడు పరుశురాం తో కూడా సినిమా ఉండబోతుందని వార్తలు వినిపిస్తున్నాయి. దీని గురించి ఇంకా అధికార ప్రకటన రాలేదు.

 

- Advertisement -

Mahesh Babu: Energetic hero directed by Mahesh Babu

అప్పుడే అనౌన్సమెంట్

మహేష్ బాబు దర్శకత్వంలో రామ్ సినిమా వస్తుంది అని అంటే అందరికీ మంచి అంచనాలు మొదలయ్యాయి. ఎందుకంటే మహేష్ బాబు సెన్సిబిలిటీస్ ఏంటో రెండు సినిమాలు ద్వారా ఆల్రెడీ ప్రూవ్ అవుతూ వచ్చింది. ఇప్పుడు యంగ్ హీరో తో సినిమా సెట్ అయితే ఈ సినిమా కూడా ఆడియన్స్ ని ఎంటర్టైన్ చేస్తుందని కచ్చితంగా చెప్పొచ్చు. ఇకపోతే దీని గురించి ఇంకా అధికార ప్రకటన రావాల్సి ఉంది. డబుల్ ఇస్మార్ట్ శంకర్ రిలీజ్ తర్వాత దీని గురించి కంప్లీట్ డీటెయిల్స్ తెలియనున్నాయి.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు