HaromHara: సుధీర్‌ బాబు కోసం రంగంలోకి ప్రిన్స్‌ !

Sudheer: సుధీర్ బాబు…గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. చేసింది తక్కువ సినిమాలు చేసినప్పటికీ… సుధీర్ బాబు ప్రతి ఒక్కరికి సుపరిచితమే. అయితే. సుధీర్ బాబు తన కెరీర్‌ లో ఎన్నో సినిమాల్లో నటించినప్పటికీ పెద్దగా సక్సెస్ కాలేకపోయాడు. హిట్లు, ఫ్లాపులతో సంబంధం లేకుండా సినిమాలలో నటిస్తూ ప్రేక్షకులను మెప్పిస్తారు. రీసెంట్ గా సుధీర్ నటించిన చిత్రం మామ మశ్చీంద్ర ఈ సినిమాలో సుధీర్ బాబు త్రిపాత్రాభినయంతో ఆడియన్స్ ని అలరించారు.

Mahesh Babu gonna launch HaromHaraTrailer tomorrow

అయినప్పటికీ ఈ సినిమా పెద్దగా సక్సెస్ కాలేకపోయింది. కానీ సుధీర్ బాబు నటనకి మంచి మార్కులు పడ్డాయి. ఈ క్రమంలోనే సుదీర్ తన కెరీర్ లో చేస్తున్న తొలి పాన్ ఇండియా చిత్రం ‘హరోం హర’. ఈ సినిమా సుధీర్ బాబు కెరీర్ లోనే మోస్ట్ అవైటెడ్ చిత్రం. జ్ఞాన సాగర్ ద్వారక ఈ సినిమాకి దర్శకత్వం వహించాడు. ప్రస్తుతం ఈ సినిమా ప్రమోషన్లు శర వేగంగా కొనసాగుతున్నాయి.

ఈ సినిమాకి జ్ఞాన సాగర్ ద్వారక దర్శకత్వం వహించగా…. సుమంత్ జి. నాయుడు నిర్మాతగా వ్యవహరించారు. ఈ సినిమాకి చైతన్ భరద్వాజ్ సంగీతం అందించారు. ఈ సినిమాలో సుధీర్ బాబు సరసన మాళవిక శర్మ హీరోయిన్ గా నటిస్తోంది. ఈ సినిమా 1989లో చిత్తూరులోని కుప్పం నేపథ్యంలో తెరకెక్కుతోంది. అయితే.. తాజాగా ఈ సినిమా నుంచి క్రేజీ అప్డేట్‌ వచ్చింది. ఈ సినిమా ట్రైలర్‌ ను మహేష్‌ బాబు చేతుల మీదుగా రిలీజ్‌ చేయనున్నారు. రేపు 11.25 am గంటలకు ఈ సినిమా ట్రైలర్‌ ను మహేష్‌ బాబు చేతుల మీదుగా రిలీజ్‌ చేయనున్నారు. ఈ మేరకు అధికారిక ప్రకటన చేశారు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు