Mahesh Babu: ఫ్యామిలీ ఫంక్షన్స్ లో కూడా మహేష్ సపరేట్ గా ఫుడ్ తెచ్చుకుంటాడు

Mahesh Babu: రోజులు పెరుగుతున్నకొద్దీ చాలామంది వయస్సు పెరుగుతూ ఉంటుంది. కానీ కొంతమందికి మాత్రమే తగ్గుతూ వస్తుంది. అలా తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో చూసుకుంటే సూపర్ స్టార్ మహేష్ బాబు ఒకరు అని చెప్పొచ్చు. ఏజ్ పెరుగుతున్న కొద్ది మహేష్ బాబు ఇంకా ఇంకా అందంగా కనిపిస్తుంటారు. రీసెంట్ గా వచ్చిన గుంటూరు కారం సినిమాలో మహేష్ ఎంత అందంగా ఉన్నాడు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. చాలా తగ్గిపోయి తన బాడీని పర్ఫెక్ట్ గా మెయింటైన్ చేస్తున్నాడు. ఇక అసలు విషయానికొస్తే ఒకప్పుడు ఏది పడితే అది తినేసే మహేష్ ఇప్పుడు మాత్రం చాలా పద్ధతిగా తింటున్నట్లు తెలుస్తుంది. ఫుడ్ విషయంలో కేర్ తీసుకుంటున్నట్లు సమాచారం.

ఎస్ఎంఎస్ అనే సినిమాతో తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీకి హీరోగా ఎంట్రీ ఇచ్చాడు సుధీర్ బాబు. అయితే సుధీర్ బాబు ఎన్ని సినిమాలు చేసినా కూడా అవి సరైన హిట్ గా నిలవలేదు. ఇంద్రగంటి మోహన్ కృష్ణ దర్శకత్వంలో వచ్చిన సమ్మోహనం సినిమా మంచి డీసెంట్ హిట్ అనిపించింది. అక్కడితో సుధీర్ బాబు కూడా వరుసగా అవకాశాలు రావడం మొదలయ్యాయి. ఆ తర్వాత డీసెంట్ హిట్ సినిమాలను చేయడం మొదలుపెట్టాడు. అయితే ప్రస్తుతం సుధీర్ బాబు చేస్తున్న సినిమా హరోం హర. ఈ సినిమాపై అందరికీ మంచి అంచనాలు ఉన్నాయి. రీసెంట్ గా రిలీజ్ అయిన ఈ టీజర్ కూడా ఆసక్తికరంగా అనిపించి సినిమాపై అంచనాలను మరిచి పెంచుతుంది.

Sudheer Babu

- Advertisement -

ఇది ఈ సినిమా రిలీజ్ సిద్ధంగా ఉన్న తరుణంలో సుధీర్ బాబు పలు రకాల ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. అయితే రీసెంట్ గా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న సుధీర్ బాబు మహేష్ బాబు గురించి ఆసక్తికరమైన విషయాలను బయట పెట్టాడు. ఆ ఇంటర్వ్యూలో ఫుడ్ తింటూ మాట్లాడుతుంటారు ఆ ఇంటర్వ్యూకి వచ్చిన గెస్ట్ లు. అయితే సుధీర్ బాబు కూడా మాట్లాడుతూ మహేష్ బాబు ఫుడ్ విషయంలో చాలా జాగ్రత్తగా ఉంటారు. ఒకప్పుడు ఏది పడితే అది తినేవారు కానీ ఇప్పుడు మాత్రం అలా తినట్లేదు. ఫ్యామిలీ ఫంక్షన్స్ అయినా కూడా తన ఫుడ్ తాను ప్రత్యేకంగా తెప్పించుకుంటాడు అని చెబుతూ వచ్చారు. ఎంత డైట్ పాటించినా కూడా కొన్ని సందర్భాల్లో ఫ్యామిలీ ఫంక్షన్స్ లో చాలామంది కొంచెం లిమిటెడ్ గా తింటూ ఉంటారు కానీ మహేష్ అలా కూడా తినడు అని ఈ విషయం విన్న తర్వాత అర్థమవుతుంది.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు